సిరిసిల్ల: నాకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు.. బెస్ట్ ఫ్రెండ్ ఎవరని చెప్పడం కష్టమే. మహారాష్ట్రలో నా బెస్ట్ ఫ్రెండ్ పృథ్వీరాజ్ చవాన్ ఉన్నారు. మేం 14 ఏళ్లుగా స్నేహితులం. నా కాలేజీ రోజుల్లో రూమ్‌మేట్. అనుకోకుండా ఓ సారి అనారోగ్యం బారిన పడ్డారు. ఆస్పత్రికి వెళ్లి పరీక్షలు చేయిస్తే కేన్సర్‌గా తేలింది. ఆ సమయంలో నేను అతనికి, అతని కుటుంబానికి అండగా నిలబడ్డాను. అప్పుడు ఐపీఎస్ కాలేదు. కానీ రూ.6లక్షల వరకు ఆర్థిక సాయం అందించాను. పృఽథ్వీరాజ్ చవాన్ ఇప్పుడు కేన్సర్ నుంచి కోలుకున్నారు. సినీ పరిశ్రమలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేస్తున్నారు. ఇప్పటికీ మేం ఫోన్‌లో మాట్లాడుకుంటాం.
– మహేశ్ బి గితే, ఎస్పీ, రాజన్న సిరిసిల్ల


