ప్రజలకు కలెక్టర్ క్రిస్‌మస్ శుభాకాంక్షలు
జగిత్యాల: క్రిస్‌మస్ పండుగ అత్యంత పవిత్రమైందని కలెక్టర్ సత్యప్రసాద్ తెలిపారు. క్రిస్‌మస్ సందర్భంగా జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఏసుక్రీస్తు బోధనలు ప్రతిఒక్కరికీ ఆదర్శప్రాయమని, ప్రేమను పంచుకోవడం, సేవభావంతో మానవత్వం కాపాడుకోవడం ఎలా అనేవి క్రీస్తుబోధనలు తెలియజేస్తాయన్నారు. ప్రజలు శాంతియుత వాతావరణంలో వేడుకలు నిర్వహించుకోవాలని సూచించారు.
హెచ్‌ఐవీ బాధితులకు చికిత్స అందించాలి
జగిత్యాల: హెచ్‌ఐవీ బాధితులకు మెరుగైన చికిత్స అందించాలని డిప్యూటీ డీఎంహెచ్‌వో శ్రీనివాస్ అన్నారు. బుధవారం ప్రభుత్వ ఆస్పత్రిలో ఏఆర్టీ కో–ఆర్డినేషన్ సమావేశం నిర్వహించారు. జిల్లాలో 4,387 మంది మహమ్మారి బారిన పడ్డారని, వారిలో 3900 మంది ఏఆర్టీ చికిత్స తీసుకుంటున్నారని తెలిపారు. 117 మందికి మహమ్మారి వ్యాప్తి చెందిందని, వారికి చికిత్స అందించాలని పేర్కొన్నారు. ఇప్పటివరకు 15,963 మందికి రక్త పరీక్షలు చేశామన్నారు. సమావేశంలో డాక్టర్ శిరీష, శ్రావణి పాల్గొన్నారు.
పెట్రోల్ బంక్ తొలగించండి
జగిత్యాలటౌన్: యావర్‌రోడ్డు విస్తరణకు ప్రధాన అడ్డంకిగా ఉన్న పెట్రోల్ బంక్‌ను తొలగించాలని ఎమ్మార్పీఎస్ నాయకుడు దుమాల గంగారాం అన్నారు. జిల్లాకేంద్రంలో విలేకరులతో మాట్లాడారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా యావర్‌రోడ్డు విస్తరణకు కట్టుబడి ఉన్నానన్న ఎమ్మెల్యే నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని, ముందుగా మంచాల కృష్ణ పెట్రోల్ పంపు తొలగించాలని సూచించారు. ఎమ్మెల్యే నిర్లక్ష్యం వహిస్తే అన్ని కుల, ప్రజాసంఘాలను కలుపుకుని ప్రత్యక్ష పోరాటాలకు దిగుతామన్నారు. బెజ్జంకి సతీష్, బొల్లె అనిల్, పొడేటి సునీల్ తదితరులు పాల్గొన్నారు.
మల్యాల పీహెచ్‌సీ తనిఖీ
మల్యాల: మండలకేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని బుధవారం డీఎంహెచ్‌వో శ్రీనివాస్ తనిఖీ చేశారు. ల్యాబ్, ఫార్మసీ రిజిస్టర్లను పరిశీలించారు. మాతాశిశు కార్యక్రమాల అమలుపై ఆరా తీశారు. వైద్యురాలు మౌనిక ఆయనను సన్మానించారు. జిల్లా ప్రోగ్రాం అధికారి రవీందర్, హెచ్‌ఈఓ రమేశ్, సిబ్బంది సాధిక్, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.
రోళ్లవాగు కాలువకు మరమ్మతు
జగిత్యాలరూరల్: రైతులకు సాగునీరు అందించేందుకు రోల్లవాగు ప్రధాన కాలువకు మరమ్మతు చేపట్టినట్లు డీఈ చక్రూనాయక్ అన్నారు. ఇటీవలి భారీ వర్షాలకు బీర్‌పూర్ చౌరస్తా వద్ద రోళ్లవాగు ప్రధాన కాలువకు గండిపడగా బుధవారం పూడ్చివేయించి మరమ్మతు చేపట్టారు. ప్రస్తుతం ఎస్సారెస్పీ సాగునీరు విడుదలవుతుండడంతో ప్రాజెక్ట్ నుంచి రైతులకు సాగునీరు అందించేందుకు సాగునీరు వృథా కాకుండా కాలువలకు మరమ్మతు చేపట్టామన్నారు. కార్యక్రమంలో ఏఈ అనిల్ పాల్గొన్నారు.
ప్రజలకు కలెక్టర్ క్రిస్‌మస్ శుభాకాంక్షలు
ప్రజలకు కలెక్టర్ క్రిస్‌మస్ శుభాకాంక్షలు
ప్రజలకు కలెక్టర్ క్రిస్‌మస్ శుభాకాంక్షలు


