
పరిశుభ్రతతో అంటువ్యాధులు దూరం
బుగ్గారం: పరిశుభ్రతతోనే విషజ్వరాలు, అంటువ్యాధులకు దూరంగా ఉండొచ్చని డిప్యూటీ డీఎంహెచ్‌వో శ్రీనివాస్ అన్నారు. మండలకేంద్రంలో మంగళవారం పర్యటించారు. వార్డుల్లో పర్యటించి డ్రైనేజీ, నీరు నిలిచిన ఖాళీ స్థలాలను పరిశీలించారు. వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత అత్యంత ముఖ్యమని అన్నారు. గ్రామంలో ఎవరికి ఎలాంటి అనారోగ్యం ఏర్పడినా వెంటనే స్థానిక ఆరోగ్య సిబ్బందికి తెలియజేయాలన్నారు. కార్యక్రమంలో సీహెచ్‌వో అల్లెంకి శ్రీనివాస్, సూపర్‌వైజర్లు వెంకటేశ్, శ్రీనివాస్, కార్యదర్శి అక్బర్, ఏఎన్‌ఎంలు శైలజ, స్వప్న, శోభన్, మహేంద్ర పాల్గొన్నారు.
సూరమ్మ ప్రాజెక్టుకు ఇసుక తరలింపును అడ్డుకోవద్దు
మెట్‌పల్లిరూరల్: సూరమ్మ ప్రాజెక్టు పనుల కో సం ఆత్మకూర్ వాగు నుంచి ఇసుక తరలిస్తున్నామని, ఎవరైనా అడ్డుకుంటే చట్టపరమైన చ ర్యలు తీసుకుంటామని తహసీల్దార్ నీతా, సీఐ అనిల్‌కుమార్ తెలిపారు. ఆత్మకూర్‌లో మంగళవారం గ్రామసభ నిర్వహించారు. ఇసు క విషయమై గ్రామస్తులకు పలు సూచనలు చేశారు. కథలాపూర్ మండలంలో నిర్మిస్తున్న సూరమ్మ ప్రాజెక్టుకు అవసరమైన ఇసుకను ఆత్మకూర్ వాగు నుంచి తరలించాలని కలెక్టర్ సత్యప్రసాద్ ఆదేశాలు జారీ చేశారని, గ్రామస్తులు సహకరించాలని కోరారు. కొందరు వ్యక్తులు గ్రామానికి చెందిన ఓ వ్యక్తిని కులం పేరుతో దూషించడంతో అట్రాసిటీ కేసు నమోదు చేశామని, ఇసుక రవాణాను అడ్డుకున్నందుకే కేసు పెట్టామన్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు.
యూరియా కొరతకు కేంద్రానిదే బాధ్యత
రాయికల్: రాష్ట్రంలో యూరియా కొరతకు కేంద్రం బాధ్యత వహించాలని మాజీమంత్రి జీవన్‌రెడ్డి అన్నారు. మంగళవారం రాయికల్‌లో విలేకరులతో మాట్లాడారు. రామగుండం ఎరువుల కర్మాగారంలో యూరియా ఉత్పత్తికి బ్రేక్ పడిందని, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు ఎప్పటికప్పుడు కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తున్నారని పేర్కొన్నారు. రాయికల్ మండలం బోర్నపల్లి, సారంగాపూర్ మండలం కలమడుగు, మల్లాపూర్ మండలం బాదనకుర్తి, నిర్మల్‌లో గుమిర్యాలలో గోదావరిపై వంతెనల నిర్మాణం తన జీవితంలో మరిచిపోలేని అనుభూతి అని పేర్కొన్నారు. ఆయన వెంట బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు గోపి రాజిరెడ్డి, యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కొయ్యడి మహిపాల్‌రెడ్డి, నాయకులు పొన్నం శ్రీకాంత్, షాకీర్, చింతలపల్లి గంగారెడ్డి, బాపురపు నర్సయ్య ఉన్నారు.
పుట్టినరోజు కానుకగా యూరియా బస్తా
కథలాపూర్: మండలంలోని తాండ్య్రాలలో ముక్కెర మధు అనే యువకుడి పుట్టినరోజు వేడుకలు మంగళవారం రాత్రి నిర్వహించారు. పుట్టినరోజు కానుకగా మధుకు తోటి మిత్రులు యూరియాబస్తా బహుమతిగా అందించారు. యూరియా కొరతతో రైతులు ఇబ్బంది పడుతున్నారని, అందుకోసమే బస్తాను కానుకగా అందించామని యువకులు తెలిపారు. ప్రభుత్వం స్పందించి యూరియా కొరత లేకుండా చూడాలని యువకులు మంచాల మహేశ్, మా మిడిపెల్లి శివ, శేఖర్, సంజీవ్, మనోజ్, మహిపాల్ కోరారు.
జిల్లాకు తేలికపాటి వర్షసూచన
జగిత్యాలఅగ్రికల్చర్: జిల్లాకు రానున్న ఐదు రోజుల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పొలాస వ్యవసాయ పరిశోధన స్థానం వాతావరణ శాస్త్రవేత్త బి. శ్రీ లక్ష్మి తెలిపారు. ఈనెల 20 నుంచి 24 వరకు అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని, గంటకు 30నుంచి 40 కిమీ వేగంతో ఈదురుగాలులు వీస్తుందని తెలిపారు. పగటి ఉష్ణోగ్రతలు 27 నుంచి 31 డి గ్రీలు, రాత్రి ఉష్ణోగ్రతలు 24 డి గ్రీల సెల్సియస్‌గా నమోదయ్యే అవకాశం ఉందన్నారు.

పరిశుభ్రతతో అంటువ్యాధులు దూరం

పరిశుభ్రతతో అంటువ్యాధులు దూరం

పరిశుభ్రతతో అంటువ్యాధులు దూరం