USA Presidential Elections 2024: అత్యంత అవినీతిపరురాలు | USA Presidential Elections 2024: Trump slams Harris, Kamala Harris is the most corrupt | Sakshi
Sakshi News home page

USA Presidential Elections 2024: అత్యంత అవినీతిపరురాలు

Nov 5 2024 5:15 AM | Updated on Nov 5 2024 5:15 AM

USA Presidential Elections 2024: Trump slams Harris, Kamala Harris is the most corrupt

హారిస్‌పై ట్రంప్‌ ఆరోపణలు

వాషింగ్టన్‌: 2020 ఎన్నికల్లో ఓటమి తర్వాత తాను వైట్‌హౌస్‌ను వీడకుండా ఉండాల్సిందని మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌ అన్నారు. డెమొక్రాట్లు తనను మోసగించి గెలిచారని ఆరోపించారు. హోరాహోరీ ఎన్నికల ప్రచారం ముగింపు సందర్భంగా ఆది, సోమవారాల్లో ఆయన కీలక స్వింగ్‌ రాష్ట్రాల్లో పర్యటించారు. 

పెన్సిల్వేనియా, నార్త్‌ కరోలినా, జార్జియాల్లో పలు ర్యాలీల్లో మాట్లాడారు. ‘2020 ఎన్నికల్లో మనమేంటో చూపించాం. విజయం అంచుకు చేరాం. ఆ తర్వాతి పరిణామాలను ఎదుర్కోవాల్సింది. వైట్‌హౌస్‌ను వీడి ఉండాల్సింది కాదు’’ అన్నారు. ‘‘డెమొక్రాటిక్‌ పార్టీ ఓ రాక్షస పార్టీ. అతి పెద్ద అవినీతి యంత్రం. ఇక హారిస్‌ అత్యంత అవినీతిపరురాలు’’ అంటూ దుయ్యబట్టారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement