మోదీ వెనకచూపు!

PM Narendra Modi driving Indian car looking into rearview mirror and it crashing - Sakshi

అందుకే తరచూ ప్రమాదాలు: రాహుల్‌ వ్యంగ్యాస్త్రాలు

న్యూయార్క్‌: ‘‘ప్రధాని మోదీ భారతీయ కారును రియర్‌వ్యూ అద్దంలో చూస్తూ నడిపేందుకు ప్రయత్నిస్తున్నారు. అందుకే తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి’’ అంటూ కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. బీజేపీకి గానీ, ఆర్‌ఎస్‌ఎస్‌కి గానీ భవిష్యత్తులోకి చూడగలిగే సామర్థ్యం లేదని విమర్శించారు. ఆయన ఆదివారం ఇండియన్‌ ఓవర్సీస్‌ కాంగ్రెస్‌–అమెరికా విభాగం ఆధ్వర్యంలో న్యూయార్క్‌లోని జవిట్స్‌ సెంటర్‌లో భారతీయ అమెరికన్లనుద్దేశించి మాట్లాడారు. ‘బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ వాళ్లు అసమర్థులు. ఏదడిగినా గతం తవ్వుతారు.

ఒడిశా రైలు ప్రమాదం లాంటివి ఎందుకు జరుగుతున్నాయని అడిగితే ‘50 ఏళ్లనాడు కాంగ్రెస్‌ అలా చేసినందుకే...’ అంటారు. పీరియాడిక్‌ టేబుల్‌ను పాఠ్య పుస్తకాల్లోంచి ఎందుకు తీసేశారంటే 60 ఏళ్ల క్రితం కాంగ్రెస్‌ ఇలా చేసిందని చెబుతారు’’ అని చెణుకులు విసిరారు. ‘‘రియర్‌ మిర్రర్‌లో చూస్తూ కారు నడిపితే వరుస ప్రమాదాలు ఖాయం. మోదీ అలవాటు అదే. భారతీయ కారును సైడ్‌ మిర్రర్‌లో మాత్రమే చూసుకుంటూ నడుపుతున్నారు. అది ముందుకు పోకుండా ప్రమాదాలెందుకు జరుగుతున్నాయో అర్థం చేసుకోవడం లేదు’’ అన్నారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top