ఒకేరోజు వందశాతం విద్యుత్ బిల్లుల చెల్లింపు
గోదావరిలో భక్తుల పుణ్య స్నానాలు
ధర్మపురి: ధనుర్మాసం సందర్భంగా ధర్మపురి గోదావరిలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చి గంగమ్మ, గౌరమ్మకు మొక్కులు చెల్లించారు. మంగలిగడ్డ, సంతోషిమాత ఘాట్లు భక్తులతో పులకించిపోయాయి.
మెట్‌పల్లిరూరల్: వ్యవసాయ విద్యుత్ బిల్లులను ఒకేరోజు వందశాతం చెల్లించి ఆదర్శంగా నిలిచారు మెట్‌పల్లి మండలం జగ్గాసాగర్ రైతులు. గ్రామంలోని ట్రాన్స్‌ఫార్మర్ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం సమావేశమైన రైతులు.. వ్యవసాయ బిల్లులు చెల్లించాలని నిర్ణయించుకున్నారు. విషయాన్ని విద్యుత్ శాఖ అధికారులకు తెలిపారు. 753 వ్యవసాయ మోటార్ల సర్వీస్ చార్జీలను ఒకేరోజు రైతులంతా చెల్లించారు. కనెక్షన్‌కు రూ.360 చొప్పున రూ.2,71,080 సర్వీస్‌చార్జీ, రూ.14,440 బకాయిలు చెల్లించారు. రైతులు సమష్టిగా నిర్ణయం తీసుకుని వందశాతం బిల్లు చెల్లించడం అభినందనీయని ఏఈడీ రవి అన్నారు. ఇతర గ్రామాల రైతులు కూడా వీరిని ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఏఈ రమేశ్, సబ్ ఇంజినీర్ అభినయ్, లైన్‌మెన్లు లక్ష్మణ్, నరహరి, రాజు, శివ, జలపతి, శ్రీనివాస్ పాల్గొన్నారు.
ఒకేరోజు వందశాతం విద్యుత్ బిల్లుల చెల్లింపు


