ఓటరు జాబితా సవరణ చేపట్టాలి
జగిత్యాల: ఓటరు జాబితా సవరణ మ్యాపింగ్ సమర్థవంతంగా నిర్వహించాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎస్వీఎల్‌ఆర్ గార్డెన్స్‌లో ఓటరు జాబితా మ్యాపింగ్‌పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఓటరు జాబితా సవరణ, డెమోగ్రఫిక్, సిమిలర్ ఎంట్రీలను నూతన జాబితాను జనవరి 13 నాటికి పూర్తి చేయాలన్నారు. రాబోయే ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో భాగంగా ఎలక్ట్రోరల్ మ్యాపింగ్‌ను సమర్థవంతంగా చేపట్టాలన్నారు. ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ప్రక్రియను అత్యంత ప్రాధాన్యతగా పరిగణించాలని, నిర్దేశిత గడువులోపు పూర్తి చేయాలన్నారు. ముఖ్యంగా బ్లర్ ఫొటోలున్న ఓటరు ఎంట్రీలను ఒకే వ్యక్తికి సంబంధించిన సమాన వివరాలున్న డూప్లికేట్ వివరాలను పరిశీలించి సవరణ చేపట్టాలన్నారు. బీఎల్వో, తహసీల్దార్లు, డీటీలు, సూపర్‌వైజర్లకు ఓటరు జాబితా తప్పులు లేకుండా చూడాలన్నారు. కార్యక్రమంలో జగిత్యాల ఆర్డీవో మధుసూదన్, మున్సిపల్ కమిషనర్ స్పందన, తహసీల్దార్ పాల్గొన్నారు.


