రష్యా ఔట్‌! ఆర్థిక పరంగా రష్యాని దిగ్బంధం చేస్తున్న యూఎస్‌

Russia Says Foreign Debt In Rubles After US Ended Exemption - Sakshi

US Treasury announced To Close: రష్యా గత కొన్ని నెలలుగా ఉక్రెయిన్ పై నిరవధిక దాడులతో దురాక్రమణకు దిగుతున్న సంగతి తెలిసిందే. దీంతో అమెరికా వంటి ప్రపంచ దేశాలు, ఐక్యరాజ్యసమితి, అంతర్జాతీయ న్యాయస్థానం సైతం ముందుకు వచ్చి యుద్ధాన్ని ఆపేయమన్నా ససేమిరా అంటూనే వచ్చింది. రష్యా ఆటకట్టించేలా ఆర్థిక పరంగా ఇబ్బంది పెట్టేలా ప్రపంచ దేశాలు అంతర్జాతీయ లావాదేవీలపై ఆంక్షలు విధించాయి కూడా.  అయినా రష్యా ఏ మాత్రం దూకుడు తగ్గించపోగా, యుద్ధ నేరాలకు పాల్పడుతోంది. దీంతో రష్యాను ఆంక్షల నుంచి తప్పించుకోకుండా ఉండేలా దారులన్నింటిని మూసేసింది యూఎస్‌.

అందులో భాగంగానే అమెరికా యూఎస్‌ ట్రెజరీని మూసేసినట్లు ప్రకటించింది. దీంతో రష్యా విదేశీ రుణాన్ని చెల్లించటానికి యూఎస్‌ బ్యాంకులోని నిధులను యాక్సెస్‌ చేసుకునే సామార్థ్యాన్ని నిరోధించింది. ఐతే రష్యా కూడా తన విదేశీ రుణాన్ని రూబెళ్లలోనే చెల్లిస్తానని పేర్కొనడం గమనార్హం. అంతేకాదు రష్యన్‌ ఆర్థిక వ్యవస్థను ఏజెంట్‌గా ఉంచి చెల్లింపులు నిర్వహిస్తామని రష్యా మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇప్పటికే పాశ్చాత్య ఆంక్షలతో రష్యాను అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ నుంచి వేరే చేసింది. మళ్లీ అమెరికా ఈ ప్రకటనతో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ని ప్రభుత్వ చెల్లింపులు చేయనీకుండా విదేశీ కరెన్సీ నిల్వల పై యూఎస్‌ షాకిచ్చింది.

ఈ మేరకు రష్యా ఆర్థిక మంత్రి ఆంటోన్ సిలువానోవ్ మాట్లాడుతూ..."రష్యాకు ఎలాంటి స్నేహ పూర్వ వాతావరణం లేకుండా ఒంటరిని చేసింది. ప్రధానంగా రష్యన్‌ రుణ సాధనాల్లో విదేశీ పెట్టుబడిదారుల హక్కులను కూడా యూఎస్‌ దెబ్బతీసింది. అయినా మా వద్ద డబ్బు ఉంది. చెల్లింపులు చేయగలం. ఇదేమీ రష్యన్‌ జీవన నాణ్యతను పెద్దగా ప్రభావితం చేయలేదు" అని చెప్పారు. ఏదీఏమైన రష్యా విదేశీ రుణాన్ని చెల్లించాలంటే చాలా బాండ్లు రూబెళ్లలో చెల్లించడానికి అనుమతించవు.

మే 27న రష్యా చెలించాల్సిన తదుపరి విదేశీ రుణం రెండు బాండ్ల పై 100 డాలర్లు వడ్డీ. అందులో ఒక బాండ్‌కి  రష్యా డాలర్లు, యూరోలు, పౌండ్‌లు లేదా స్విస్ ఫ్రాంక్‌లలో మాత్రమే చెల్లించాలి, మరోదానికి రూబెళ్లలో చెల్లించవచ్చు. మరోవైపు రష్యా కూడా విదేశీ రుణ ఎగవేత (డీఫాల్ట్‌) తలెత్తకుండా ఉండేలా ఇప్పటికే త్వరితగతిన దేశం నుంచి నిధులను బదిలీ చేసింది. ప్రస్తుతం రష్యా జూన్‌ చివరినాటి కల్లా 400 డాలర్లు విదేశీ రుణం చెల్లించాలి. ఒకవేళ గ్రేస్‌ పిరియడ్‌ లోపు చెల్లించకపోతే డీఫాల్ట్‌గా ప్రకటిస్తుంది. 1918లో బోల్షివిక్ విప్లవ నాయకుడు వ్లాదిమిర్ లెనిన్ పదవీచ్యుతుడైన సమయంలో తొలిసారిగా రష్యాని డీఫాల్ట్‌గా ప్రకటించారు. 
(చదవండి: పుతిన్‌పై హత్యాయత్నం.. తృటిలో తప్పించుకున్న రష్యా అధ్యక్షుడు?)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top