కూతుళ్లు పట్టించుకోవడం లేదని..
జగిత్యాలటౌన్: కనిపెంచిన కూతుళ్లు పట్టించుకోవడం లేదని తల్లిదండ్రులు మంగళవారం జగిత్యాల ఆర్డీవోను ఆశ్రయించారు. జిల్లాకేంద్రానికి చెందిన గుండ మల్లేశ్వరి, శంకర్ దంపతులకు నలుగురు కూతుళ్లు. వీరిలో పెద్ద కూతురు మాత్రమే తల్లిదండ్రుల సంరక్షణ తీసుకుంది. మిగిలిన వారు తమను పట్టించుకోవడం లేదని, పక్షవాతంతో బాధపడుతున్న తమను ఉన్న ఆస్తిని వారి పేరిట మార్చాలంటూ వేధిస్తున్నారని తెలిపారు. సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు హరి అశోక్‌కుమార్ సహకారంతో ఆర్డీవోకు ఫిర్యాదు చేశారు. సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ ప్రతినిధులు పీసీ హన్మంతరెడ్డి, వి.ప్రకాష్‌రావు, నాయిని సంజీవరావు ఉన్నారు.


