జగిత్యాల: వైద్య సదుపాయాల విస్తరణకు కృషి చేస్తానని ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ అన్నారు. పట్టణంలోని మోతె కార్యాలయంలో 80 మంది లబ్ధిదారులకు మంజూరైన రూ.80లక్షల విలువైన చెక్కులను శనివారం అందించారు. మెడికల్ కళాశాలలో 800 పడకలు అందుబాటులో ఉండేలా కృషి చేస్తున్నానన్నారు. డిప్లోమో ఇన్ ఈసీజీ, డయాలసిస్ ట్రైనింగ్, పారామెడికల్ కోర్సులు అందుబాటులో ఉన్నాయన్నారు. త్వరలోనే వెల్‌నెస్ సెంటర్ ఏర్పాటవుతుందన్నారు. ట్రామా సెంటర్ రానుందన్నారు. డీసీసీ అధ్యక్షుడు గాజంగి నందయ్య, ఏఎంసీ చైర్మన్ నారాయణరెడ్డి, బండ శంకర్, గట్టు సతీశ్, నాగభూషణం పాల్గొన్నారు.
శ్రీలక్ష్మీనృసింహస్వామి ఆలయాభివృద్ధికి కృషి
రాయికల్: రాయికల్ మండలం భూపతిపూర్‌లోని శ్రీలక్ష్మీనృసింహస్వామి ఆలయాభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే అన్నారు. స్వామివారి ఆలయ కమిటీ చైర్మన్‌గా ఎన్నికై న జక్కుల చంద్రశేఖర్, కమిటీ సభ్యులు ఎమ్మెల్యేను కలిశారు. గుర్రం భావన, మహేందర్, సింగిల్ విండో మాజీ చైర్మన్ శేఖర్‌రెడ్డి, ఉపసర్పంచ్ సంజీవాచారి, కమిటీ సభ్యులు దిలీప్, జక్కుల సాగర్, మహేందర్, నాగరాజు, అర్చకులు వెంకటకృష్ణ, ప్రదీప్ పాల్గొన్నారు.
అవయవదానంతో ఆరుగురి జీవితాల్లో వెలుగు
కొడిమ్యాల: మండలంలోని పూడూరుకు చెందిన పొన్నం మల్లేశంగౌడ్ (59) మరణానంతరం చేసిన అవయవదానం ఆ రుగురు జీవితాల్లో కొత్త వెలుగులు నింపింది. మూడురోజుల క్రితం అస్వస్థతకు గురైన మల్లేశంను చికిత్స కోసం హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రికి తరలించగా, వైద్యులు బ్రెయిన్‌డెడ్‌గా నిర్ధారించారు. దీంతో భార్య రేణుక, కుమారులు భార్గవ్, భరత్ స్వచ్ఛందంగా అవయవదానానికి అంగీకరించి ఆదర్శంగా నిలిచారు.
గోరింటాకు వేడుకల్లో గంగవ్వ
జగిత్యాలటౌన్: పట్టణంలోని వాల్మీకి ఆవాసం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత కుట్టు మిషన్ శిక్షణ కేంద్రంలో శనివారం నిర్వహించిన గోరింటాకు వేడుకల్లో మై విలేజ్‌షో, బిగ్‌బాస్ ఫేం గంగవ్వ, చందు పాల్గొని సందడి చేశారు. గోరింటాకు పండుగ అనాదిగా వస్తున్న సంప్రదాయమని, ఆరోగ్యరీత్యా ఎంతో ఉపయోగకరమైనదని పేర్కొన్నారు. న్యాయవాది భీమనాతిని ఉమాదేవి, ఆర్‌ఎస్‌ఎస్ విభాగ్ ప్రముఖ్ భానుచందర్, కౌన్సిలర్ బోయినిపల్లి ప్రశాంత్‌రావు, సేవాభారతి జిల్లా అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం, సభ్యులు శ్రీనివాస్, సంపూర్ణాచారి, మధుకర్, సత్యం తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే సంజయ్‌కుమార్


