
నృసింహస్వామి సన్నిధిలో మంత్రి అడ్లూరి
గొల్లపల్లి: రాఖీపౌర్ణమి సందర్భంగా ధర్మపురి శ్రీలక్ష్మీనరసింహ స్వామి వారిని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ శనివారం దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం రక్షాబంధన్ వేడుకల్లో పాల్గొన్నారు.
భక్తజన సంద్రంగా గోదావరి
ధర్మపురి: శ్రావణ శనివారం, పౌర్ణమి సందర్భంగా ధర్మపురి గోదావరి భక్త జనసంద్రంగా మారింది. వివిధ ప్రాంతాల నుంచి వేలాదిగా భక్తులు తరలివచ్చి స్నానాలు ఆచరించారు. అనంతరం ఆలయాల్లో మొక్కులు చెల్లించుకున్నారు.
కథలాపూర్ చేరిన వరదకాలువ నీరు
కథలాపూర్: ఎస్సారెస్పీ నుంచి ఈనెల 7న వరదకాలువకు నీరు వదలగా.. శనివారం మండలంలోని గ్రామాలకు చేరాయి. వరదకాలువలో నీరు లేక పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆందోళన చెందారు. ఆలస్యంగానైనా నీటి విడుదలతో రైతుల్లో ఆశలు చిగురించాయి. పెగ్గెర్ల, కథలాపూర్, దుంపేట, దూలూర్, తక్కళ్లపెల్లి గ్రామాల మీదుగా నీరు ప్రవహించడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఇందిరమ్మ ఇళ్లకు జీవన్‌రెడ్డి భూమిపూజ
జగిత్యాలరూరల్: జగిత్యాల రూరల్ మండలం చల్‌గల్ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి మాజీమంత్రి జీవన్‌రెడ్డి భూమిపూజ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో రాజకీయాలకు అతీతంగా అర్హత ప్రతిపాదికన మంజూరు చేస్తున్నారని తెలిపారు. పార్టీ మండల అధ్యక్షుడు జున్ను రాజేందర్, నాయకులు పెద్దన్న, సురేశ్, శ్రీనివాస్, వెంకన్న పాల్గొన్నారు.
ఆదివాసీ దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలి
సారంగాపూర్: ఆదివాసీ దినోత్సవాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా నిర్వహించాలని ఆదివాసీ హక్కుల పోరాట సమితి, తుడుందెబ్బ జిల్లా అధ్యక్షుడు చిక్రం మారుతి అన్నారు. శనివారం బీర్‌పూర్ మండలం చిత్రవేణిగూడెం గిరిజన ఆశ్రమ పాఠశాలలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఆదివాసీల అభివృద్ధికి ప్రభుత్వాలు మరిన్ని నిధులు కేటాయించాలన్నారు. ఆదివాసీలు నివాసం ఉండే చోట విద్యా, వైద్యం, వసతులు కల్పించాలని పేర్కొన్నారు. పోడు వ్యసాయం ఆదివాసీల హక్కు అని, అలాంటి భూములకు పట్టాలు ఇచ్చి హక్కులు కల్పించాలని కోరారు. జిల్లాలో 10 వేల మంది వరకు ఆదివాసీలు ఉన్నారని, ప్రభుత్వం అన్ని రంగాల్లో అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని సూచించారు. ముందుగా ఆదివాసీల ఆరాధ్యుడు కొమురంభీం చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. సంప్రదాయ నృత్యాలు ఆహూతులను ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ఆశ్రమ పాఠశాల హెచ్‌ఎం శ్రీనివాస్, ఆదివాసీ నాయకులు కుడిమెత గంగారాం, చిక్రం హరీశ్, లక్ష్మణ్, భగవంత్‌రావు, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.

నృసింహస్వామి సన్నిధిలో మంత్రి అడ్లూరి

నృసింహస్వామి సన్నిధిలో మంత్రి అడ్లూరి

నృసింహస్వామి సన్నిధిలో మంత్రి అడ్లూరి

నృసింహస్వామి సన్నిధిలో మంత్రి అడ్లూరి