నిఘా పెంచాల్సిందే..
కోరుట్ల: గంజాయి.. రెండు, మూడేళ్లుగా పట్టించుకునేవారు లేక కొత్త సంవత్సరం వేడుకల్లో యువతకు చేరవైంది. దీని నియంత్రణకు ఏడాదిగా దృష్టి సారించిన పోలీసు యంత్రాంగం పక్కా ప్రణాళికతో వ్యవహరిస్తోంది. నూతన సంవత్సర వేడుకలకు వారం మాత్రమే ఉన్న క్రమంలో పోలీసు యంత్రాంగం మరింత పక్కాగా వ్యవహరించాల్సిన అవసరం ఏర్పడింది.
కోరుట్ల, మెట్‌పల్లి సర్కిళ్లు కీలకం
నాందేడ్, రుద్రంగి, మానాల నుంచి గంజాయి సరాఫరాను అడ్డుకోవడంలో జిల్లా సరిహద్దుల్లో ఉన్న కోరుట్ల, మెట్‌పల్లి పోలీసులు మరింత అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరముంది. రుద్రంగి, మానాల పరిసర ప్రాంతాల నుంచి గంజాయిని తరలించేవారు కోరుట్ల సర్కిల్‌లోని కథలాపూర్, మేడిపల్లి మండలాల నుంచి.. మెట్‌పల్లి సర్కిల్‌ను ఆనుకుని ఉన్న నిజామాబాద్ జిల్లా సరిహద్దు.. కొమరంభీంఆసిఫాబాద్ జిల్లా నుంచి వచ్చే గంజాయిని అడ్డుకోవడానికి మెట్‌పల్లి సర్కిల్‌లోని మల్లాపూర్ ఠాణా పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరముంది. ఈ రెండు సర్కిళ్లలో పోలీసుల యంత్రాంగం న్యూ ఇయర్ వేడుకలను దృష్టిలో ఉంచుకుని అప్రమత్తంగా వ్యవహరిస్తే ఈ ఏడాది కొత్త సంవత్సర వేడుకల్లో గంజాయికి అడ్డుకట్ట వేయడం పెద్ద సమస్యగా కాదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
న్యూ ఇయర్ వేడుకలు ప్రశాంతంగా జరుపుకోవాలి. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా పూర్తి బందోబస్తు ఏర్పాటు చేస్తాం. వేడుకల్లో గంజాయి నివారణకు డివిజన్ పరిధిలోని కోరుట్ల, మెట్‌పల్లి సర్కిల్ పోలీసులతో ప్రత్యేక నిఘా బృందాలు ఏర్పాటు చే స్తున్నాం. ఈ ఏడాది డివిజన్ పరిధిలో గంజా యి కట్టడిలో మంచి ఫలితాలు సాధించాం.
– రాములు, మెట్‌పల్లి డీఎస్పీ
నాందేడ్, ఆదిలాబాద్ దారుల్లో..
ఏటా న్యూ ఇయర్ వేడుకకు యువతకు గంజాయి చేరవేసి సొమ్ము చేసుకునే సరఫరాదారులు ఈ ఏడాది కూడా సిద్ధమవుతున్నట్లు సమాచారం. మహారాష్ట్రలోని నాందేడ్, ఉమ్మడి ఆదిలాబాద్‌లోని కొమరంభీంఆసిఫాబాద్, రాజన్నసిరిసిల్ల జిల్లాలోని రుద్రంగి, మానాల ఏరియాల నుంచి ఎక్కువ మొత్తంలో గంజాయిని జిల్లాకు తరలించే అవకాశాలున్నాయని పోలీసువర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ ఏడాది వివిధ ప్రాంతాల్లో మొత్తం 24 కిలోల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. సుమారు 203 మందిపై కేసులు నమోదయ్యాయి. వీరిలో సగానికి మించిన గంజాయి సరఫరాదారులు నాందేడ్ పరిసరాల నుంచి జిల్లాకు తెస్తున్నట్లు తేలింది. నాందేడ్ నుంచి రైలు మార్గంలో నిజామాబాద్‌కు.. అక్కడి నుంచి మోటార్‌సైకిళ్లు, బస్సుల్లో జగిత్యాల సరిహద్దుల్లోని కమ్మర్‌పల్లి గండిమనుమాన్ ఏరియా నుంచి గంజాయి జిల్లాలోకి వస్తోంది. ఈసారి కూడా న్యూఇయర్ వేడుకల్లో అదే ప్రాంతాల నుంచి గంజాయిని జిల్లాకు తరలించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది.
నిఘా పెంచాల్సిందే..


