రూ.2.69 కోట్ల పన్నుల వసూలు
● లక్ష్యం రూ.12.38 కోట్లు ● మార్చి 31 చివరి తేదీ
జగిత్యాలరూరల్: జిల్లాలో ఇటీవల జరిగిన సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల వేళ పన్నులు భారీగా వసూళ్లయ్యాయి. 20 మండలాల్లోని 385 గ్రామపంచాయతీల్లో నవంబర్ నుంచి ఇప్పటివరకు రూ.2,69,19,913 పన్ను వసూలు చేశారు. సర్పంచ్, వార్డు సభ్యుడిగా పోటీచేసే అభ్యర్థులు, వారిని బలపర్చే వారు కూడా ఇంటి, నీటిపన్నులు చెల్లించాల్సి ఉండటంతో భారీగా పన్నులు వసూలయ్యాయి. దీంతో ప్రభుత్వానికి భారీగా ఆదాయం సమకూరింది.
లక్ష్యం రూ.12.38 కోట్లు
జిల్లాలో గ్రామపంచాయతీల్లో పన్ను వసూళ్లకు 2026 మార్చి 31 వరకు రూ.12,38,61,750 లక్ష్యం ఉండగా.. అక్టోబర్ 30 వరకు రూ.1,87,32,110 వసూలు చేశారు. స్థానిక ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్ రావడం, బకాయి పన్ను చెల్లించిన వారికే పోటీచేసే అవకాశం ఉండటంతోపాటు, బలపర్చే అర్హతలు ఉండటంతో భారీగా పన్నులు చెల్లించారు.
భక్తులకు ఇబ్బంది కలగనీయొద్దు
ధర్మపురి: ముక్కోటి ఏకాదశికి వచ్చే భక్తులకు ఇబ్బంది తలెత్తకుండా చూడాలని ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ హారిణి సూచించారు. శ్రీలక్ష్మినృసింహస్వామి కార్యాలయంలో ఈవో శ్రీనివాస్ ఆధ్వర్యంలో మున్సిపల్, పోలీస్, రెవెన్యూ శాఖల అధికారులతో సమీక్షించారు. ముక్కోటికి వేలాది మంది భక్తులు వస్తారని, వారికి వసతులు, ఏర్పాట్లు, క్యూలైన్లు ఏర్పాటు చేయాలని సూచించారు. సామాన్య భక్తులు, ప్రముఖులకు ఇబ్బంది రానీయొద్దన్నారు. ప్రత్యేక క్యూలైన్లు, గోదా వరి తీరం, పట్టణంలోని పలు వీధుల్లో పారిశుధ్యం పరిశీలించారు. ఆలయ చైర్మన్ జక్కు రవీందర్, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు, సీఐ రాంనర్సింహరెడ్డి, తహసీల్దార్ శ్రీనివాస్, సీని యర్ అసిస్టెంట్ అలువాలు శ్రీనివాస్, ధర్మకర్తలు తదితరులున్నారు.
రూ.2.69 కోట్ల పన్నుల వసూలు


