ఆమె టార్చర్‌ కోసం పురుషుల క్యూ.. ఎందుకంటే.. | Sakshi
Sakshi News home page

ఆమె టార్చర్‌ కోసం పురుషుల క్యూ.. ఎందుకంటే..

Published Sun, Sep 24 2023 11:04 AM

Woman Earns Money by Torturing Men - Sakshi

మనిషి ఎంత విచిత్రమైన జీవి అంటే ఒక్కొక్కరి భావోద్వేగాలు ఒక్కో విధంగా ఉంటాయి. వాటిని ఎదుటివారు అర్థం చేసుకోలేరు. ఒకరికి నచ్చని అనుభవం మరొకరికి నచ్చవచ్చు. కొందరు పురుషులు తమ భాగస్వామితో మాత్రమే రొమాన్స్ చేయాలని అనుకుంటారు. మరికొందరు రొమాన్స్‌లో ప్రయోగాలు చేయడానికి ఇష్టపడతారు. 

అలాంటి తాపత్రయం కలిగిన పురుషులకు కావాల్సినంత టార్చర్‌ చూపిస్తూ, వారి నుంచి డబ్బులు వసూలు చేస్తోంది ఇంగ్లండ్ కు చెందిన ఓ అమ్మడు. ఆమె పురుషులపై పూర్తి స్థాయిలో ఆధిపత్యం చెలాయిస్తుంది. వారిని తీవ్రంగా వేధిస్తుంది. ఇందుకోసం వారి నుంచి భారీగా ఫీజులు వసూలు చేస్తుంది. 

సర్రేలోని ఫర్న్‌హామ్ నివాసి అయిన అరి మక్టాన్స్ పురుషులను కొట్టడం ద్వారా డబ్బు సంపాదిస్తూ వెనకేసుకుంటోంది. ఇ‍క్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఇలా డబ్బులిచ్చి కొట్టించుకునేందుకు పురుష పుంగవులు ఆమె ముందు బారులు తీరుతున్నారు. డైలీ మెయిల్ న్యూస్ వెబ్‌సైట్ తెలిపిన వివరాల ప్రకారం ఆమె ఒక డామినేట్రిక్స్ అంటే శృంగార సమయంలో పురుషులను వేధించే మహిళ.  ఆమె ఒక గంటకు 17 వేల రూపాయలు సంపాదిస్తుంది. తిట్టడం మొదలుకొని తోలు బెల్టుతో కొట్టడం వరకు.. ఇలా వివిధ పనులు చేయించుకునే మగవారి నుంచి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేస్తుంది.

 తాను చాలా మంది వివాహాలు విచ్ఛిన్నం కాకుండా కాపాడినట్లు ఆ మహిళ తెలిపింది. చాలా మంది పురుషులు తమ భాగస్వామి వ్యక్తం చేసే ప్రేమలో హింస ఉందనుకుంటారని, అందుకే వారు భార్యకు దూరంగా ఉంటారని ఆమె పేర్కొంది. అయితే తాను ప్రేమలోని హింసను వారికి అర్థమయ్యేలా చెప్పి, పలువురి కాపురాలు నిలబెడుతున్నానని ఆమె తెలిపింది. కాగా ఆమె తన 19 సంవత్సరాల వయసు నుంచే ఈ పనిని ప్రారంభించింది. ఆమెకు 25 ఏళ్లు వచ్చేసరికి పూర్తి స్థాయి డామినేట్రిక్స్ గా మారింది. 

ఆమె ఒక నెలకు దాదాపు 20 మంది పురుషుల డిమాండ్లను నెరవేరుస్తుందని సమాచారం. ఇలా వచ్చేవారితో ఆమె ఎప్పుడూ శారీరక సంబంధాలు పెట్టుకోదు. వారి వింత కోరికలను మాత్రమే నెరవేరుస్తుంది. ఆమె కెరీర్‌కు మద్దతు పలికే బాయ్‌ఫ్రెండ్ కూడా ఆమెకు ఉన్నాడు. ఆమె తన పాదాలతో పురుషుల ముఖాన్ని తన్నుతుంటుంది. ఈ తన్నుల కోసం పురుషులు ఆమె దగ్గరికి వస్తుంటారు.
ఇది కూడా చదవండి: టైమ్‌ ట్రావెల్‌ నిజమేనా? ఈ ఫొటో దానికి సాక్ష్యమా?

Advertisement
 
Advertisement
 
Advertisement