
ఇప్పటికే చాలా సమీపంలోకి వచ్చాం
మాతో ఒప్పందంపై తుది నిర్ణయం విదేశాలదే
మా దేశంలో ఉత్పత్తులు అమ్ముకోవాలంటే సుంకాలు చెల్లించాల్సిందే
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టికరణ
న్యూయార్క్: ఇండియాతో అతి త్వరలో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోబోతున్నామని, ఈ విషయంలో ఇప్పటికే చాలా సమీపంలోకి వచ్చామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఇతర దేశాల నుంచి అమెరికాలోకి వచ్చే ఉత్పత్తులపై ఎంతమేరకు సుంకాలు విధించబోతున్నామో తెలియజేస్తూ తమ అధికారులు ఆయా దేశాలకు లేఖలు పంపిస్తున్నారని వెల్లడించారు. యునైటెడ్ కింగ్‌డమ్(యూకే), చైనాతో తాజాగా ట్రేడ్ డీల్ కుదిరిందని, ఇకపై భారత్‌తో ఒప్పందానికి చాలా దగ్గరగా వచ్చేశామని అన్నారు.
స్థానిక కాలమానం ప్రకారం సోమవారం ఓ కార్యక్రమంలో ట్రంప్ మాట్లాడారు. లేఖలు పంపించడం వరకే తమ బాధ్యత అని, తమతో ఒప్పందానికి ముందుకు రావాలో వద్దో ఆయా దేశాలే తేల్చుకోవాలని, తుది నిర్ణయం వారిదేనని పరోక్షంగా స్పష్టంచేశారు. కొన్ని దేశాలు తమ ఉత్పత్తులపై 200 శాతం దాకా సుంకాలు విధిస్తున్నాయని, అమెరికాను దోచుకోవడమే వాటి విధానామా? అని ప్రశ్నించారు. ఇకపై అమెరికాలో ఉత్పత్తులు విక్రయించుకోవాలంటే సుంకాలు చెల్లించకతప్పదని తేలి్చచెప్పారు. భారత్–పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని తానే ఆపేశానని, ఆ ఘనత తనకే చెందాలని ట్రంప్ మరోసారి వ్యాఖ్యానించారు. మాట వినకపోతే వ్యాపారం, వాణిజ్యం నిలిపివేస్తానని హెచ్చరించడంతో ఆ రెండు దేశాలు దారికొచ్చాయని అన్నారు.
విదేశాలపై ఏప్రిల్ 2న విధించిన సుంకాల తాత్కాలిక రద్దును ట్రంప్ సర్కారు ఆగస్టు 1వ తేదీ దాకా పొడిగించిన సంగతి తెలిసిందే. మరోవైపు ట్రంప్ సంతకంతో అమెరికా ప్రభుత్వం లేఖలు పంపించిన దేశాల జాబితాలో ఇండియా లేకపోవడం గమనార్హం. బంగ్లాదేశ్, బోస్నియా, కాంబోడియా, ఇండోనేషియా, జపాన్, కజకిస్తాన్, మలేషియా, దక్షిణాఫ్రికా, దక్షిణ కొరియా, థాయ్‌లాండ్, టునీíÙయా తదితర దేశాలకు ఈ లేఖలు అందాయి.
మయన్మార్, లావోస్‌పై 40 శాతం టారిఫ్
మయన్మార్, లావోస్‌పై డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ మోత మోగించారు. రెండు దేశాల ఉత్పత్తులపై 40 శాతం టారిఫ్ విధిస్తున్నట్లు సోమవారం ప్రకటించారు. ఈ మేరకు ఆయా దేశాల అధినేతలకు రాసిన లేఖలను సోషల్ మీడియాలో పోస్టుచేశారు. అలాగే కాంబోడియా, థాయ్‌లాండ్‌పై 36 శాతం, సెర్బియా, బంగ్లాదేశ్‌పై 35 శాతం, ఇండోనేíÙయాపై 32 శాతం, దక్షిణాఫ్రికా, బోస్నియా, హెర్జిగోవినాపై 30 శాతం, కజకిస్తాన్, మలేషియా, టునీíÙయాపై 25 శాతం టారిఫ్ విధిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇవి ఆగస్టు 1 నుంచే అమల్లోకి వస్తాయని వెల్లడించారు. ఈ టారిఫ్‌లకు ప్రతీకారంగా అమెరికా ఉత్పత్తులపై టారిఫ్‌లు పెంచే ఆలోచన చేయొద్దని ఆయా దేశాల అధినేతలను సున్నితంగా హెచ్చరించారు. జపాన్, దక్షిణ కొరియా ఉత్పత్తులపై 25 శాతం సుంకాలు విధించిన సంగతి తెలిసిందే.
బ్రిక్స్‌పై 10 శాతం సుంకాలు
పునరుద్ఘాటించిన ట్రంప్
న్యూయార్క్/వాషింగ్టన్: బ్రిక్స్ కూట మిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి అక్కసు వెళ్లగక్కారు. తమ దే శాన్ని, కరెన్సీ (డాలర్) ఆధిపత్యాన్ని దెబ్బ తీసేందుకే అది ఆవిర్భవించిందని మంగళవారం ఆరోపించారు. ‘‘డాలర్‌కు అంతర్జాతీయంగా ఉన్న విలువను నాశ నం చేసేందుకు బ్రిక్స్ దేశాలు ప్రయ త్ని స్తున్నాయి. తెలివైన అధ్యక్షుడెవరూ అలా జరగనివ్వరు. అది ఒక పెద్ద ప్రపంచ యుద్ధంలో ఓటమి చవిచూడటం వంటిదే.
అలా ఎప్పటికీ జరగనివ్వం. ప్రపంచ కరెన్సీల్లో ఇప్పటికీ, ఎప్పటికీ డాలరే కింగ్. దాని ఆధిపత్యాన్ని సవాలు చేయాలనుకుని బ్రిక్స్ దేశాలు అనుకుంటే, తద్వారా మాతో ఆటలు ఆడాలనుకుంటే అభ్యంతరం లేదు. కానీ అందుకు మూల్యంగా వాటన్నింటిపైనా మరో 10 శాతం సుంకాలు విధించి తీరతాం. కేవలం బ్రిక్స్‌కూటమిలో ఉన్నందుకు అవి చెల్లించాల్సిన భారీ మూల్యమిది. అందుకు అవి సిద్ధంగా ఉన్నాయని నేను భావించడం లేదు’’ అన్నారు.