breaking news
flies
-
పగ బట్టిన పండు ఈగ!
పండు ఈగ (ఫ్రూట్ ఫ్లై) అనేక పండ్లు, కూరగాయ తోటలకు పెను నష్టాన్ని కలిగిస్తూ రైతులను అల్లాడిస్తోంది. కొద్ది సంవత్సరాల క్రితం మామిడికే పరిమితమై ఉండే పండు ఈగ ఇప్పుడు అనేక పంటలకు విస్తరించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పండు ఈగ ముప్పు ఏటేటా పెరుగుతోంది. దాదాపు 20కి పైగా పండ్లు, కూరగాయ తోటలకు పండు ఈగ ఆశిస్తూ రైతులకు పెను నష్టం కలిగిస్తోంది. మామిడిలో 30% నుంచి 70% దిగుబడి నష్టం జరుగుతోంది. జామ, బొప్పాయి, సపోటా, రేగు వంటి పంటల్లో 20% నుంచి 50% దిగుబడి నష్టాలకు కారణమవుతున్న పండు ఈగపై కేంద్ర వ్యవసాయ శాఖ అనుబంధ సంస్థ ‘నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ హెల్త్ మేనేజ్మెంట్’ (ఎన్ఐపీహెచ్ఎం) శాస్త్రవేత్తలు డాక్టర్ మరియదాస్, డాక్టర్ పైలా జ్యోతి, డాక్టర్ ఆలిస్ ఆర్పీ సుజీత సూచనలతో ప్రత్యేక కథనం. పండు ఈగ సోకకుండా జీవనియంత్రణ పద్ధతులను అనుసరించటమే మేలని వారు రైతులకు సూచిస్తున్నారు.పండ్ల ఈగలు (ప్రధానంగా బాక్ట్రోసెరా జాతులు బి. డోర్సాలిస్, బి. జోనాటా, బి. కుకుర్బిటే వంటివి) ఎన్నో రకాల పండ్లు, కూరగాయలను ఆశించి నాశనం చేసే పురుగులు. అందుకే వీటిని ‘పాలీఫాగస్ పెస్ట్స్’ అంటారు. ఒకప్పుడు కొన్ని పండ్లు, కూరగాయ రకాలకు నష్టం చేకూర్చేవి. క్రమంగా అనేక ఇతర పంటలకు కూడా వ్యాపించి నష్టం చేస్తున్నాయి. అకాల వర్షాలు, అస్థిర వాతావరణ పరిస్థితులు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని ఉద్యాన తోటల్లో పండు ఈగల త్వరితగతిన వ్యాప్తికి దోహదం చేస్తున్నాయి. దీనివల్ల గత సీజన్లో కూడా మామిడి కాయలకు తీవ్ర నష్టం కలిగింది. పండు ఈగ వల్ల మామిడి ఎగుమతులు కూడా తగ్గిపోతాయి. అనేక ఇతర పంటలను కూడా పండు ఈగ చుట్టుముడుతోంది.పండు ఈగ నియంత్రణకు మేలైన యాజమాన్య పద్ధతులు→ తోటలో చెట్ల నుంచి రాలిపోయిన లేదా పండు ఈగ సోకిన పండ్లను సేకరించి మట్టిలో రెండు అడుగుల (60 సెం.మీ.ల) లోతు గుంత తీసి పాతిపెట్టాలి. → పండ్ల చెట్ల కొమ్మలను తగుమాత్రంగా కత్తిరించి, కత్తిరింపులను తో టలో నుంచి తొలగిస్తే పండు ఈగలు పెరగకుండా చూసుకోవచ్చు. → పండిన పండ్లను పండినట్లు ఎప్పటికప్పుడు వెంటనే కోయండి. పండిన పండ్లను చెట్లపై వదిలివేయవద్దు.→ జొన్న, ఆముదం, తులసి, కర్రపెండలం వంటి పురుగులను ఆకర్షించే జాతుల మొక్కలను తోటల గట్లు/ సరిహద్దుల్లో పెంచటం ద్వారా ప్రధాన పంటను పండు ఈగల నుంచి రక్షించుకోవచ్చు. → మగ ఈగలను ఆకర్షించటం కోసం సామూహిక ఉచ్చులు ఏర్పాటు చేయటం ద్వారా పండు ఈగ సంతతిని నియంత్రించి తోటలను కాపాడుకోవచ్చు. పండ్ల తోటల్లో మిథైల్ యూజినాల్ ఉచ్చులు పెట్టాలి. తీగజాతి కూరగాయ పంటల్లో క్యూ–లూర్ ఉచ్చులను ఉపయోగించాలి. ఎకరానికి 6–10 ఉచ్చులు పెట్టాలి. ఒకసారి పెడితే చాల్లే అనుకోకండి. ప్రతి 30–40 రోజులకు ఒకసారి ఎరలను మార్చుతూ ఉండాలి. తక్కువ ఖర్చుతో కూడిన ‘ఫ్రూట్ ఫ్లై బాటిల్ ట్రాప్ టెక్నాలజీ’ని ఎన్ఐపీ హెచ్ఎం వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. దాన్ని ఉపయోగించుకోవచ్చు. → అధిక విలువైన పండ్లను పండు ఈగ నుంచి కాపాడుకోవటం కోసం పండ్లకు రక్షక సంచులు తొడగాలి. పండ్లకు కాగితం లేదా ప్లాస్టిక్ సంచులు తొడగండి. ఇది పండుపై ఈగ గుడ్లు పెట్టకుండా అడ్డుకుంటుంది. పురుగుమందుల అవశేషాలను తగ్గిస్తుంది. ఎగుమతి నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా పండ్లు ఉండేలా చేస్తుంది. శ్రమతో కూడుకున్న పని అయినప్పటికీ చిన్న తోటలన్నిటిలో, దేశీయ /ఎగుమతి మార్కెట్ల కోసం ఉద్దేశించిన తోటల్లో చెట్లపై కాయలకు సంచి చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. → తోటలో చెట్లు / మొక్కల కింద ఉన్న మట్టిని కుళ్లగించి, ఆ మట్టిలో ఉండే పండు ఈగ ప్యూపాలను చంపడానికి క్లోర్‌పైరిఫోస్ 20% ద్రావణాన్ని లీటరు నీటికి 2.5 ఎం.ఎల్. చొప్పున కలిపి చల్లండి. → బ్యూవేరియా బాసియానా, మెటారైజియం అనిసోప్లియా వంటి ఎంటోమో పాథోజెనిక్ శిలీంధ్రాలను ఆకులపై పిచికారీ చేయండి. → మగ, ఆడ కీటకాలను చంపడానికి ఎర స్ప్రేలను పిచికారీ చేయవచ్చు. ఏదైనా ఒక పురుగుమందును (మలాథియాన్ 50% ద్రావణం లీటరు నీటికి 2 ఎం.ఎల్./∙లేదా డెల్టామెథ్రిన్ 2.8% ద్రావణం లీటరు నీటికి 2 ఎం.ఎల్. చొప్పున) ప్రోటీన్ హైడ్రోలైజేట్ లేదా మొలాసిస్ లేదా బెల్లంలకు లీటరు నీటికి 10 గ్రాముల చొప్పున కలిపి పిచికారీ చేయండి. పండు ఈగలు ఎక్కువగా ఉన్నప్పుడల్లా 2 వారాల వ్యవధిలో పిచికారీ చేయండి.ఈ తోటలకు ముప్పుపండ్ల జాతులు: మామిడి, జామ, సీతాఫలం, రేగు, బొప్పాయి, సపోటా, అరటి, దానిమ్మ, బత్తాయి, పుచ్చతో పాటు కివి వంటి అన్యదేశ పండ్లను కూడా పండు ఈగలు ఆశిస్తున్నాయి. కూరగాయలు, దోసకాయలు: టమాటా, వివిధ రకాల తీగ జాతి కూరగాయ పంటలకు పండు ఈగ సమస్యగా మారింది. బీర, సొర, కాకర, నేతి బీర, పొట్ల, గుమ్మడి, దొండ, దోస, కీర దోస తదితర ఉద్యాన పంటలకు పండు ఈగ ముప్పు పెరుగుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. బాక్ట్రోసెరా జాతి పండ్ల ఈగలు విజృంభిస్తున్నాయి. వందలాది పంటలను ఆశిస్తున్నాయి. అకాల వర్షాలు, తేమతో పాటు వెచ్చని రాత్రులతో మారుతున్న వాతావరణం చీడపీడలు వేగంగా విస్తరించటానికి సహాయపడుతున్నది. ఇది తెలంగాణ, ఆంధ్రలో ఇటీవలి మామిడి నష్టాలకు ప్రధాన కారణం బాక్ట్రోసెరా జాతి పండ్ల ఈగలే. పక్వానికి వచ్చిన కాయల కోత ఆలస్యమై పండ్లు చెట్లపై ఎక్కువ కాలం ఉన్నప్పుడు పండు ఈగలు వాటిని ఆశించి, ఆ పండ్ల లోపలికి గుడ్లు చొప్పించడానికి ఎక్కువ అవకాశం దొరుకుతున్నది. (పాపాయితోనే మాస్టర్స్..కానీ గ్రాడ్యుయేషన్ ఈవెంట్‌కి డబ్బుల్లేక అలా చేశా!)నష్టాలు.. ఎగుమతి చిక్కులుచెట్లకు వేలాడుతున్న పండ్ల తొక్కకు ఆడ పండు ఈగలు బెజ్జం చేసి, వాటి లోపల గుడ్లు పెడతాయి. గుడ్ల నుంచి తయారయ్యే పురుగులు ఆ పండు లోపలే ఉండి గుజ్జు ను తింటూ ఉంటాయి. దీనివల్ల పండు పైకి చూపులకు అంతా బాగానే కనిపిస్తున్నా లోపల్లోపల కుళ్ళి మెత్తబ డుతుంది. అకాలంగా పండ్లు రాలిపోతుంటాయి. ఇది పంట కోత తర్వాత కాలంలో అధిక నష్టాలకు దారితీస్తుంది. పండు ఈగలు ఎక్కువగా ఆశిస్తే పంట దిగుబడితో పాటు మార్కెట్లో ధరలు, ఎగుమతులు కూడా తగ్గిపోతాయి. పండు ఈగల దాడిని సరిగ్గా నియంత్రించకపోతే పండ్లు, కూరగాయల దిగుబడి గణనీయంగా తగ్గిపోయి, రైతులకు భారీ స్థాయిలో ఆర్థిక నష్టాలు సంభవిస్తాయి. మామిడిలో 30% నుంచి 70% వరకు పంట నష్టం జరుగుతుంది. జామ, బొప్పాయి, సపోటా, రేగు తదితర పంటల్లో సీజన్‌ను, పండు ఈగల తీవ్రతను బట్టి 20% నుంచి 50% వరకు పంట నష్టం జరుగుతుంది. (Diwali 2025 : ఈ ఏడాది అద్భుతం విశిష్టత ఏంటి? శుభ ముహూర్తం!)పండు ఈగలు పెద్ద సంఖ్యలో ఆశిస్తే విదేశాలకు ఎగుమతైన పండ్లు అక్కడికి వెళ్లిన తర్వాత తిరస్కరణకు గురయ్యే రిస్క్ పెరుగుతుంది. ఎగుమతికి సిద్ధం చేసే ప్రక్రియలో ఖర్చులు కూడా పెరుగుతాయి. కొన్ని సందర్భాల్లో సరుకు ఎగుమతి ఆర్డర్ల రద్దుకు సైతం దారితీస్తుంది. ఇది భారతీయ ఉత్పత్తులకు విదేశీ మార్కెట్లలో వాణిజ్య భాగస్వామ్యాన్ని తగ్గిస్తుంది. ఈ పరిస్థితిని నివారించడానికి పండ్లు ఈగలతో ప్రభావితమైన పండ్లను ఎగుమతి కాకుండా చూడాలి. అందుకు అనుగుణంగా కఠినమైన ఫైటో శానిటరీ శుద్ధి ప్రక్రియలు చేపట్టటం అవసరం. వేడి నీటి చికిత్స, వేడి ఆవిరి చికిత్స, చల్ల నీటి చికిత్స, వికిరణ చికిత్స, రసాయన ద్రావణాల్లో పండ్లను ముంచటంతో పాటు ఎగుమతి ప్రమాణాలకు అనుగుణంగా పండు ఈగ రహిత ధ్రువీకరణను ప్రవేశపెట్టటం వంటి పటిష్ట చర్యలు తీసుకుంటే పండు ఈగ వల్ల ఎగుమతులు దెబ్బతినకుండా చూసుకోవచ్చు. -
అమెరికాను హడలెత్తిస్తున్న ఈగ
న్యూ వరల్డ్ స్క్రూవార్మ్.. అగ్రరాజ్యం అమెరికాకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న ఈగ. ముఖ్యంగా పాడి రైతులకు తీవ్ర నష్టం కలిగిస్తున్న ఈ ఎగిరే జీవుల సంతతిని నియంత్రించడానికి ఏకంగా ప్రభుత్వమే రంగంలోకి దిగింది. ఆడ ఈగల్లో సంతానోత్పత్తి సామర్థ్యాన్ని దెబ్బతీయడానికి స్టెరిలైజ్ చేసిన మగ ఈగలను వదలడానికి ఏర్పాట్లు చేస్తోంది. న్యూ వరల్డ్ స్క్రూవార్మ్‌ను సైన్స్ పరిభాషలో కొష్లియోమియా హొమినివోరక్స్ అంటారు. ఇవి ప్రధానంగా పరాన్న జీవులు. అంటే ఆవులు, గేదెలు, గుర్రాలు, గొర్రెల వంటి జంతువులపై ఆవాసం ఏర్పర్చుకుంటాయి. వాటి శరీరంపై గాయాలు చేసి, మాంసాన్ని భక్షిస్తాయి. దాంతో ఆయా జంతువులకు ప్రాణాపాయం సంభవిస్తుంది. అమెరికాతోపాటు దక్షిణ అమెరికా దేశాల్లో ఈగలు పెద్ద సమస్యగా మారిపోయాయి. 2023 నుంచి సెంట్రల్ అమెరికాలో వీటి వ్యాప్తి పెరిగిపోయింది. పనామా, కోస్టారికా, నికరాగ్వా, హోండూరస్, గ్యాటెమాలా, ఎల్‌సాల్వెడార్ తదితర దేశాల్లో ఎన్నో కేసులు నమోదయ్యాయి. ఈగలు గత ఏడాది దక్షిణ మెక్సికోకు చేరుకున్నాయి. అటునుంచి అమెరికా దక్షిణ సరిహద్దు ప్రాంతాలకు వ్యాప్తి చెందాయి. వీటి దెబ్బకు అమెరికా–మెక్సికో సరిహద్దుల్లో పశువుల వ్యాపార కేంద్రాలు మూసివేయాల్సి వచ్చింది. మెక్సికో నుంచి పశువుల దిగుమతి నిలిపివేశారు. పాలు ఇచ్చే ఆవులు, గేదెలు మరణిస్తుండడంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు. 2023 నుంచి ఇప్పటివరకు 35,000 న్యూవరల్డ్ స్క్రూవార్మ్ ఇన్ఫెక్షన్ కేసులు నమోదయ్యాయి. నమోదు కానివి మరెన్నో ఉన్నాయి. ఎలా నియంత్రిస్తారు? స్క్రూవార్మ్ ఈగలను అరికట్టడానికి పెద్ద తతంగమే ఉంటుంది. వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలి అన్నట్లుగా ఈగలను ఈగలతోనే నియంత్రిస్తారు. మగ ఈగలను సేకరించి, ప్రయోగశాలలో స్టెరిలైజ్ చేస్తారు. ఇలాంటి కోట్లాది మగ ఈగలను హెలికాప్టర్ల ద్వారా ప్రభావిత ప్రాంతాల్లో వదులుతారు. ఇవి ఆడ ఈగలతో జతకడతాయి. దాంతో ఆడ ఈగల్లో సంతానోత్పత్తి సామర్థ్యం క్షీణిస్తుంది. అవి గుడ్లు పెట్టలేవు. ఫలితంగా సంతానోత్పత్తి తగ్గిపోతోంది. కొన్ని దశాబ్దాలుగా ఇదే వ్యూహం అమలు చేస్తున్నారు. అయితే, అమెరికాలో స్టెరిలైజేషన్ కేంద్రం ప్రస్తుతం ఒక్కటే ఉన్నట్లు తెలుస్తోంది. మరికొన్ని కేంద్రాలు ప్రారంభించేందుకు అనుమతి ఇవ్వాలని అమెరికా చట్టసభ సభ్యులు జూన్ 17న ప్రభుత్వానికి లేఖ రాశారు. అమెరికా వ్యవసాయ శాఖ వెంటనే స్పందించింది. ‘ఫ్లై ఫ్యాక్టరీ’ ప్రారంభిస్తామని ప్రకటించింది. టెక్సాస్–మెక్సికో సరిహద్దుల్లో ఈ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిసింది. పశువుల రక్తమాంసాలు రుచి మరిగిన ప్రాణాంతక ఈగలను అంతం చేయడం చెప్పినంత సులువు కాదు. ఇది చాలా వ్యయప్రయాసలతో కూడిన ప్రక్రియ. మెక్సికోలో ఈగల లార్వాల ఉనికిని గుర్తించడానికి జాగిలాలు ఉపయోగిస్తున్నారు. ఇవి వాసన ద్వారా లార్వాలను పసిగడతాయి. ఇందుకోసం జాగిలాలకు ప్రత్యేకంగా శిక్షణ ఇస్తున్నారు. మనుషులకు ముప్పు స్వల్పమే పూర్తిగా ఎదిగిన స్క్రూవార్మ్ పశువులపై గాయాలున్న చోట వందల సంఖ్యలో గుడ్లు పెడుతుంది. గుడ్ల నుంచి బయటకు వచ్చిన లార్వాలు అక్కడే మాంసం తింటూ ఎదుగుతాయి. పశువుల పుండే వాటికి ఆవాసం. రెక్కలొచ్చిన తర్వాత ఎగిరిపోతాయి. మరో పశువుపై వాలి సంతతిని వృద్ధి చేస్తాయి. అమెరికాలో ఇలాంటి ఈగల బెడద ఇదే మొదటిసారి కాదు. 1960, 1970వ దశకంలో విపరీతంగా బాధించాయి. అప్పట్లో పాడి పరిశ్రమకు భారీగా నష్టం వాటిల్లింది. మగ ఈగల ద్వారా అతికష్టంమీద, ఎంతో ఖర్చుతో వీటిని నియంత్రించగలిగారు. స్క్రూవార్స్మ్ మృత పశువుల కంటే బతికి ఉన్న పశువులపై ఉండడానికే ఇష్టపడతాయి. ఇంట్లో పెంచుకొనే శునకాలు, పిల్లులకు కూడా ఇవి వ్యాప్తి చెందుతాయి. మనుషులకు కూడా ముప్పు ఉన్నప్పటికీ అది చాలా స్వల్పమే. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఈగనా మజాకా! ఏకంగా పది గ్రామాల్లో పెళ్లిళ్లు ఆగిపోయాయి..
ఇంతవరకు ఎన్నోరకాల వింత వింత సంఘటనలు గురించి విన్నాం. ఏగ్రామంలోనైనా కనీసం ఏడాదికి ఎంతకాదన్న సుమారుగా మూడు నుంచి పది వరకు పెళ్లి సంబరాలు జరుగుతుంటాయి. కానీ ఇక్కడ ఆయా గ్రామాల్లో పెళ్లిళ్లే జరగడం లేదు. పైగా అక్కడి కోడళ్లు సైతం తమ తల్లిదండ్రుల వద్దకు వెళ్లిపోయి కాపురానికి రానని తెగేసి చెబుతున్నారు. అసలు ఏంటి ఇది? ఎందుకిలా? అని ఆశ్యర్యపోకండి. అసలు విషయం వింటే ఆ! అని నోరెళ్లబెడతారు. వివరాల్లోకెళ్తే...ఉత్తరప్రదేశ్‌లో హర్దోయ్‌లోని పది గ్రామాల్లో పెళ్లిళ్లు జరగడం లేదు. అక్కడ ఉన్న తల్లిదండ్రులు సైతం తమ పిల్లలకు పెళ్లిళ్లు చేసేందుకు సిద్ధంగా లేరట. కేవలం ఈగలు కారణంగా అక్కడ పెళ్లిళ్లు జరగడం లేదంట. ఆయా గ్రామాల్లో చాలా బీభత్సంగా అక్కడ ఈగలు పెరిగిపోయాయట. వాటి ధాటికి ఆయా గ్రామాల్లో నివశిస్తున్న వారిని ఎవరూ పెళ్లి చేసుకునేందుకు ముందుకు రావడం లేదు. పైగా ఆ గ్రామాల్లోని కోడళ్లు సైతం కాపురానికి రామంటూ తమ పుట్టింటికి వెళ్లిపోతున్నారట. అంతేగాదు ఈ ఊర్నీ వదిలేసి రావాలి లేదా మమ్మల్ని వదిలేయండి అని ఆ ఊరి కోడళ్లే తమ భర్తలతో తెగేసి చెబుతున్నారు. ఆయా గ్రామాల్లోని అబ్బాయిలకు, అమ్మాయిలకు ఇప్పడూ పెళ్లి ఒక సమస్యగా మారింది. ఆయా గ్రామాల్లోని ప్రజలు ఈగలను వదిలించుకోవాలని గ్రామం వెలుపల కూర్చొని నిరసనలు చేస్తున్నారు కూడా. ఈ నిరసనలో మహిళలు పొయ్యిలతో సహ పాల్గొంటున్నారు. వాస్తవానికి ఆయా గ్రామాల్లో 2014 ముందు వరకు అంతా బాగానే ఉంది. అక్కడ ఒక పౌల్ట్రీ ఫారం ప్రారంభమైంది. అది ప్రారంభించిన కొద్దిరోజులకే ఈగల బెడద పెరిగిపోయింది. అది ఇప్పుడూ ఎంతలా ఉందంటే...గతంలో కంటే ఈగలు వందల రెట్లు ఉన్నాయి. ఈ మేరకు పౌల్ట్రీ ఫారమ్‌కు సమీపంలో ఉన్న కార్పెంటర్పూర్వా గ్రామం తోపాటు కుయాన్, పట్టి, దహి, సలేంపూర్, ఫతేపూర్, ఝల్పూర్వా, నయాగావ్, డియోరియా, ఎక్ఘరాలకు ఈగల భయం వ్యాపించింది. పాపం ఇక్కడి గ్రామస్తులు మాదిరిగానే పాలక వర్గం సైతం ఈ ఈగల విషయంలో నిస్సహాయంగా ఉంది. (చదవండి: వివాహ మండపంలోకి ఎద్దు ఎంట్రీ..పరుగులు తీస్తున్న జనాలు) -
రెక్కల తేల్ల గురించి విన్నారా..!
నేల మీద పాక్కుంటూ వచ్చే తేలును చూడగానే.. గుండె ఆగినంత పనవుతుంది. కనీసం ఆ పేరు విన్నా.. ఆగకుండా ఆమడదూరం పరుగుతీస్తాం. నేల మీద పాకే తేలుకే అంత భయపడితే .. రెక్కలు కట్టుకుని ఎరిగే తేలు కనిపిస్తే? ప్రాణాలు గాల్లో కలిసిపోవూ అంటారా? అయితే ఈ చిత్రాన్ని గమనించండి. ఇది ఎగిరే తేలు. కంగారు పడకండి.. ప్రమాదకరం కాదు. చూడ్డానికి అచ్చం తేలులా ఉండే ఈ ప్రాణి పేరు స్కార్పియన్ ఫ్లై. ఇదో కీటకం. తూనీగలు, కందిరీగల జాతికి చెందినది. వీటిలో మగ స్కార్పియాన్ ఫ్లైకి పొట్ట, జననాంగం పొడవుగా సాగి తేలు కొండిలా కనిపిస్తుంది. ఈ కీటకాలు ఎగురుతుంటే అచ్చం తేళ్లలాగే కనిపిస్తాయి. ఇవి విషపూరితం కావు కాబట్టి ఎలాంటి ప్రమాదం లేదు. ఎంతయినా ప్రకృతిలోని వింతలు.. వైవిధ్యాలను చూడతరమా! -
మొబైల్ ఫోన్‌ను ఎత్తుకుపోయిన చిలుక.. ఫన్నీవీడియో
సాధారణంగా మనలో చాలా మందికి ఫోటోలు, సెల్ఫీవీడియోలు తీసుకోవడం అంటే మహసరదా. దీనికోసం ప్రత్యేకంగా తయారై మరీ ఫోటోలు దిగుతుంటారు. ఈ క్రమంలో కొందరు ఫోటోలు దిగడానికి ప్రత్యేకమైన ప్రదేశాలకు వేళ్తుంటే.. మరికొంత మంది తమ ఇంట్లో లేదా మిద్దేమీదకో వెళ్లి ఫోటోలు దిగుతుంటారు. ఈ క్రమంలో ఒక్కొసారి కొన్ని ఫన్నీ సంఘటనలు కూడా చోటు చేసుకుంటుంటాయి. మన ఇంట్లోని తినే వస్తువులను కోతులు ఎత్తుకుపోవడం మనకు తెలిసిందే. ఇక్కడో పక్షి ఏకంగా మొబైల్ ఫోన్‌ను ఎత్తుకుపోయింది. ప్రస్తుతం ఈ ఫన్నీవీడియో సోషల్ మీడియలో చక్కర్లు కొడుతుంది. దీనిలో ఒక వ్యక్తి ఇంట్లో మిద్దేమీద తన మొబైల్ ఫోన్‌ను చేతిలో పట్టుకుని ఉన్నాడు. ఫోటోలు దిగుతున్నాడో.. మరేంటోకానీ.. కాసేపటికి తన ఫోన్‌ను కాస్త పక్కన ఉన్న పిట్ట గోడ మీద ఉంచాడు. అయితే, ఎక్కడి నుంచి వచ్చిందో గానీ ఒక రామచిలుక వచ్చింది. ఆ ఫోన్‌ను తినేపదార్థం అనుకుందో.. మరేం అనుకుందో గానీ దాన్ని తన కాళ్ల మధ్యలో పట్టుకొని తుర్రున గాలిలో ఎగిరింది. ఆ వ్యక్తి , వెంటనే ఏదో అలజడి కావడంతో తన ఫోన్ కోసం అటూ ఇటూ చూశాడు. తన మొబైల్ ఫోన్‌ను ఒక రామ చిలుక తన కాళ్లలో అదిమి పట్టుకుని గాల్లో ఎగిరిపోతుండటాన్ని గమనించాడు. వెంటనే దాన్ని పట్టుకొవడానికి ప్రయత్నించాడు. అయినప్పటికి అది చిక్కలేదు. మొబైల్ ఫోన్ వీడియో ఆన్‌లోనే ఉండటంతో అది ఆకాశంలో వెళ్తున్నప్పుడు అక్కడి ఇళ్లు, నగరాలు అన్ని దాటుకుంటు ప్రయాణిస్తున్న దృష్యాలు అందులో రికార్డు అయ్యాయి. ఈ సంఘటన ఎక్కడ జరిగిందో వివరాలు లేవు. దీన్ని ఫ్రెడ్జ్ స్కూల్జ్ అనే యూజర్ ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. అది కాస్త వైరల్‌గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు.. ‘భలే చిలుక.. పాపం సెల్ఫీ దిగుతామని తీసుకుందేమో..’, ‘ఇది నిజమైన వీడియో కాదు..’, ‘బరువైన సెల్‌ఫోన్‌ను చిలుక ఎలా పట్టుకుందబ్బా.. ’, ‘కింద పడకుండా ఎంత బాగా పట్టుకుంది..’, ‘ఆ ఫోన్ మళ్లి మీకు ఎక్కడ దొరికింది’ ?, అంటూ కామెంట్లు పెడుతున్నారు. Parrot takes the phone on a fantastic trip. 😳🤯😂🦜 pic.twitter.com/Yjt9IGc124 — Fred Schultz (@fred035schultz) August 24, 2021 చదవండి: Anaconda: రోడ్డు దాటుతున్న భారీ అనకొండ.. షాకింగ్ వీడియో.. -
ఫోన్ దొంగిలించిన పక్షి.. వీడియో వైరల్
సాధారణంగా ఫోన్ మనజీవితంలో ఒక భాగమైపోయింది. కొంత మందిని దీన్ని ఆరోప్రాణంగా కూడా భావిస్తారు. అయితే.. ఇలాంటి ఫోన్‌ను ఎవరైన ఎత్తుకుపోతే ఇంకేమైనా ఉందా... అయితే తాజాగా ఇలాంటి ఘటన ఒకటి జరిగింది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. ఫోన్‌ను ఎత్తుకుపోయింది. ఏ దొంగలో కాదూ.. ఒక పక్షి. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగవైరల్ అవుతుంది. వివరాల్లోకి వెళ్తే.. ఒక మహిళ తన మిత్రులతో కలిసి టెర్రాస్ పైన సరదాగా మాట్లాడుకుంటున్నట్లున్నారు. వారి ఫోన్లను పక్కన పెట్టేసి మరీమాటల్లో మునిగిపోయారు. అయితే, ఎక్కడి నుంచి వచ్చిందో కానీ.. ఒక పక్షి వచ్చి పిట్ట గోడ మీద ఉంచిన స్మార్ట్‌ఫోన్‌ను నోటితో కరుచుకుని అక్కడి నుంచి ఎగురుకుంటు వెళ్లిపోతుంది. అయితే , ఒక్కసారి షాక్‌కు గురైన ఆ మహిళ ఆ పక్షి వెంట పరిగెత్తింది. ఆఫోన్ నాదీ.. నాదీ నాకిచ్చేయ్ అంటూ అరుస్తు దాని వెంట పడింది. ఆమెతో ఉన్న మిత్రులు మాత్రం ఆ పక్షిని పట్టుకొవడం మానేసి, తన సహచరి ఫోన్ కోసం పడుతున్న సరదా సన్నివేశాన్ని ఫోన్లో వీడియో తీస్తు.. తెగ నవ్వుకుంటున్నారు. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీన్ని చూసిన నెటిజన్లు ‘ పాపం, ఆ పక్షి తినే పదార్థం అనుకొని ఉంటుందేమో.. ఎవరికైన గిఫ్ట్‌గా ఇవ్వాలనుకుందేమో’.. అని ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు. -
దోమ.. ఈగల వేట
సిటీవాసులకు దోమలు, ఈగలతో జీవనం సర్వసాధారణమే. కానీ అగ్రదేశాల నుంచి వచ్చే ప్రతినిధులకు దోమలంటే మహా భయం. విష ప్రాణులు, క్రూర జంతువుల దాడిలో మరణించే వారికంటే ప్రపంచ వ్యాప్తంగా దోమకాటు మరణాలే ఎక్కువ. దీంతో వారు ఈ చిన్న ప్రాణి అంటే ఆయా దేశాలవారు వణికి పోతారు. ఈ నేపథ్యంలో విదేశీ ప్రతినిధులను దోమ కుట్టకుండా జీహెచ్ఎంసీ రేయింబళ్లు వేట సాగిస్తోంది. సదస్సు జరుగనున్న హెచ్ఐసీసీ, విందు ఇచ్చే గోల్కొండ కోట, ఫలక్‌నుమా ప్యాలెస్ పరిసరాల్లో పెద్ద ఎత్తున ఫాగింగ్ చేస్తున్నారు. చెరువుల్లో గుర్రపుడెక్కను తొలగిస్తున్నారు. దోమల ఉనికి లేకుండా పనులు చేస్తున్నారు. సాక్షి, సిటీబ్యూరో: విదేశీ ప్రతినిధులకు 28వ తేదీ రాత్రి విందు జరుగనున్న ఫలక్‌నుమా ప్యాలెస్ పరిసరాల్లో ఐఆర్ఎస్ స్ప్రే చేస్తున్నారు. స్రేయింగ్కు అల్ఫా సైపర్ మెథ్రిన్, ఫాగింగ్‌కు సిఫనోథ్రిన్తో పాటు ఆలౌట్ మాదిరిగా పనిచేసే పొగ రాకుండా ఏరియల్ స్ప్రే కోసం ఫైరిథ్రమ్ను ప్రత్యేకంగా వినియోగిస్తున్నారు. గోల్కొండ కోట మొత్తం ఏసీఎం పౌడర్‌తో నాలుగు రోజులుగా ముమ్మరంగా దోమల వేట సాగిస్తున్నారు. శక్తివంతమైన నాలుగు భారీ స్ప్రేయర్లతో ఫైరిథ్రమ్ను చల్లుతున్నారు. కోట పరిసరాల్లోని శాతం తలాబ్, హుడా పార్కు పరిసరాల్లో భారీ సిబ్బందితో నాలుగు రోజులుగా గుర్రపుడెక్క తొలగిస్తున్నారు. ఫలక్‌నుమా, హెచ్ఐసీసీ పరిసర ప్రాంతాల్లోని చెరువుల్లోనూ గుర్రపు డెక్క తొలగింపుతో పాటు ఐదేసి భారీ వాహనాలు, 15 పోర్టబుల్ యంత్రాలతో నిరంతరం ఫాగింగ్ చేస్తున్నారు. అతిథులు ఉండే మూడు రాత్రులు దోమల బెడద లేకుండా చేసేందుకు మహా యుద్ధం చేస్తున్నారు. గోల్కొండ కోట వద్ద 150 మంది, ఫలక్‌నుమా వద్ద 54 మంది, హెచ్ఐసీసీ వద్ద 36 మంది సిబ్బంది 24్ఠ7గా దోమల నిర్మూలనలో నిమగ్నమయ్యారు. వీరితోపాటు ఐదుగురు అసిస్టెంట్ ఎంటమాలజిస్టులు, 10 మంది సూపర్వైజర్లు ఇవే పనుల్లో ఉన్నారు. గత నాలుగైదు రోజుల్లో మూడెకరాల పరిధిలోని శాతం చెరువులో గుర్రపుడెక్క పనులు పూర్తయ్యాయని జీహెచ్ఎంసీ చీఫ్ ఎంటమాలజిస్ట్ వెంకటేశ్ తెలిపారు. అతిథులు పర్యటించే ప్రాంతాల్లోని నాలాలు, చెరువుల్లోనూ గుర్రడపుడెక్క తొలగింపు పనులు ముమ్మరంగా చేస్తున్నారు. నిలోఫర్‌లో 24 గంటల ఫార్మసీ నాంపల్లి: నవ జాత శిశువుల సంరక్షణా కేంద్రం నిలోఫర్ ఆస్పత్రిలో 24 గంటల ఫార్మసీని ప్రారంభించాలని డీఎంఈ డాక్టర్ రమేష్‌రెడ్డి ఆదేశించారు. దీనిని 27 నుంచి అందుబాటులోకి తేవాలని నిలోఫర్ సూపరింటెండెంట్ డాక్టర్ మురళీకృష్ణకు సూచించారు. గురువారం రెడ్‌హిల్స్‌లోని ఆస్పత్రిని సందర్శించిన డాక్టర్ రమేష్‌రెడ్డి వైద్యాధికారులతో సమావేశమై పలు సమస్యలపై సమీక్షించారు. నర్సుల పోస్టుల భర్తీని త్వరలోనే పూర్తి చేస్తామన్నారు. రాజీవ్ ఇంటెన్సివ్ కేర్ బ్లాక్‌లో 24 గంటల ఫార్మసీ అందుబాటులోకి వస్తుందన్నారు. ఆర్ఎంఓ డాక్టర్ నరహరి, ఇతర వైద్యాధికారులు పాల్గొన్నారు. రొటేషన్ పద్ధతిలో టెక్నిషియన్ల విధులు నిలోఫర్ రేడియాలజీ, పాథాలజీ, మైక్రో బయాలజీ విభాగాల్లో సుమారు 40 మంది టెక్నిషియన్లు పని చేస్తున్నారు. వీరంతా ఏళ్ల తరబడి ఒకేచోట పాతుకపోయి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఇదే అంశంపై ఇటీవల 13 మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను విధుల నుంచి తొలగించిన విషయం తెలిసిందే. రొటేషన్ పద్ధతిలో టెక్నిషియన్లకు విధులు అప్పగించడం వల్ల వారి పనితీరు మెరుగుపడే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే వైద్యులు సహా నాలుగో తరగతి ఉద్యోగులు రొటేషన్ పద్థతిలో పని చేస్తున్నారు. టెక్నిషియన్లను కూడా అలా పని చేయించడం వల్ల మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. -
‘చెత్త’శుద్ధి ఏదీ?
మొయినాబాద్ రూరల్: పల్లెల్లో పారిశుద్ధ్యం పడకేసింది.. ఎక్కడ చూసినా చెత్తకుప్పలు, మురుగు కాలువలు పేరుకుపోయి కనిపిస్తున్నాయి. అధికారులకు ‘చెత్త’శుద్ధి లోపించింది. ఏదో తూతూమంత్రంగా పారిశుద్ధ్య వారోత్సవాలు నిర్వహించి వదిలేశారు. మండల పరిధిలోని అమ్డాపూర్, హిమాయత్‌నగర్, బాకారం, ముర్తజా గూడ, కాశింబౌళి, నదీంమ్‌పేట్, ఎన్కేపల్లి, మొయినాబాద్ గ్రామాల్లో పరిస్థితి అస్తవ్యస్తంగా తయారైంది. దశాబ్దాల క్రితం నిర్మించిన మురికి కాలువలు శిథిలావస్థకు చేరుకొన్నాయి. చెత్తాచెదారం పేరుకుపోయి తీవ్ర దుర్గంధం వెదజల్లుతోంది. దోమలు, ఈగలు వ్యాపించి రోగాల బారిన పడే ప్రమాదం ఉందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలంలో మురుగుకాలువలు శుభ్రం చేయాలనే లక్ష ్యంతో ఏటా చేపట్టే పారిశుద్ధ్య వారోత్సవాలను అధికారులు 20రోజుల క్రితం నిర్వహించారు. అయినప్పటికీ ఒనగూరిన ప్రయోజనం శూన్యం. రోడ్లపై ఎక్కడి చెత్తకుప్పలు అక్కడే దర్శనమిస్తున్నాయి. గ్రామాల్లో పారిశుద్ధ్య పనుల నిమిత్తం జాతీయ ఆరోగ్య సంస్థ ద్వారా ఏటా పంచాయతీలకు రూ.10వేలు మంజూరు చేసేవారని, ఈసారి అవి కూడా రాలేదని ప్రజాప్రతినిధులు చేతులెత్తేస్తున్నారు. రోగాలు దరిచేరకముందే అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి గ్రామాల్లో పేరుకపోయిన చెత్తాచెదారాన్ని తొలగించాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.