
బోధనోపకరణలతో నాణ్యమైన విద్య● డీఈవో రాము
గొల్లపల్లి: ప్రాథమికస్థాయి విద్యార్థులకు బోధనోపకరణల ద్వారా నాణ్యమైన విద్య అందిస్తే సులభతరంగా అర్థమవుతుందని డీఈవో రాము అన్నారు. మండలకేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఎఫ్‌ఎల్‌ఎన్ టీఎల్‌ఎం మేళా నిర్వహించారు. 35 పాఠశాలల విద్యార్థులు 124 నమూనాలను తయారు చేసి ప్రదర్శించారు. ప్రతి సబ్జెక్ట్‌కు ఒకటి చొప్పున నాలుగు సబ్జెక్ట్‌లకు నాలుగు నమూనాలతో ప్రదర్శనలు చేపట్టారు. విద్యార్థులకు ఎలాంటి ఒత్తిడి లేకుండా ఆటపాటలు, కథలు వంటి ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్య అందించాలని సూచించారు. ఉపాధ్యాయులు తయారుచేసిన లోకాస్ట్, నో కాస్ట్ బోధనోపకరణ సామగ్రి విద్యార్థులకు ఉపయోగకరంగా ఉంటుందన్నారు. అనంతరం ఉత్తమ ప్రదర్శనలు ప్రదర్శించిన 10 మంది ఉపాధ్యాయులను విజేతలుగా ఎంపిక చేశారు. కార్యక్రమంలో ఎంఈవో చెరుకు రాజన్న, ఎంపీడీవో రాంరెడ్డి, తహసీల్దార్ మాజిద్ పాల్గొన్నారు.