
టీ హబ్ సందర్శనతో కొత్త ఆలోచనలు
● కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్
కోరుట్ల: హైదరాబాద్‌లోని టీహబ్ సందర్శనతో విద్యార్థుల్లో కొత్త ఆలోచనలు వస్తాయని ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ అన్నారు. కోరుట్ల, మెట్‌పల్లిలోని డిగ్రీ విద్యార్థులను ఈనెల 14 హైదరాబాద్‌లోని టీ హబ్ సందర్శనకు తీసుకెళ్తున్న సందర్భంగా విద్యార్థులతో సమావేశమయ్యారు. టీహబ్, టీ వర్క్స్ సందర్శనతో ఉపయోగాలను వివరించారు. రాష్ట్ర ఐటీ మంత్రిగా కల్వకుంట్ల తారకరామారావు ఉన్నపుడు ఐటీ రంగం ఎంతో అభివృద్ధి జరిగిందని వివరించారు. అనంతరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. మాజీ వైస్ ఎంపీపీ కాశిరెడ్డి మోహన్‌రెడ్డి, నాయకులు పాల్గొన్నారు.
ఘనంగా జాతీయ చేనేత దినోత్సవం..
పట్టణంలోని పద్మశాలీ సంఘం భవనంలో గురువారం జాతీయ చేనేత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. చేనేత జెండాను సంఘం మాజీ అధ్యక్షుడు గోనే శంకర్ ఆవిష్కరించారు. ఎమ్మెల్యే మగ్గం నేసి ఆకట్టుకున్నారు. అనంతరం అయిలాపూర్‌కు చెందిన గాడిపెల్లి నరేశ్ కుటుంబాన్ని పరామర్శించారు.