సర్‌లో ఘన్‌పూర్‌ స్పీడ్‌ | - | Sakshi
Sakshi News home page

సర్‌లో ఘన్‌పూర్‌ స్పీడ్‌

Jul 13 2026 1:22 AM | Updated on Jul 13 2026 1:22 AM

మొత్తం 7,67,484 3,66,628 3,64,327 1,89,198 (47.77శాతం)(47.47శాతం) (25.65శాతం)

జనగామ: జిల్లాలో ఓటరు జాబితా ప్రత్యేక సవరణ (ఎస్‌ఐఆర్‌) ప్రక్రియ వేగంగా సాగుతోంది. జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్‌, పాలకుర్తి నియోజకవర్గాల్లో ఫారాల పంపిణీ దాదాపు పూర్తికాగా, ఆదివారం మధ్యాహ్నం 2 గంటల వరకు నమోదైన గణాంకాల ప్రకారం 7.67 లక్షల ఓటర్లలో 47శాతం ఫారాలు ఇప్పటికే డిజిటైజేషన్‌ అయ్యాయి. స్టేషన్‌ ఘన్‌పూర్‌ నియోజకవర్గం డిజిటైజేషన్‌లో జిల్లాలో ముందంజలో ఉండగా, మిగిలిన ప్రక్రియను అధికారులు యుద్ధప్రాతిపదికన కొనసాగిస్తున్నారు. మూడు నియోజకవర్గాల్లో 865 మంది బీఎల్‌ఓలు విధులు నిర్వహిస్తున్నారు.

ఎస్‌ఐఆర్‌ ఇలా...

జిల్లాలో ఇప్పటి వరకు 3,66,628 ఫారాలు (47.77 శాతం) డిజిటైజ్‌ చేయగా, 3,95,329 ఫారాలు (51.28 శాతం) ఇంకా మిగిలి ఉన్నాయి. ఓటర్లే స్వయంగా సమర్పించిన లేదా బీఎల్‌ఓలు ధ్రువీకరించిన ఫారాల సంఖ్య 1,859 (0.24 శాతం)గా నమోదైంది. అలాగే బీఎల్‌ఓల ద్వారా 3,64,327 ఫారాల(47.47 శాతం)ను ధ్రువీకరించగా, 1,89,198 మంది (24.65 శాతం) తమ వివరాలను స్వయంగా మ్యాప్‌ చేసుకున్నారు. కుటుంబ సభ్యుల ద్వారా 1,69,820 మంది(22.13 శాతం) వివరాలు మ్యాప్‌ చేయించుకున్నారు. ఇంకా 5, 311(0.69 శాతం) ఫారాలకు మ్యాపింగ్‌ జరగాల్సి ఉండగా, మొత్తం 73,838 ఫారాల్లో లోపాలు ఉన్నట్లు(9.62 శాతం) గుర్తించారు.

‘స్టేషన్‌’ ముందజ

సర్‌ ఫారాల డిజిటైజేషన్‌లో స్టేషన్‌ ఘన్‌పూర్‌ నియోజకవర్గం ముందంజలో ఉంది. జనగామ, పాలకుర్తి నియోజకవర్గాల్లో కూడా అధికారులు క్షేత్రస్థాయిలో ప్రక్రియను వేగవంతం చేస్తున్నారు. జనగామలో ప్రోజెనీ(వారసత్వ) మ్యాపింగ్‌ 53,983 (21.64 శాతం)గా నమోదైంది. 23,645 లోపాలు (9.48 శాతం) గుర్తించారు. ఘన్‌పూర్‌లో ప్రోజెనీ(వారసత్వ)మ్యాపింగ్‌ 61,724 (24.04 శాతం)గా నమోదైంది. 25,570 లోపాలు(9.96 శాతం)గా ఉన్నాయి. పాలకుర్తిలో ప్రోజెనీ (వారసత్వ) మ్యాపింగ్‌ 54,113 (20.71 శాతం)గా నమోదైంది. 24,623 లోపాలు (9.43 శాతం)గా గుర్తించారు.

వేగంగా డిజిటైజేషన్‌

జిల్లాలో ఫారాల ప్రక్రియ 100 శాతం పూర్తవడం ఎన్నికల నిర్వహణలో కీలక ముందడుగుగా నిలిచింది. అయితే డిజిటైజేషన్‌ ప్రక్రియ వేగంగా సాగుతోంది. మిగిలిన ఫారాల నమోదు, లోపాల పరిష్కారం, మ్యాపింగ్‌ ప్రక్రియను వేగవంతం చేస్తే ఎస్‌ఐఆర్‌ ప్రక్రియను నిర్దేశిత గడువులో పూర్తి చేసే అవకాశం ఉంది.

ఫారాల భర్తీకి ప్రత్యేక శిబిరాలు

జిల్లా వ్యాప్తంగా స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ (ఎస్‌ఐఆర్‌) ఫారాల భర్తీలో ఓటర్లకు ఎదురవుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. బీఎల్‌ఓలతో పాటు వివిధ శాఖల అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, యువకులు, విద్యార్థులు కలిసి గ్రామపంచాయతీలు, కాలనీలు, వార్డులు, ప్రధాన కూడళ్లలో ప్రత్యేక సహాయ శిబిరాలను ఏర్పాటు చేశారు. ఈ శిబిరాల్లో ఓటర్లకు ఫారాల నింపడం, అవసరమైన పత్రాల పరిశీలన, వివరాల నమోదు, సందేహాల నివృత్తిలో సహకారం అందిస్తున్నారు. నిర్ణీత గడువులో ప్రతీ అర్హత కలిగిన ఓటరు ఎస్‌ఐఆర్‌ ప్రక్రియను పూర్తి చేసుకునేలా అధికారులు విస్తృత అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు.

జిల్లాలో వేగంగా ఎన్యుమరేషన్‌ ఫారాల డిజిటైజేషన్‌

7.67 లక్షల ఓటర్లలో 47శాతం ఫారాలు పూర్తి

కొనసాగుతున్న లోపాల గుర్తింపు

ఊరూరా జీపీలు, స్వచ్ఛంద సంస్థల సహకారం

మూడు నియోజకవర్గాల వారీగా ఎస్‌ఐఆర్‌ పురోగతి

నియోజకవర్గం ఓటర్లు డిజిటైజేషన్‌ బీఎల్‌ఓ స్వీయ

ధ్రువీకరణ మ్యాపింగ్‌

జనగామ 2,49,437 1,11,797 1,10,999 55,108

స్టే.ఘన్‌పూర్‌ 2,56,806 1,37,052 1,36,199 73,156

పాలకుర్తి 2,61,241 1,17,779 1,17,129 60,934

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement