కన్నుల పండువగా అయ్యప్ప మహాపడిపూజ
రాయికల్:రాయికల్ పట్టణంలోని అయ్యప్ప ఆలయంలో మహా పడిపూజ
కార్యక్రమాన్ని సాయప్ప చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ నివేదిత కృష్ణారావు ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి కన్నులపండువగా నిర్వహించారు. ఉదయం గణపతి హోమం, మాతలతో కుంకుమపూజ, స్వాములతో లక్ష పుష్పార్చన, 108 కలశాలతో అయ్యప్ప అభిషేకం చేశారు. శబరిమల సహాయ అర్చకులు ఉన్ని కృష్ణన్ నంబూద్రి ఆధ్వర్యంలో మహాపడిపూజ నిర్వహించారు. సుమారు 15 వేల మంది భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. ఎమ్మెల్యే సంజయ్‌కుమార్, సాయప్ప చారిటబుల్ ట్రస్ట్ వైస్ చైర్మన్ హిమవంతరావు, మున్సిపల్ కమిషనర్ మనోహర్‌గౌడ్, పర్యవేక్షకులు ఏలిగేటి రామకృష్ణ, రమేశ్, అయ్యప్ప
స్వాములు పాల్గొన్నారు.


