కొండగట్టులో సౌకర్యాలు కల్పించాలి | - | Sakshi
Sakshi News home page

కొండగట్టులో సౌకర్యాలు కల్పించాలి

Apr 10 2025 12:21 AM | Updated on Apr 10 2025 12:21 AM

కొండగ

కొండగట్టులో సౌకర్యాలు కల్పించాలి

జగిత్యాలటౌన్‌: హనుమాన్‌ చిన్న జయంతి సందర్భంగా కొండగట్టుకు వచ్చే దీక్షాస్వాములకు అన్ని వసతులు కల్పించాలని బీజేపీ నాయకులు కోరారు. ఈ మేరకు బుధవారం కలెక్టరేట్‌లో కలెక్టర్‌ సత్యప్రసాద్‌కు వినతిపత్రం అందించారు. హనుమాన్‌ చిన్న జయంతి సందర్భంగా స్వామి వారి దర్శనానికి వచ్చే దీక్షాస్వాములతోపాటు సామాన్య భక్తుల స్నానాల కోసం కోనేటిలో శుభ్రమైన నీటిని అందుబాటులో ఉంచాలని కోరారు. గతంలో జరిగిన ప్రమాదాలను దృష్టిలో ఉంచుకుని ఘాట్‌రోడ్‌ వెంట కాలినడకన వచ్చే భక్తులు ప్రమాదాల బారిన పడకుండా ఉండేందుకు ఘాట్‌రోడ్డు వెంట వాహనాల రాకపోకలను నిషేధించాలని కోరారు. ఘాట్‌ వెంట తాగునీటి సౌకర్యం, మెడికల్‌ క్యాంపులు ఏర్పాటు చేయాలన్నారు. గుట్ట పరిసర ప్రాంతాల్లో శానిటేషన్‌ మెరుగుపరిచి ఆహ్లాదకరంగా ఉండేలా చూడాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు గంగాధర్‌, లింగంపేట రాజన్న, ఆముద రాజు, లింగారెడ్డి, కాశెట్టి తిరుపతి ఉన్నారు.

ఆయిల్‌ పాం తోటలకు కోతుల బెడద ఉండదు

జగిత్యాలఅగ్రికల్చర్‌: ఆయిల్‌ పాం తోటలకు కోతుల బెడద ఉండదని జిల్లా ఉద్యానశాఖాధికారి శ్యాం ప్రసాద్‌ అన్నారు. జగిత్యాల రూరల్‌ మండలం కల్లెడలో బుధవారం ఆయిల్‌ పాం సాగుపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఆయిల్‌ పాంకు చీడపీడల బెడద ఉండదని, రైతులకు ఇతర పంటలతో పోల్చితే లాభదాయకంగా ఉంటుందని పేర్కొన్నారు. తోటల సాగుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద ఎత్తున సబ్సిడీ ఇస్తున్నాయని, ఇప్పుడు టన్నుకు రూ.21వేలతో మంచి ఆదాయం వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఉద్యాన అధికారి స్వాతి, లోహియా కంపెనీ మేనేజర్‌ విజయ్‌ భరత్‌, ఏఈఓ రవిళి, మానిటరింగ్‌ అధికారి అన్వేష్‌, ఫీల్డ్‌ ఆఫీసర్‌ ఉదయశ్రీ పాల్గొన్నారు.

బార్‌ అసోసియేషన్‌ కార్గవర్గం ప్రమాణస్వీకారం

జగిత్యాలజోన్‌: జగిత్యాల బార్‌ అసోసియేషన్‌ కార్యవర్గం బుధవారం ప్రమాణ స్వీకారం చేసింది. ఎన్నికల అధికారి నక్కల సంజీవరెడ్డి కార్యవర్గాన్ని ప్రకటించగా.. సీనియర్‌ న్యాయవాదులు ముదుగంటి జనార్దన్‌ రెడ్డి, ఎం.మురళీధర్‌రావు సర్టిఫికెట్లు అందించారు. వారితో ప్రమాణం చే యించారు. అధ్యక్షుడిగా రాచకొండ శ్రీరాములు, ప్రధాన కార్యదర్శిగా అందె మారుతి, ఉపాధ్యక్షుడిగా సిరిపురం మహేంద్రనాథ్‌, సంయుక్త కార్యదర్శిగా కరబూజ నర్సయ్య, కోశాధికారిగా ఎం.ప్రదీప్‌కుమార్‌, లైబ్రరీ కార్యదర్శిగా మానా వెంకటరమణ, స్పోర్ట్స్‌ అండ్‌ కల్చరల్‌ కార్యదర్శిగా కంచి సురేష్‌, మహిళా ప్రతినిధిగా పడాల రాధ, సీనియర్‌ కార్యవర్గ సభ్యులుగా బండ భాస్కర్‌రెడ్డి, కె.దామోదర్‌రావు, గుంటి జగదీశ్వర్‌, రాంచంద్రం, ఓం ప్రకాష్‌, జూనియర్‌ కార్యవర్గ స భ్యులుగా టి. రమేశ్‌, టి.సంతోష్‌కుమార్‌, ఎ. ర మేష్‌, మహేందర్‌, వెంకటేశ్‌, రాజేందర్‌, నిఖిల్‌, రాజ్‌కుమార్‌, అరుణ్‌, మధు ప్రమాణం చేశారు.

కోర్టు బెంచ్‌కు సహకారం అందించాలి

న్యాయవాదులు కోర్టు బెంచ్‌కు సహకారం అందించేలా నూతన కార్యవర్గం చొరవ చూపాలని జిల్లా మొదటి అదనపు జడ్జి నారాయణ అన్నారు. నూతన కార్యవర్గాన్ని వివిధ కోర్టుల జడ్జిలు అభినందించారు. వీలైనన్ని ఎక్కువ కేసులు పరిష్కరించేందుకు న్యాయమూర్తులు, న్యాయవాదులు సమన్వయంతో పనిచేయాలని కోరారు. కక్షిదారులకు సత్వర న్యాయం అందిస్తే కోర్టులపై నమ్మకం పెరుగుతుందన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి శ్రీనిజ, మొదటి, రెండవ అదనపు జుడిషియల్‌ మేజిస్ట్రేట్‌లు జితేందర్‌, వినీల్‌కుమార్‌, మాజీ అధ్యక్షుడు డబ్బు లక్ష్మారెడ్డి, ప్రధాన కార్యదర్శి భూమి రమణకుమార్‌ పాల్గొన్నారు.

కొండగట్టులో    సౌకర్యాలు కల్పించాలి1
1/2

కొండగట్టులో సౌకర్యాలు కల్పించాలి

కొండగట్టులో    సౌకర్యాలు కల్పించాలి2
2/2

కొండగట్టులో సౌకర్యాలు కల్పించాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement