కీర్‌ స్టార్మర్‌ స్థానంలో బర్న్‌హామ్‌?  | UK Prime Minister Starmer to quit after Burnham by-election win | Sakshi
Sakshi News home page

కీర్‌ స్టార్మర్‌ స్థానంలో బర్న్‌హామ్‌? 

Jun 22 2026 5:05 AM | Updated on Jun 22 2026 6:24 AM

UK Prime Minister Starmer to quit after Burnham by-election win

నేడు స్టార్మర్‌ రాజీనామా చేసే అవకాశం  

లండన్‌: బ్రిటన్‌ ప్రధాని కీర్‌ స్టార్మర్‌ పదవి నుంచి వైదొలిగే సూచనలు కన్పిస్తున్నాయి. తాజాగా ఎంపీగా ఎన్నికైన ఆండీ బర్న్‌హామ్‌కు ప్రధానిగా బాధ్యతలు అప్పగించేందుకు లేబర్‌ పార్టీలో ప్రయత్నాలు ఊపందుకున్నట్లు వార్తలొచ్చాయి. బర్న్‌హామ్‌ ఎన్నిక అనంతరం శుక్రవారం చేసిన ప్రకటనకు కీర్‌ స్టార్మర్‌ కట్టుబడి ఉన్నారని, పదవిని వీడే ఆలోచన లేదని ప్రధాని కార్యాలయం అంటోంది. అయితే, పరిస్థితి వేరుగా ఉంది. 

బర్న్‌హామ్‌కు కనీసం 300 మంది లేబర్‌ ఎంపీలు మద్దతు ప్రకటించే అవకాశముందని ‘ది గార్డియన్‌’ పేర్కొంది. స్టార్మర్‌ సోమవారం పదవి నుంచి తప్పుకునే అవకాశముందని పేర్కొంది. ఆదివారం జరిగిన భేటీలో కీర్‌ స్టార్మర్‌తో బర్న్‌హామ్‌ ఎలాంటి దాపరికాలు లేకుండా మాట్లాడారని, బాధ్యతల నుంచి తప్పుకోవాలని కోరినట్లు లేబర్‌ పార్టీ నేత ఒకరు చెప్పారు. 

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ చేసిన ఓ ప్రకటన అగ్నికి ఆజ్యం పోసేలా ఉంది. వలస విధానం వంటి కీలక అంశాల్లో విఫలమైన స్టార్మర్‌ పదవి నుంచి దిగడం ఖాయమంటూ ట్రంప్‌ వ్యాఖ్యానించారు. కాగా, స్టార్మర్‌ రాజీనామా వదంతుల నేపథ్యంలో మంత్రి పీటర్‌ కైల్‌ స్పందిస్తూ.. రాజకీయపరమైన వాస్తవ పరిస్థితులను ఆయన బేరీజు వేస్తున్నారని తెలపడం గమనార్హం. 

స్టార్మర్‌ పదవి నుంచి తప్పుకునేందుకు నిరాకరించిన పక్షంలో..లేబర్‌ పార్టీ మరో నేతను ఎన్నుకునే వరకు ఆపద్ధర్మ ప్రధానిగా ఆయన్ను కొనసాగాలని కోరే అవకాశముందని చెబుతున్నారు. అటువంటి ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొనటానికి బదులుగా  ముందుగానే వైదొలిగే అవకాశాన్నే ఎంచుకుంటారని భావిస్తున్నారు. మాజీ ఆరోగ్య మంత్రి వెస్‌ స్ట్రీటింగ్‌ ప్రధాని రేసులో ఉన్నట్లు తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement