జనగామ: పట్టణంలో నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్న మటన్ దుకాణాలు, అక్రమ వధశాలలపై మున్సిపల్ యంత్రాంగం ఉక్కుపాదం మోపుతోంది. కమిషనర్ సీహెచ్.రాజశేఖర్‌రెడ్డి నేతృత్వంలో ఆదివారం చేపట్టిన తనిఖీల్లో మున్సి పల్ అనుమతులు లేకుండా మేకలు, గొర్రెలను అక్రమంగా నిల్వ ఉంచి వధ చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. అక్కడ ఉన్న సుమారు 20 కిలోల నాసిరకం, అపరిశుభ్ర పరిస్థితుల్లో నిల్వ ఉంచిన మాంసాన్ని స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. గతంలో పలుమార్లు హెచ్చరించినప్పటికీ నిబంధనలు పాటించకుండా వ్యాపారం కొనసాగించడంతో సంబంధిత నిర్వాహకుడు కరన్‌లాల్‌కు రూ.లక్ష జరిమానా విధించినట్లు అధికారులు తెలిపారు. ఈసందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం గుర్తించిన, అనుమతి పొందిన స్లాటర్ హౌస్‌లలో మాత్రమే జంతువులను వధించాలని, అక్కడి నుంచి పరిశుభ్రమైన, నాణ్యమైన మాంసాన్నే వినియోగదారులకు విక్రయించాలని సూచించారు. నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
రూ.లక్ష జరిమానా, నాసిరకం
మాంసం స్వాధీనం
ప్రజారోగ్య పరిరక్షణే లక్ష్యం: మున్సిపల్ కమిషనర్


