సిరిసిల్ల పట్టణంలోని సుభాష్‌నగర్‌కు చెందిన అడుప కిరణ్ స్థానికంగా పదోతరగతి వరకు సరస్వతీ శిశుమందిర్‌లో చదువుకున్నారు. పాలిటెక్నిక్ ర్యాంకు సాధించి హైదరాబాద్‌లోని రామంతాపూర్‌లో మెకానికల్‌లో డిప్లొమా చేశారు. అనంతరం డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్(డీఆర్‌డీవో)లో చేరారు. శ్రీహరికోటలో ఐదేళ్లుగా రాకెట్ క్యాడ్ డిజైనర్‌గా రాకెట్ రూపకల్పనకు సంబంధించిన డిజైన్ పనుల్లో కీలకపాత్ర పోషించారు. అతని తల్లిదండ్రులు ఆడుప ఇందిరా, కిషన్. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉంటున్నారు.


