వసతుల కల్పనకు ప్రాధాన్యం | - | Sakshi
Sakshi News home page

వసతుల కల్పనకు ప్రాధాన్యం

Aug 2 2026 12:52 AM | Updated on Aug 2 2026 12:52 AM

● రూ.74 లక్షలతో కరెంట్‌ తీగల షిఫ్టింగ్‌ ● ప్రజా ప్రభుత్వంలో నిరుపేదలకు సంక్షేమం ● మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌

● రూ.74 లక్షలతో కరెంట్‌ తీగల షిఫ్టింగ్‌ ● ప్రజా ప్రభుత్వంలో నిరుపేదలకు సంక్షేమం ● మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌

గొల్లపల్లి: ధర్మపురి నియోజకవర్గంలో విద్యుత్‌ వసతుల కల్పనకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ తెలిపారు. గొల్లపల్లి మండలంలో రూ.74 లక్షల వ్యయంతో 11 కేవీ, 33 కేవీ విద్యుత్‌ తీగల షిఫ్టింగ్‌ పనులకు శ్రీకారం చుట్టామన్నారు. మండలకేంద్రంలో సంబంధిత అధికారులతో శనివారం పనులను ప్రారంభించారు. విద్యుత్‌ వ్యవస్థ బలోపేతం కోసం ప్రభుత్వం రూ.4 కోట్లు మంజూరు చేస్తే.. ఒక్క గొల్లపల్లి మండలానికే రూ.2.3 కోట్ల నిధులు కేటాయించామన్నారు. విద్యుత్‌ లైన్ల షిఫ్టింగ్‌ పనులను నాణ్యతతోపే పూర్తి చేయాని సూచించారు. అనంతరం 75 మందికి రూ.25.63 లక్షల సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో సర్పంచ్‌ నల్ల నీరజ, గ్రంథాలయ చైర్మన్‌ సంగనభట్ల దినేష్‌, ఏఎంసీ చైర్మన్‌ బీమ సంతోష్‌, విద్యుత్‌ శాఖ ఎస్‌ఈ బి.సుదర్శనం, డీఈఈ గంగారాం, ఏడీఈ వరుణ్‌ కుమార్‌, ఏఈ రాకేష్‌ కుమార్‌, ఉపసర్పంచ్‌ జి.బుచ్చిరెడ్డి, సబ్‌ ఇంజినీర్లు పాల్గొన్నారు.

ప్రతి ఎకరాకూ సాగు నీరు

వెల్గటూర్‌: సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేసి ప్రతి ఎకరానికీ నీరు అందిస్తామని మంత్రి తెలిపారు. మండలంలోని స్తంభంపల్లిలోని చెరువును పరిశీలించారు. వర్షాలకు చెరువు ప్రమాదకరంగా మారడంతో శాశ్వత రక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. స్తంభంపల్లి లిఫ్ట్‌, చెరువు మత్తడి, తూముల వెడల్పు పనులకు రూ.5లక్షలు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు శైలేందర్‌రెడ్డి, ఏఎంసీ చైర్మన్‌ తిరుపతి, సర్పంచులు, అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement