జగిత్యాలక్రైం: బాసర జోన్ ఎకై ్సజ్‌శాఖ ఎన్నికల్లో జిల్లా కానిస్టేబుళ్లు విజయం సాధించారు. ఆదివారం సుభాష్‌నగర్‌లోని ఆల్ పెన్షనర్స్ సీనియర్ సిటిజన్ భవన్‌లో ఎన్నికలు నిర్వహించారు. చైర్మన్‌గా చంద్రమోహన్, కై లాస్ పవర్ పోటీపడగా, ఇద్దరికీ సమానంగా ఓట్లు రావడంతో డ్రా పద్ధతిలో కై లాస్ పవర్ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. వైస్‌చైర్మన్‌గా లింబాద్రి ఏకగ్రీవం కాగా, కోశాధికారిగా చల్ల బాబు ఎన్నికయ్యారు. జిల్లాకు చెందిన వారు ముగ్గురు ఎన్నికల్లో విజయం సాధించారు. ఎన్నికల అధికారిగా విలాస్, అసిస్టెంట్ ఎన్నికల అధికారిగా బాలకిషన్, కో ఆపరేటివ్ ఇన్‌స్పెక్టర్ అబ్దుల్ ఖలీమ్ వ్యవహరించారు.
కవులకు సన్మానం
జగిత్యాలజోన్: జిల్లాలోని పలువురు కవులకు ఆదివారం హైదరాబాద్‌లో సన్మానం జరిగింది. జన జాగృతి కళా సమితి హైదరాబాద్‌లో నిర్వహించిన ‘కవి సాయంత్రం’ కవి సమ్మేళనంలో జిల్లాకు చెందిన కవులు వొదెల గంగాధర్, మార విజయలక్ష్మి, లక్కరాజు శ్రీలక్ష్మి పాల్గొని తమ కవితలు వినిపించారు. ఈ సందర్భంగా కవులను రాష్ట్ర సివిల్ సప్‌లై అధికారి జీవీ శ్యాంప్రసాద్‌లాల్, తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్ సంచాలకులు మామిడి హరికృష్ణ సన్మానించారు. నిర్వాహకులు ముక్కెర సంపత్, కవిత తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రస్థాయి యోగా పోటీలకు ఎంపిక
ధర్మపురి: ధర్మపురి ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులు రాష్ట్రస్థాయి యోగా పోటీలకు ఎంపికయ్యారు. ఇటీవల జిల్లా కేంద్రంలో జిల్లా యోగా అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీల్లో ప్రశాంత్, అభినయ్, షైనీ, శివ సత్తాచాటి పతకాలలు సాధించారు. ఈసందర్భంగా విద్యార్థులను హెచ్‌ఎం మహేందర్, పీడీ కవిత, ఉపాధ్యాయులు అభినందించారు.
జిల్లాలో చిరుజల్లులు
జగిత్యాలఅగ్రికల్చర్: జిల్లాలో ఆదివారం పొద్దంతా చిరుజల్లులు కురిశాయి. జిల్లాలో సగటున 7.4 మి.మీ వర్షం కురువగా, అత్యధికంగా సారంగాపూర్‌లో 18.2 మి.మీ, అత్యల్పంగా మల్లాపూర్‌లో 2.1 మి.మీ వర్షపాతం నమోదైంది. ఎండపల్లిలో 13.6, గొల్లపల్లి 13.2, బీర్‌పూర్ 11.6, కథలాపూర్ 10.5 మి.మీ వర్షపాతం నమోదు కాగా, మిగతా మండలాల్లో 10 మి.మీ కంటే తక్కువ వర్షపాతం నమోదైంది.
సీఎంను విమర్శించడం సరికాదు
కోరుట్లటౌన్: సీఎం రేవంత్‌రెడ్డిని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ విమర్శించడం సరికాదని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకుడు జువ్వాడి కృష్ణారావు అన్నారు. ఆదివారం జువ్వాడి భవన్‌లో మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి నీటిని ఎత్తిపోయరా.. అని సీఎంను ఎమ్మెల్యే విమర్శంచడం విడ్డూరంగా ఉందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో పిల్లర్లు కుంగిపోయాయని, నీరు నిల్వ చేస్తే ప్రమాదమని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నివేదిక ఆధారంగా నీటిని నిల్వ చేయలేదన్నారు. ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ కుటుంబం బినామీ పేరిట కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ పనులు చేశారని, అవినీతికి పాల్పడి నాసిరకం పనులు చేపట్టారని ఆరోపించారు. మున్సిపల్ వైస్ చైర్మన్ షహీద్, కాంగ్రెస్ మండల మాజీ అధ్యక్షుడు కొంతం రాజం, కోరుట్ల ఉపాధ్యక్షుడు ఎంఏ నయీం, నాయకులు పాల్గొన్నారు.


