శుక్రవారం శ్రీ 17 శ్రీ జూలై శ్రీ 2026 | - | Sakshi
Sakshi News home page

శుక్రవారం శ్రీ 17 శ్రీ జూలై శ్రీ 2026

Jul 17 2026 1:10 AM | Updated on Jul 17 2026 1:10 AM

– 8లోu

న్యూస్‌రీల్‌

జనగామ: జిల్లాలో ఉద్యాన పంటల విస్తరణ, ఆధునిక సాగు పద్ధతులకు ప్రోత్సాహం, రైతుల ఆదా యం పెంచే లక్ష్యంతో జిల్లా ఉద్యానవన శాఖ 2026–27 సంవత్సరానికి సమగ్ర కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసింది. జిల్లాలో మొత్తం 24,334 ఎకరాల్లో ఉద్యాన పంటల అభివృద్ధికి రూ.24,334 లక్షల ప్రణాళిక రూపొందించారు. ఇందులో మామిడి 8,882 ఎకరాలు, ఆయిల్‌పామ్‌ 8,283.14 ఎకరాలు ప్రధానంగా సాగవుతున్నాయి.

2,000 ఎకరాల్లో సూక్ష్మ నీటిపారుదల

పర్‌ డ్రాప్‌ మోర్‌ క్రాప్‌ (పీఎండీసీ) పథకం కింద జిల్లాలో 2,000ఎకరాల్లో సూక్ష్మ నీటిపారుదల వ్యవస్థల ఏర్పాటు కోసం రూ.6.287కోట్ల బడ్జెట్‌ కేటాయించారు. మండలాలకు లక్ష్యం నిర్దేశించారు.

వర్గాల వారీగా..

ఎస్సీ, ఎస్టీ రైతులకు 90 శాతం, బీసీ, ఎస్‌ఎఫ్‌, ఎంఎఫ్‌ రైతులకు 80 శాతం, ఇతర రైతులకు 70 శాతం వరకు రాయితీ ఇవ్వనుండగా, 12.50 ఎకరాలకు అర్హులు. ఇతర రైతులకు 70శాతం రాయితీతో 12.50 ఎకరాల వరకు లబ్ధి పొందవచ్చు. పోర్టబుల్‌ స్ప్రింక్లర నీటి పారుదల వ్యవస్థలకు అన్ని వర్గాల రైతులకు 65శాతం రాయితీ కల్పించారు. దరఖాస్తుదారులు సంబంధిత పత్రాలతో టీజీఎంఐపీ పోర్టల్‌ ద్వారా దరఖాస్తు చేసుకుంటే, క్షేత్ర పరిశీలన అనంతరం పరిపాలన అనుమతులు మంజూరు చేస్తారు.

ఎంఐడీహెచ్‌ కింద..

మిషన్‌ ఫర్‌ ఇంటిగ్రేటెడ్‌ డెవలప్‌మెంట్‌ ఆఫ్‌ హార్టికల్చర్‌ (ఎంఐడీహెచ్‌) కింద జిల్లాలో 659.49 హెక్టార్లలో రూ.4.29 కోట్లతో పలు ఉద్యాన పంటల అభివృద్ధికి లక్ష్యాలు నిర్ణయించారు. అరటి, బొప్పాయి, మామిడి, నిమ్మ, జామ, డ్రాగన్‌ఫ్రూట్‌, అవకాడో, పూలసాగు, ప్లాస్టిక్‌ మల్చింగ్‌, కూరగాయల గ్రాఫ్టులు, వ్యక్తిగత ఫార్మ్‌ పాండ్లకు 40 నుంచి 75 శాతం వరకు రాయితీలు అందించనున్నారు. డ్రాగన్‌ఫ్రూట్‌ సాగుకు ఎకరానికి రూ.2.70లక్షలు, అరటికి రూ.70 వేల వరకు, మామిడి, నిమ్మ, జామ, అవకాడో సాగుకు రూ.50 వేల వరకు అందించనున్నారు.

ఆయిల్‌పామ్‌ సాగుకు..

ఎన్‌ఎంఈఓ–ఆయిల్‌పామ్‌(ఎన్‌ఎంఈఓ, ఓపీ) పథ కం కింద జిల్లాలో 2,000 ఎకరాల్లో రూ.2.11 కోట్ల తో ఆయిల్‌పామ్‌ సాగు విస్తరణ చేపట్టనున్నారు. దిగుమతి మొక్కలకు మొక్కకు రూ.11,580, నాలు గు సంవత్సరాల నిర్వహణకు రూ.16,800 వరకు, రవాణా ఖర్చు మొక్కకు రూ.20 అందించనున్నారు.

శాశ్వత పందిళ్లు, మల్బరీ సాగుకు..

పీఎం–ఆర్‌కేవీవై కింద 28 హెక్టార్లలో రూ.70 లక్షలతో శాశ్వత పందిళ్ల నిర్మాణం చేపట్టనున్నారు. ఒక యూనిట్‌కు రూ.1 లక్ష వ్యయం ఉండగా, 50 శాతం (గరిష్ఠంగా రూ.50 వేల) రాయితీ అందించనున్నారు. అలాగే మల్బరీ సాగు, మల్బరీ రింగ్‌ బెడ్లు, టిష్యూ కల్చర్‌ మొక్కల పెంపకానికి కూడా ప్రత్యేక సబ్సిడీలు కల్పించనున్నారు.

సద్వినియోగం చేసుకోవాలి

జిల్లాలో 2026–27 సంవత్సరానికి ఉద్యాన పంటల విస్తరణకు ప్రభుత్వం పలు పథకాల కింద రాయితీలు అందిస్తోంది. సూక్ష్మనీటిపారుదల, పండ్ల తోటల ఏర్పాటు, ఆయిల్‌పామ్‌, డ్రాగన్‌ ఫ్రూట్‌, పూలసాగు, ప్లాస్టిక్‌ మల్చింగ్‌, శాశ్వత పందిళ్లు వంటి పథకాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి. ఆసక్తి గల రైతులు ఆధార్‌, పట్టాదారు పాస్‌బుక్‌, బ్యాంకు ఖాతా వివరాలతో సమీప ఉద్యానవన శాఖ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలి.

– అంబికాసోని, జిల్లా వ్యవసాయశాఖ, ఇన్‌చార్జ్‌ హార్టికల్చర్‌, సెరికల్చర్‌ అధికారి

2026–27కు ఉద్యానవన శాఖ సమగ్ర ప్రణాళిక సిద్ధం

రైతులకు కోట్ల రూపాయల రాయితీలు

2 వేల ఎకరాల్లో సూక్ష్మ నీటిపారుదల లక్ష్యం

అరటి నుంచి డ్రాగన్‌ఫ్రూట్‌ వరకు సబ్సిడీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement