
ప్రజలకు ఇబ్బంది రానీయొద్దు
కోరుట్ల/కోరుట్లరూరల్/మెట్‌పల్లి: వర్షాలతో ప్రజలకు ఇబ్బంది కలగకుండా అధికారులు చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ అన్నారు. స్థానిక బల్దియా కార్యాలయంలో అదనపు కలెక్టర్ లతతో కలిసి కోరుట్ల, మెట్‌పల్లి బల్దియా అధికారులతో సమావేశమయ్యారు. పారిశుధ్య పనుల్లో నిర్లక్ష్యం చేయవద్దన్నారు. అయిలాపూర్ రోడ్డు దెబ్బతిన్న నేపథ్యంలో రాకపోకలకు ఇబ్బంది రానీయొద్దన్నారు. కోరుట్ల, మెట్‌పల్లి మున్సిపల్ కమిషనర్లు రవీందర్, మోహన్, డీఈ మధుసూదన్, ఏడీలు పాల్గొన్నారు. అనంతరం తన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 75మందికి కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు దారిశెట్టి రాజేశ్, నాయకులు ఫయీం, రమేశ్, మాజీ కౌన్సిలర్లు పాల్గొన్నారు. అనంతరం మెట్‌పల్లిలోని గంగారాం మెస్‌లో ఎమ్మెల్యే సంజయ్ కార్యకర్తలతో కలిసి భోజనం చేశారు. భోజనం రుచిగా ఉందంటూ నిర్వాహకులను అభినందించారు.