గ్రీన్‌కార్డ్‌ ఆశలకు షాక్‌ | USA to restrict H-1B visa workers to apply for green cards | Sakshi
Sakshi News home page

గ్రీన్‌కార్డ్‌ ఆశలకు షాక్‌

Oct 9 2026 4:27 AM | Updated on Oct 9 2026 4:27 AM

USA to restrict H-1B visa workers to apply for green cards

హెచ్‌–1బీ వీసా ఉద్యోగులకు నో 

దరఖాస్తు చేయకుండా ఐటీ దిగ్గజాలకు చెక్‌ 

అమెరికన్ల నుంచి ఉద్యోగాలను లాగేసుకుంటున్నాయన్న యూఎస్‌ కార్మిక మంత్రి

వాషింగ్టన్‌:  ఐటీ దిగ్గజాలు కాగ్నిజెంట్, ఇన్ఫోసిస్, టాటా, విప్రో, హెచ్‌సీఎల్, క్యాప్‌జెమిని, మైక్రోసాఫ్ట్, అడోబ్‌ కంపెనీలలో పనిచేస్తున్న హెచ్‌–1బీ వీసా కలిగిన ఉద్యోగులు శాశ్వత నివాసానికి వీలు కల్పించే గ్రీన్‌కార్డ్‌కు దరఖాస్తు చేయడాన్ని యూఎస్‌ ప్రభుత్వం నిషేధించింది. ఈ అంశాన్ని యూఎస్‌ కార్మిక మంత్రి కీత్‌ శాండర్లింగ్‌ ప్రకటించగా.. యూఎస్‌ యాంటీఫ్రాడ్‌ టాస్క్‌ ఫోర్స్‌ హెడ్, వైస్‌ ప్రెసిడెంట్‌ జేడీ వాన్స్‌ మద్దతు పలికారు.

కొన్ని భారీ ఐటీ సోర్సింగ్‌ కంపెనీ ఉద్యోగులకు పెర్మనెంట్‌ లేబర్‌ సర్టిఫికేషన్‌ ప్రోగ్రామ్‌ను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు కీత్‌ పేర్కొన్నారు. ఈ కంపెనీల నుంచి కొత్తగా లేదా పెండింగ్‌లో ఉన్న గ్రీన్‌ కార్డ్‌ దరఖాస్తులను అనుమతించబోమని స్పష్టం చేశారు. 2009 నుంచి చూస్తే కేవలం 3 కంపెనీలు 30 లక్షలమంది విదేశీ ఉద్యోగుల కోసం దరఖాస్తు చేసినట్లు వెల్లడించారు. ఈ కంపెనీలు 2,30,000 హెచ్‌–1బీ వీసా అనుమతులు పొందడం సహా లక్షకు పైగా గ్రీన్‌ కార్డులను సొంతం చేసుకున్నట్లు వెల్లడించారు. వెరసి అమెరికన్ల నుంచి లక్షల కొద్దీ ఉద్యోగాలను లాగేసుకున్నట్లు వ్యాఖ్యానించారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement