గణతంలో కఠినమైన అంశాలపై పట్టు సాధిస్తే విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించొచ్చు. పాత ప్రశ్నపత్రాలు, నమూన లెక్కలను ఎక్కువగా సాధన చేయాలి. అభ్యాసదీపికలు, ప్రీఫైనల్‌లో అడిగిన ప్రశ్నలను పరిశీలించాలి. ప్రతి అధ్యాయంలో ఇచ్చిన భావాలపై పట్టు సాధిస్తే ప్రశ్నను ఏవిధంగా అడిగినా సమాధానం రాసే విలుంటుంది. వాస్తవ సంఖ్య, సమితులు, బహుపదులు, త్రికోణమితి, అధ్యాయాలపై పట్టు సాధించాలి. ముందుగా సులువైన వాటికి స్పష్టంగా జవాబులు రాయాలి. తరువాత కఠినమైన వాటిని సాధించేందుకు ప్రయత్నించాలి. రేఖాచిత్రాలు పెన్సిల్‌తో గీయాలి. సాధనలు డబ్బాలో రాయాలి.
– శ్రీనివాస్, మ్యాథ్స్‌టీచర్,
జెడ్పీహెచ్‌ఎస్, యశ్వంతరావుపేట