ఇరాన్‌ రక్షణ స్థావరాలపై అమెరికా దాడులు | US attacks on Iranian defense installations | Sakshi
Sakshi News home page

ఇరాన్‌ రక్షణ స్థావరాలపై అమెరికా దాడులు

Jul 15 2026 6:01 PM | Updated on Jul 15 2026 6:43 PM

US attacks on Iranian defense installations

టెహ్రాన్‌:ఇరాన్‌పై అమెరికా మరోసారి దాడులు ప్రారంభించింది.  ఇరాన్‌ తీర ‍ప్రాంతాల్లోని సైనిక స్థావరాలపై మిసైళ్లతో విరుచుకపడుతోంది. ఇరాన్‌పై దాడులను యూఎస్‌ కమాండ్ కంట్రోల్‌ అధికారికంగా ధృవీకరించింది. కాగా పశ్చిమాసియాలో పరిస్థితులు మరోసారి ఉద్రిక్తంగా మారాయి. ఇరాన్‌, అమెరికా పరస్పరం దాడులకు తెగబడుతుండడంతో పరిస్థితులు ఆందోళనకరంగా మారాయి.

అమెరికా మిలిటరీకిసెంట్రల్ కమాండ్ 90 నిమిషాల పాటు ఇరాన్ తీరప్రాంత రక్షణ వ్యవస్థలు, క్రూయిజ్ క్షిపణి నిల్వ కేంద్రాలపై బాంబుల వర్షం కురిపించింది. ముఖ్యంగా గ్రేటర్ తుంబ్ ఐలాండ్, చాబహార్ వంటి తీర ప్రాంతాల్లోని సైనిక స్థావరాలే టార్గెట్‌గా బాంబు దాడులు చేసింది.

అమెరికా దాడులకు ప్రతి స్పందనగా  ఇరాన్ సైతం దాడులకు తెగబడుతుంది.  ఈ రోజు తెల్లవారుజామున బహ్రెయిన్, కువైట్, జోర్డాన్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా  క్షిపణులు, డ్రోన్లతో ఎదురుదాడులు చేసింది. ఈ దాడులతో  బహ్రెయిన్‌లోని అమెరికా నౌకాదళ  ప్రధాన కార్యాలయం తీవ్రంగా దెబ్బతిందని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ (IRGC) ప్రకటించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement