
హైకోర్టు జడ్జిని కలిసిన న్యాయవాదులు
జగిత్యాలజోన్: హైకోర్టు జడ్జి, జిల్లా పోర్టుపోలియో జడ్జి వై.రేణుకను సోమవారం జగిత్యాల బార్ అసోసియేషన్ న్యాయవాదులు కలిశారు. జిల్లాలో ఫ్యామిలీ కోర్టు ఏర్పాటు, క్యాంటీన్‌కు శంకుస్థాపన, ఎస్సీ, ఎస్టీ కోర్టు ఏర్పాటు, రెండో అదనపు జ్యూడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో జడ్జి నియామకం, వివిధ కోర్టులో సరిపడా సిబ్బంది నియామకం వంటి సమస్యలపై రేణుకకు వినతిపత్రం అందించారు. అనంతరం జిల్లాకు చెందిన హైకోర్టు అడ్వకేట్ జనరల్ సుదర్శన్‌రెడ్డి మ ర్యాదపూర్వకంగా కలిసారు. రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యుడు కాసుగంటి లక్ష్మణ్‌కుమార్, బార్ అసో సియేషన్ జిల్లా అధ్యక్షుడు రాచకొండ శ్రీరాములు, ప్రధాన కార్యదర్శి అందె మారుతి, ఉపాధ్యక్షుడు సిరిపురం మహేంద్రనాథ్ పాల్గొన్నారు.