Anaconda: రోడ్డు దాటుతున్న భారీ అనకొండ.. షాకింగ్‌ వీడియో..

Viral Video: Traffic Halts As Giant Anaconda Crosses Busy Road In Brazil - Sakshi

బ్రసీలియా: సాధారణంగా అడవిలోని జంతువులు, సరీసృపాలు మానవ ఆవాసాలకు వస్తున్న సంఘటనలను తరచుగా వార్తల్లో చూస్తునే ఉంటాం. కాగా, అవి..  ఆహారం కోసం, ఆవాసం కోసం దారితప్పి మానవ ఆవాసాల్లోకి ప్రవేశిస్తుంటాయి. అడవికి దగ్గరగా ఉన్న ప్రదేశాలలోని రోడ్లపై  జంతువులు, పాములు రోడ్డును దాటుతూ ఒకవైపు నుంచి మరొవైపుకు వెళ్లిన సంఘటనలు కొకొల్లలు.

తాజాగా, బ్రెజిల్‌లోని హైవేపై ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. ఒక పెద్ద అనకొండ రోడ్డును దాటుకుంటు వెళ్లింది. కాగా, మొదట దీన్నిచూసిన  ప్రయాణికులు  షాక్‌కు గురయ్యారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతుంది. కాగా, అసలే అది హైవే.. వాహనాల రద్దీ కూడా ఎక్కువగా ఉంది. ఉన్నట్టుండి రోడ్డు పక్కన ఉన్న చెట్ల పొదల్లోంచి ఒక పదడుగుల అనకొండ బయటకు వచ్చింది. ఆ తర్వాత.. మెల్లగా పాకుకుంటూ.. డివైడర్‌ ఎక్కేసింది. ఒకవైపు నుంచి మరోవైపు  వెళ్లసాగింది. అనకొండ ను చూసిన ప్రయాణికులు .. తమ వాహనాలను ఆపివేసి దాన్ని తమ మొబైల్‌లో వీడియో తీసుకుంటున్నారు.  అనకొండకు ఎవరు కూడా ఆపద తలపెట్లలేదు.

వేగంగా వచ్చిన వాహనదారులు.. కార్లను రోడ్డుకు ఒకవైపు నిలిపేసి ఆ అనకొండను ఆశ్చర్యంగా చూస్తున్నారు. మరికొందరు దూరం నుంచి సెల్ఫీలు తీసుకుంటున్నారు. అయితే, అనకొండ మాత్రం మెల్లగా పాకుకుంటూ.. రోడ్డుపక్కన ఉన్న పొదల్లోకి వెళ్లి అదృష్యమయ్యింది.  కాగా, ఈ వీడియోను ఒక బ్రెజిల్‌లోని ఒక వ్యక్తి అనిమల్స్‌ వేంచర్‌ అనే ఇన్‌స్టాలో పోస్ట్‌ చేశాడు. దీనికి ఇతను ‘అనకొండ రోడ్డుదాటుతుంటే..  ప్రయాణికులు చూస్తు ఉండిపోయారు’ అని క్యాప్షన్‌ ఇచ్చాడు.

ప్రస్తుతం ఇది సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు ‘ఎంత బాగా పాకుకుంటూ వెళ్తుంది..’,‘అనకొండకు..  ఆపద కల్గించనందుకు ధన్యవాదాలు..’, ‘జంతువుల మనుగడకు మనుషులు సహాయపడుతున్నందుకు థ్యాంక్స్‌.. అంటూ కామెంట్లు పెడుతున్నారు.  సాధారణంగా బ్రెజిల్‌ అడవులలో ఉండే అనకొండలు 550 పౌండ్ల బరువుని కల్లి ఉండి, 29 అడుగుల పొడవు వరకు పెరుగుతాయి. 

చదవండి: మహిళకు షాక్‌.. ఇంటిని బందెల దొడ్డి చేశాయ్‌!

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top