టైమ్‌ ట్రావెల్‌ నిజమేనా? ఈ ఫొటో దానికి సాక్ష్యమా? | Evidence of Time Travel Found in 80 Year Old Photo | Sakshi
Sakshi News home page

Time Travel: టైమ్‌ ట్రావెల్‌ నిజమేనా? ఈ ఫొటో దానికి సాక్ష్యమా?

Sep 24 2023 8:02 AM | Updated on Sep 24 2023 10:18 AM

Evidence of Time Travel Found in 80 Year Old Photo - Sakshi

టైమ్ ట్రావెల్ అనేది ఒక విచిత్ర భావన. దీని గురించి చర్చలు కూడా జరుగుతుంటాయి. టైమ్‌ ట్రావెల్‌ అనేది వాస్తవికతకు దూరంగా ఉంటుంది. సినిమాల్లో టైం ట్రావెల్‌ని చూసిన ప్రేక్షకులు ఎంతగానో ఆశ్చర్యపోతుంటారు. టైమ్‌ ట్రావెల్‌ గురించి తెలుసుకుంటే అలా ట్రావెల్‌ చేసి, తమ గతం చూసుకోవాలని ఎవరికైనా అనిపిస్తుంది. 

నిజానికి టైమ్‌ ట్రావెల్‌ అనేది ఇంకా సాధ్యం కాలేదు. అయితే టైమ్‌ ట్రావెల్‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. అలాంటప్పుడు టైమ్ ట్రావెల్ నిజమని అనిపిస్తుంటుంది. ఇటీవల విదేశీ మీడియాలో ఇలాంటి ఒక ఫొటో వైరల్‌గా మారి, తెగ చర్చలకు దారితీసింది. ఇది టైమ్ ట్రావెల్‌ను రుజువు చేసే ఫొటో అని చెబుతున్నారు. 

డైలీ స్టార్ న్యూస్ వెబ్‌సైట్ తెలిపిన వివరాల ప్రకారం 2016వ సంవత్సరంలో ఐస్‌లాండ్ దేశానికి సంబంధించిన ఫేస్‌బుక్ గ్రూప్‌లో ఒక ఫోటో షేర్ అయ్యింది. ఈ ఫోటోపై ఈ నాటికీ చర్చలు జరుగుతున్నాయి. అందులో కనిపిస్తున్నది టైమ్‌ ట్రావెలర్‌ అయి ఉండొచ్చనే ప్రచారం జరుగుతోంది. ఈ వాదన వెనుక ఒక ఆధారం కూడా ఉందని చెబుతున్నారు. టైమ్‌ ట్రావెల్‌ చేస్తున్న వ్యక్తిని పరిశీలించినప్పుడు.. అతను మొబైల్ ఫోన్‌లో మాట్లాడుతూ కనిపిస్తాడు. అయితే ఈ ఫోటో 1943లో రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో ఐస్‌లాండ్‌లోని రెక్జావిక్‌లో తీసినదని నివేదికలో పేర్కొన్నారు. 

అ ఫొటోలో జనం రద్దీ కనిపిస్తుంది. సైనికులు అటూఇటూ తిరుగుతూ కనిపిస్తారు. అయితే ఒక వ్యక్తి  ఓ షాపు దగ్గర  ఫోన్‌లో మాట్లాడుతున్నట్టు కనిపిస్తాడు. అతడే టైమ్‌ ట్రావెల్‌ చేసిన వ్యక్తి అని పరిశీలకులు చెబుతున్నారు. ఎందుకుంటే ఆ సమయంలో ఫోన్లు అందుబాటులో లేవు. ఈ ఫొటోలో అమెరికన్ సైనికులు రోడ్డు మీద వెళుతుండగా వారి ముఖాల్లో కొంచెం ఆందోళన కనిపిస్తోంది. అయితే ఫోన్‌లో మాట్లాడుతున్న వ్యక్తి ముఖంలో అలాంటి ఆందోళన కనిపించడం లేదు. కాగా రోడ్డుపై నడుస్తున్నవారు చలిని తట్టుకునేందుకు ట్రెంచ్ కోట్లు ధరించి ఉండటాన్ని గమనించవచ్చు. ఈ ఫొటో షేర్‌ చేసిన ఫేస్‌బుక్‌ బృందం ఇది 1943లో తీసిన ఫొటోగా పేర్కొంది. 
ఇది కూడా చదవండి: 21 కి.మీ. పరిగెత్తితే 11 కిలోలు తగ్గుతారా?.. దీనిలో నిజమెంత?

Advertisement
 
Advertisement
Advertisement