యువత క్రీడా నైపుణ్యాలు పెంపొందించుకోవాలి | - | Sakshi
Sakshi News home page

యువత క్రీడా నైపుణ్యాలు పెంపొందించుకోవాలి

Jul 13 2026 1:16 AM | Updated on Jul 13 2026 1:16 AM

జనగామ రూరల్‌: యువత చదువుతో పాటు క్రీడా నైపుణ్యాలు పెంపోందించుకోవాలని తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ ఉప సంచాలకుడు రవీందర్‌ పిలుపునిచ్చారు. తెలంగాణ స్పోర్ట్స్‌ నాలెడ్జ్‌ ఆన్‌ వీల్స్‌ ఆధ్వర్యంలో పట్టణంలోని ఎంజేపీ బాలుర పాఠశాలలో నిర్వహించారు. ఈసందర్భంగా క్రీడాకారులకు ఆధునిక శిక్షణ విధానాలు, ఫిట్‌నెస్‌ స్పోర్ట్స్‌ అండ్‌ సైన్స్‌, పోషకాహారం గాయాల నివారణ, క్రీడల్లో ఉన్నత ప్రతిభ సాధనకు అవసరమైన అంశాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి నరసింహరావు, అంతర్జాతీయ కోచ్‌ రామకృష్ణ, స్కేటింగ్‌ కోచ్‌ విజయ భాస్కర్‌, స్విమ్మింగ్‌ కోచ్‌ శశాంక్‌, ఫిజియోథెరపీ నిపుణులు, గోకుల్‌ పాలిటెక్నిక్‌ క్రీడాకారులు, శారీరక విద్య ఉపాధ్యాయులు, కోచ్‌లు హాజరయ్యారు.

భూసమస్యల

పరిష్కారానికే రీసర్వే

కొడకండ్ల: భూ సమస్యలకు శాశ్వత పరిష్కారంతో పాటు భూ భారతి చట్టాన్ని సమర్థవంతంగా అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం భూ రీసర్వే కార్యక్రమాన్ని చేపట్టిందని అదనపు కలెక్టర్‌(రెవెన్యూ) బెన్‌షాలోమ్‌ అన్నారు. ఆదివారం నర్సింగాపురం గ్రామంలో నిర్వహించిన భూ భారతి–భూ సర్వే అవగాహన సదస్సులో అదనపు కలెక్టర్‌ మాట్లాడుతూ.. ఆధునిక సాంకేతికతతో భూముల సరిహద్దులను కచ్చితంగా నిర్ధారించి భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపేందుకే ప్రభుత్వం రీసర్వేను నిర్వహిస్తుందన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ ఉత్తలూరి అనీల్‌బాబు, ఎంపీడీఓ రవిందర్‌, జీపీఓ భిక్షపతి పాల్గొన్నారు.

పట్టణ అభివృద్ధికి నిధులు తీసుకొస్తా

ఎంపీ చామల కిరణ్‌ కుమార్‌ రెడ్డి

జనగామ: పట్టణ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వ నిధులను తీసుకురావడానికి కృషి చేస్తానని భువనగిరి ఎంపీ చామల కిరణ్‌ కుమార్‌రెడ్డి అన్నారు. ఆదివారం పట్టణంలోని 23వ వార్డు శ్రీమల్లన్న దేవాలయం వద్ద చేపట్టనున్న ప్రహారీ, కమ్యూనిటీ హాల్‌ నిర్మాణ పనులకు ఎంపీ కిరణ్‌ కుమార్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం మల్లన్న స్వామిని దర్శించుకుని విలేకరులతో మాట్లాడారు.. అర్బన్‌ చాలెంజ్‌ ఫండ్‌ ద్వారా రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా మరిన్ని నిధులు సమకూరేలా ప్రయత్నిస్తానని చెప్పారు. పట్టణానికి అవసరమైన మౌలిక వసతుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షురాలు ధన్వంతిలక్ష్మినారాయణనాయక్‌, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ కడకంచి బాలమణి శ్రీనివాస్‌, ఏఎంసీ చైర్మన్‌ బనుక శివరాజ్‌ యాదవ్‌, మున్సిపల్‌ కమిషనర్‌ రాజశేఖర్‌రెడ్డి, కౌన్సిలర్లు, కాంగ్రెస్‌ నాయకులు పాల్గొన్నారు.

‘కస్తూర్బా’లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

చిల్పూరు: మండలంలోని రాజవరం గ్రామ సమీపంలో ఉన్న కేజీబీవీలో ఇంటర్‌ ఫస్టియర్‌ ఎంపీసీలో–15, బైపీసీలో 5 సీట్లు ఖాళీలు ఉన్నట్లు ఎస్‌ఓ స్వప్న ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. మండలంలో 10వ తరగతి పూర్తి చేసిన అమ్మాయిలు ఈ అవకాశాన్ని సధ్వినియోగం చేసుకోవాలన్నారు. ఈనెల 14 లోపు సర్టిఫికెట్లతో కేజీబీవీలో సంప్రదించాలని కోరారు.

ఖిలాషాపూర్‌లో..

రఘునాథపల్లి: మండలంలోని ఖిలాషాపూర్‌ కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో ఎంఎల్‌టీ ఫస్టియర్‌ కోర్సులో 20 సీట్లు ఖాళీగా ఉన్నట్లు స్పెషల్‌ ఆఫీసర్‌ జి.హేమలత తెలిపారు. వివరాల కోసం 9666940586 నెంబర్‌లో సంప్రదించాలని పేర్కొన్నారు.

దేవరుప్పులలో..

పాలకుర్తి టౌన్‌ (దేవరుప్పుల): దేవరుప్పుల మండలంలోని కస్తూర్బా బాలికల విద్యాలయంలో స్పాట్‌ అడ్మిషన్లకు అవకాశం ఉన్నట్టు ప్రత్యేక అధికారి రజిత తెలిపారు. ప్రస్తుతం 6వ తరగతిలో 10సీట్లు, 7వ తరగతిలో 20, ఇంటర్‌ బైపీసీలో 20, ఎంపీసీలో 20 ఖాళీగా ఉన్నాయని, ఆసక్తి గల విద్యార్థినులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement