గూడు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం
ధర్మపురి: అర్హులందరికీ గూడు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ అన్నారు. పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 140 మందికి ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్‌లు పంపిణీ చేశారు. మొదటి, రెండో 172 మంది లబ్ధిదారులకు ఇళ్ల పత్రాలు అందించామని, దరఖాస్తు చేసుకున్న అర్హులందరికీ మంజూరు చేస్తామని తెలిపారు. ఇళ్లు కట్టుకున్న ప్రతి కుటుంబానికీ రూ.5లక్షలు అందిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ కన్నం హారిణి, ఏఎంసీ చైర్‌పర్సన్ చిలుముల లావణ్య, ఆలయ చైర్మన్ జక్కు రవీందర్, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు, తహసీల్దార్ శ్రీనివాస్, నాయకులు పాల్గొన్నారు.


