
రోళ్లవాగుకు గేట్లు ఎప్పుడు బిగిస్తారు..?
సారంగాపూర్: బీర్పూర్ శివారు రోళ్లవాగు ప్రాజె క్టు పూర్తయినా.. గేట్లు మాత్రం ఎందుకు బిగించడం లేదని ఎమ్మెల్సీ ఎల్.రమణ ప్రశ్నించారు. వర్షాలకు ప్రాజెక్టులోకి చేరుతున్న నీరు గేట్లు బిగించకపోవడంతో వృథాగా గోదావరిలో కలు స్తోందని తెలిపారు. 15వేల ఎకరాలకు సాగునీరందించాలన్న లక్ష్యంతో బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో పనులు చేపట్టి.. 90శాతం పూర్తి చేశామని, ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం మరో రూ.20 కోట్లు విడుదల చేసిందని, జూన్‌లోనే అటవీశాఖ నుంచి అనుమతులు కూడా వచ్చాయని, ఇప్పటి వరకు ఎలాంటి పురోగతీ లేదని పేర్కొన్నారు. వానాకాలం సీజన్ సగం దాటినా.. గేట్లు ఎందుకు బిగించడం లేదో తెలపాలని డిమాండ్ చేశారు.