జగిత్యాలఅగ్రికల్చర్: శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి సోమవారం సాయంత్రం 39 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల నుంచి 1,25,400 క్యూసెక్కుల వరద వస్తుండడంతో 2,26,867 క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వదులుతున్నారు. వరదకాలువకు 18వేల క్యూసెక్కులు, కాకతీయ కాల్వకు 4700 క్యూసెక్కుల చొప్పున వదులుతున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టు నీటిమట్టం 73.370 టీఎంసీలకు చేరింది.
బాగున్నారా సార్..
మల్యాల: ‘సార్ బాగున్నారా.. అంటూ మాజీమంత్రి జీవన్‌రెడ్డిని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పలుకరించారు. మండలంలోని ముత్యంపేటకు సంత లక్ష్మీ కుటుంబాన్ని పరామర్శించేందుకు సుంకె రవి శంకర్ వెళ్లారు. అదే సమయంలో మాజీమంత్రి జీవన్‌రెడ్డి లక్ష్మీ కుటుంబాన్ని పరామర్శించి వస్తున్నారు. ఇద్దరూ ఎదురుపడగా.. ‘బాగున్నారా సార్..’ అంటూ రవిశంకర్ జీవన్‌రెడ్డిని పలుకరించారు. కరచాలనం చేశారు. జీవన్‌రెడ్డి చిరునవ్వుతో అదేస్థాయిలో స్పందించారు. ఇద్దరు కలిసి మాట్లాడుకోవడం కాంగ్రెస్, బీఆర్‌ఎస్ కార్యకర్తల్లో చర్చనీయాంశమైంది.
భద్రత కోసమే గణేశ్ విగ్రహాలకు ఆన్‌లైన్
జగిత్యాలక్రైం: గణేశ్ మంటపాల వద్ద భద్రత కోసమే విగ్రహాలను ఆన్‌లైన్ పోర్టల్‌లో నమోదు కోరుతున్నామని ఎస్పీ అశోక్‌కుమార్ తెలిపారు. మంటపాల నిర్వాహకులు పోలీస్ రూపొందించిన http://policeportal.tspo lice.gov.in/index.htm పోర్టల్‌లో వివరాలు నమోదు చేసుకోవాలన్నారు. మండపం సమాచారం కోసం మాత్రమే ఈ పోర్టల్ రూపొందించామని, బందోబస్తు చేయడం పోలీసులకు సులువుగా ఉంటుందన్నారు.
గోదావరి ఉధృతిని పరిశీలించిన అధికారులు
ఇబ్రహీంపట్నం: ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు శ్రీరాంసాగర్ నిండింది. దీంతో ప్రాజెక్టు గేట్లు ఎత్తి గోదావరిలోకి రండుల లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఆ నీటి ప్రవాహాన్ని ఇబ్రహీంపట్నం మండలం కోమటికొండాపూర్, ఎర్దండి వద్ద తహసీల్దార్ వరప్రసాద్, ఎంపీడీవో ఎండీ.సలీమ్, ఎస్సై అనిల్ పరిశీలించారు. భక్తులు, చేపలుపట్టేవారు, గొర్రెలకాపరులు గోదావరి వైపు వెళ్లకుండా చర్యలు చేపట్టారు. గోదావరి ప్రవాహం పెరిగితే తీరప్రాంతాల్లో ఉన్న ప్రజలను ఖాళీ చేయించి హైస్కూల్‌లో పునారావాసం కల్పించేందుకు వసతులు పరిశీ లించారు. పంచాయతీ కార్యదర్శి మనోజ్, కారోబార్ రత్నం, తదితరులు ఉన్నారు.
జిల్లాలో 11.2 మి.మీ వర్షం
జగిత్యాలఅగ్రికల్చర్: జిల్లాలో సోమవారం సగటున 11.2 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. అత్యధికంగా వెల్గటూర్‌లో 52.1 మి.మీ, అత్యల్పంగా మల్యాలలో 0.4 మి.మీ కురిసింది. ఇబ్ర హీంపట్నంలో 9 మి.మీ, మల్లాపూర్‌లో 8.9, రాయికల్‌లో 7, బీర్‌పూర్‌లో 45.6, సారంగా పూర్‌లో 14, ధర్మపురిలో 7.9, బుగ్గారంలో 21, జగిత్యాల రూరల్‌లో 5.4, జగిత్యాలలో 5.3, మేడిపల్లిలో 3.5, కోరుట్లలో 3, మెట్‌పల్లిలో 1.9, కథలాపూర్‌లో 1.6, కొడిమ్యాలలో 1.5, గొల్లపల్లిలో 7.7, ఎండపల్లిలో 27.4, భీమారంలో 0.5 మిల్లీమీటర్ల చొప్పున వర్షం కురిసింది.
రాష్ట్రస్థాయి వాలీబాల్
పోటీలకు కల్వకోట విద్యార్థులు
మేడిపల్లి: మండలంలోని కల్వకోట జెడ్పీ పాఠశాల విద్యార్థులు నోమన్, వసుధ అండర్–15 విభాగంలో జిల్లాస్థాయి వాలీబాల్ పోటీల్లో ప్రతిభ కనబరిచారు. వీరు ఈనెల 19న రంగా రెడ్డి జిల్లాలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పా ల్గొంటారని ప్రధానోపాధ్యాయుడు గంగాధర్ తెలిపారు. విద్యార్థులను పీఈటీ సాగర్, ఉపాధ్యాయులు, గ్రామస్తులు అభినందించారు.
ఎస్సారెస్పీ 39 గేట్ల ఎత్తివేత
ఎస్సారెస్పీ 39 గేట్ల ఎత్తివేత
ఎస్సారెస్పీ 39 గేట్ల ఎత్తివేత