జగిత్యాల: జిల్లా కేంద్రంలో రైతుబజార్‌ను కొద్దిరోజుల క్రితం వినియోగంలోకి తెచ్చారు. అప్పటివరకు రైతుబజార్ ముందున్న రోడ్డుపైనే రైతులు కూరగాయలు విక్రయించారు. అక్కడ ఆస్పత్రి, కాలేజీ తదితర ఉండటంతో ప్రజలకు ఇబ్బందికరంగా మారింది. దీంతో వ్యాపారులను రైతుబజార్‌లోకి పంపించారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. ప్రజలు రైతుబజార్ వెనుక వైపు నుంచే వెళ్లి కొనుగోలు చేసుకోవాలని మెయిన్ గేటు మూసివేశారు. ఫలితంగా ముందు వైపు నుంచి వస్తున్న ప్రజలకు ఇబ్బందికరంగా మారింది. వెనుక వైపు రూటు చాలా మందికి తెలియదు. గేటు ఎందుకు మూశారో తెలియని పరిస్థితి నెలకొంది.


