మొబైల్‌ ఫోన్‌ను ఎత్తుకుపోయిన చిలుక.. ఫన్నీవీడియో

Viral Video: Parrot Flies Away With Phone As Boy Runs After It - Sakshi

సాధారణంగా మనలో చాలా మందికి ఫోటోలు, సెల్ఫీవీడియోలు తీసుకోవడం అంటే మహసరదా. దీనికోసం​ ప్రత్యేకంగా తయారై మరీ ఫోటోలు దిగుతుంటారు. ఈ క్రమంలో కొందరు ఫోటోలు దిగడానికి ప్రత్యేకమైన ప్రదేశాలకు వేళ్తుంటే.. మరికొంత మంది తమ ఇంట్లో లేదా మిద్దేమీదకో వెళ్లి ఫోటోలు దిగుతుంటారు. ఈ క్రమంలో ఒక్కొసారి కొన్ని ఫన్నీ సంఘటనలు కూడా చోటు చేసుకుంటుంటాయి. మన ఇంట్లోని తినే వస్తువులను కోతులు ఎత్తుకుపోవడం మనకు తెలిసిందే. ఇక్కడో పక్షి ఏకంగా మొబైల్‌ ఫోన్‌ను ఎత్తుకుపోయింది. ప్రస్తుతం ఈ ఫన్నీవీడియో  సోషల్‌ మీడియలో చక్కర్లు కొడుతుంది.  

దీనిలో ఒక వ్యక్తి  ఇంట్లో మిద్దేమీద తన మొబైల్‌ ఫోన్‌ను చేతిలో పట్టుకుని ఉన్నాడు. ఫోటోలు దిగుతున్నాడో.. మరేంటోకానీ.. కాసేపటికి తన ఫోన్‌ను కాస్త  పక్కన ఉన్న పిట్ట గోడ మీద ఉంచాడు. అయితే, ఎక్కడి నుంచి వచ్చిందో గానీ ఒక రామచిలుక వచ్చింది. ఆ ఫోన్‌ను తినేపదార్థం అనుకుందో.. మరేం అనుకుందో గానీ దాన్ని తన కాళ్ల మధ్యలో పట్టుకొని తుర్రున గాలిలో ఎగిరింది. ఆ వ్యక్తి , వెంటనే ఏదో అలజడి కావడంతో తన ఫోన్‌ కోసం అటూ ఇటూ చూశాడు. తన మొబైల్‌ ఫోన్‌ను ఒక రామ చిలుక తన కాళ్లలో అదిమి పట్టుకుని గాల్లో ఎగిరిపోతుండటాన్ని గమనించాడు.

వెంటనే దాన్ని పట్టుకొవడానికి ప్రయత్నించాడు. అయినప్పటికి అది చిక్కలేదు. మొబైల్‌ ఫోన్‌ వీడియో ఆన్‌లోనే ఉండటంతో అది ఆకాశంలో వెళ్తున్నప్పుడు అక్కడి ఇళ్లు, నగరాలు అన్ని దాటుకుంటు ప్రయాణిస్తున్న దృష్యాలు అందులో రికార్డు అయ్యాయి. ఈ సంఘటన ఎక్కడ జరిగిందో వివరాలు లేవు. దీన్ని ఫ్రెడ్జ్‌ స్కూల్జ్‌ అనే యూజర్‌ ట్విటర్‌ ఖాతాలో పోస్ట్‌ చేశాడు. అది కాస్త వైరల్‌గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు.. ‘భలే చిలుక.. పాపం సెల్ఫీ దిగుతామని తీసుకుందేమో..’, ‘ఇది నిజమైన వీడియో కాదు..’, ‘బరువైన సెల్‌ఫోన్‌ను చిలుక ఎలా పట్టుకుందబ్బా.. ’, ‘కింద పడకుండా ఎంత బాగా పట్టుకుంది..’, ‘ఆ ఫోన్‌ మళ్లి మీకు ఎక్కడ దొరికింది’ ?, అంటూ కామెంట్లు పెడుతున్నారు. 

చదవండి: Anaconda: రోడ్డు దాటుతున్న భారీ అనకొండ.. షాకింగ్‌ వీడియో..

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top