గ్రామాల్లో నిర్మించిన సెగ్రిగేషన్ షెడ్లలో కంపోస్ట్ ఎరువుల తయారీ అటకెక్కింది.సెగ్రిగేషన్ షెడ్డులో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అరలలో తడి, పొడి చెత్తను వేరుచేయాలి. వర్మీ కంపోస్ట్ తయారు చేసి దాన్ని విక్రయించగా వచ్చిన సొమ్మును గ్రామ పంచాయతీ అభివృద్ధికి ఉపయోగించాలి. కానీ, ఈ ప్రక్రియను పలు పంచాయతీలు అమలు చేయడంలేదు. సేకరించిన చెత్తను డంపింగ్‌యార్డులకు తరలించి అక్కడ తగలబెడుతున్నారు. మెట్‌పల్లి మండలం పెద్దాపూర్ డంపింగ్‌యార్డ్‌లో ఇలా చెత్తను తగలబెట్టారు. అధికారుల పర్యవేక్షణ కొరవడడంతోనే ఈ ప్రక్రియ జరగడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. – మెట్‌పల్లిరూరల్


