కోరుట్లకు నిధులివ్వడంలో సర్కారు నిర్లక్ష్యం
● ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్
మెట్‌పల్లి: కోరుట్ల నియోజకవర్గానికి నిధుల మంజూరు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతోందని ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ విమర్శించారు. రాజ్యసభ సభ్యుడు దామోదర్‌రావు మంజూరు చేసిన రూ.40లక్షలతో పట్టణంలో నిర్మించే ప్రభుత్వ పాఠశాల భవనం పనులకు మంగళవారం శంకుస్థాపన చేశారు. ప్రభుత్వ పాఠశాలలు బలోపేతమైతే పేద, మధ్యతరగతి విద్యార్థులకు మేలు జరుగుతుందని, కాంగ్రెస్ వైఖరితో నిధులు మంజూరుకాక ఎక్కడి సమస్యలు అక్కడే ఉంటున్నాయని వెల్లడించారు. నియోజకవర్గంలో అనేక పనులు పెండింగ్‌లో ఉన్నాయని, వాటికి అవసరమైన నిధులు విడుదల చేయాలని విజ్ఞ ప్తి చేసినప్పటికీ స్పందించకపోవడం బాధాకరమన్నారు. డీఈఓ రాము, ఎంఈఓ చంద్రశేఖ ర్, బల్దియా కమిషనర్ మోహన్ తదితరులున్నారు.
పోలీస్ సిబ్బందికి ఆధునిక జిమ్
జగిత్యాలక్రైం: పోలీసులు శారీరక దృఢత్వం, మానసిక ఆరోగ్యం కోసం ఆధునిక జిమ్‌ను ఏర్పాటు చేసినట్లు ఎస్పీ అశోక్‌కుమార్ తెలిపారు. ఎస్పీ కార్యాలయం పక్కన ఏర్పాటు చేసిన జిమ్ కేంద్రాన్ని మంగళవారం ప్రారంభించారు. పోలీసు సిబ్బందికి శారీరక ఫిట్‌నెస్ ముఖ్యమన్నారు. ఆరోగ్యంగా ఉంటేనే ప్రజలకు మెరుగైన సేవలందిస్తారని తెలిపారు. అధికారులు ఖాళీ సమయంలో వ్యాయామం చేసి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలన్నారు. డీఎస్పీలు వెంకటరమణ, రఘుచందర్, రాములు, సీఐలు ఆరీఫ్ అలీఖాన్, రఫీక్‌ఖాన్, కిరణ్‌కుమార్, సైదులు, వేణు పాల్గొన్నారు.
జీవాలకు నట్టల నివారణ మందు వేయించాలి
గొల్లపల్లి: గొర్రెలు, మేకల పెంపకందారులు ప్రభుత్వం అందించే నట్టల నివారణ మందును జీవాలకు వేయించాలని జిల్లా పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ బోనగిరి నరేశ్ అన్నారు. మండలకేంద్రంలో జీవాలకు నట్టల నివారణ మందు పంపిణీ కార్యక్రమాన్ని సర్పంచ్ నల్ల నీరజతో కలిసి మంగళవారం ప్రారంభించారు. జీవాల్లో పరాన్నజీవులతో కలిగే నష్టాలను నివారించి, వాటి ఆరోగ్యాన్ని కాపాడడమే లక్ష్యంగా ప్రభుత్వం మందు సరఫరా చేస్తోందన్నారు. ఈనెల 31 వరకు మందులు వేస్తామన్నారు. వెటర్నరీ వైద్యుడు రవీందర్, సిబ్బంది గంగాధర్, రాజశ్రీ, రవి, రమేశ్, నిశాంత్, శ్రీనివాస్, రైతులు పాల్గొన్నారు.
జేఎన్టీయూలో క్యాంపస్ ప్లేస్‌మెంట్ డ్రైవ్
కొడిమ్యాల: మండలంలోని నాచుపల్లిలోగల జేఎన్టీయూలో బీటెక్ విద్యార్థులకు ఎక్స్‌ఎల్‌ఆర్ ఎడ్యుటెక్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో మంగళవారం క్యాంపస్ రిక్యూర్‌మెంట్ డ్రైవ్ నిర్వహించారు. కంపెనీ హెచ్‌ఆర్ మేనేజర్ అవినాష్ సంస్థ విధివిధానాలు, ఉద్యోగ అవకాశాలను విద్యార్థులకు వివరించారు. అనంతరం వివిధ దశలో ఎంపిక ప్రక్రియ పూర్తి చేశారు. 170 మంది హాజరుకాగా.. 20 మందిని సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ పోస్టులకు ఎంపిక చేసినట్లు తెలిపారు. ఎంపికై న వారికి వార్షిక వేతనం రూ.4లక్షల నుంచి రూ.8 లక్షల వరకు ఉంటుందని, 2026 ఫిబ్రవరిలో ఉద్యోగాల్లో చేరాల్సి ఉంటుందని కళాశాల ప్లేస్‌మెంట్ అధికారి సతీష్ కుమార్ తెలిపారు. ఉద్యోగాలకు ఎంపికై న వారిని ప్రిన్సిపల్ నరసింహ అభినందించారు.
కోరుట్లకు నిధులివ్వడంలో సర్కారు నిర్లక్ష్యం
కోరుట్లకు నిధులివ్వడంలో సర్కారు నిర్లక్ష్యం
కోరుట్లకు నిధులివ్వడంలో సర్కారు నిర్లక్ష్యం


