breaking news
Indian cars
-
'అలాంటిదేం లేదు.. అదంతా తప్పుడు ప్రచారం': ఆనంద్ మహీంద్రా
పారిశ్రామిక దిగ్గజం 'ఆనంద్ మహీంద్రా' మేడ్ ఇన్ ఇండియా అని చెబుతూనే అన్యదేశ్య బ్రాండ్స్ అయిన బీఎండబ్ల్యూ, మెర్సిడెస్ బెంజ్ కార్లను ఎందుకు ఎంచుకున్నారు, అని 'రతన్ దిలాన్' (Rattan Dhillon) అనే వ్యక్తి ప్రశ్నిస్తూ.. దీనికి సంబంధించిన ఫోటోలను కూడా షేర్ చేశారు.దీనిపైన 'హార్మజ్ద్ సొరాబ్జీ' (Hormazd Sorabjee) స్పందిస్తూ.. ఆనంద్ మహీంద్రా నిబద్దత కలిగిన వ్యక్తి. ఈయన కేవలం ఇండియన్ బ్రాండ్ కార్లను మాత్రమే ఉపయోగితున్నారు. అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్త పూర్తిగా అవాస్తవమని అన్నారు.Given Mr. Anand Mahindra’s strong advocacy for “Made in India,” why does he opt to drive BMW and Mercedes cars instead of a Mahindra Thar, which is built by his own company? @anandmahindra pic.twitter.com/aHl299W1DI— Rattan Dhillon (@ShivrattanDhil1) September 1, 2024ఈ విషయం మీద స్వయంగా ఆనంద్ మహీంద్రా స్పందించారు. నేను విదేశీ బ్రాండ్ కార్లను ఇప్పటి వరకు కొనుగోలు చేయలేదు. నాకు మా అమ్మ మొదట్లో తన లైట్ స్కై-బ్లూ కలర్ ప్రీమియర్ కారులో డ్రైవింగ్ నేర్పించారు. 1991 నుంచి ఇప్పటి వరకు కేవలం మహీంద్రా కార్లను మాత్రమే ఉపయోగిస్తున్నాను. నాకు కంపెనీ కేటాయించిన మొదటి కారు హిందూస్థాన్ మోటార్స్ కాంటెస్సా.ఆ తరువాత కొన్నేళ్ళకు నేను ఆర్మడ, బొలెరో, స్కార్పియో క్లాసిక్, ఎక్స్‌యూవీ 5OO ఉపయోగించని. ఇప్పుడు లేటెస్ట్ రెడ్ స్కార్పియో ఎన్ వినియోగిస్తున్నానని ఆనంద్ మహీంద్రా వెల్లడించారు. సొంత కంపెనీ కార్లను ఉపయోగించడం నాకు ఎంతో గర్వకారణంగా ఉందని ఆయన అన్నారు.సోషల్ మీడియాలో వెల్లడవుతున్న ఫోటో.. మా బట్టిస్టా ఎలక్ట్రిక్ హైపర్‌కార్‌ను విడుదల చేస్తున్నప్పుడు మాంటెరీ కార్ వీక్‌లో తీసుకున్నదే. అది పాతకాలపు సిసిటాలియా. దీనిని మహీంద్రా కంపెనీ డిజైన్ చేసింది. నేను ఇప్పటి వరకు ఎలాంటి అన్యదేశ్య కార్లను కొనుగోలు చేయలేదని ఆనంద్ మహీంద్రా స్పష్టం చేశారు.Hormazd, you have covered Mahindra since the time I joined the company. So you are in a unique position to call out this fabricated and fake story. Thank you.And for the record:I was taught how to drive by my mother, in her light sky-blue colour Premier car (earlier known as… https://t.co/BXFr3hfYVU— anand mahindra (@anandmahindra) September 2, 2024 -
మోదీ వెనకచూపు!
న్యూయార్క్: ‘‘ప్రధాని మోదీ భారతీయ కారును రియర్‌వ్యూ అద్దంలో చూస్తూ నడిపేందుకు ప్రయత్నిస్తున్నారు. అందుకే తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి’’ అంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. బీజేపీకి గానీ, ఆర్ఎస్ఎస్కి గానీ భవిష్యత్తులోకి చూడగలిగే సామర్థ్యం లేదని విమర్శించారు. ఆయన ఆదివారం ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్–అమెరికా విభాగం ఆధ్వర్యంలో న్యూయార్క్‌లోని జవిట్స్ సెంటర్లో భారతీయ అమెరికన్లనుద్దేశించి మాట్లాడారు. ‘బీజేపీ, ఆర్ఎస్ఎస్ వాళ్లు అసమర్థులు. ఏదడిగినా గతం తవ్వుతారు. ఒడిశా రైలు ప్రమాదం లాంటివి ఎందుకు జరుగుతున్నాయని అడిగితే ‘50 ఏళ్లనాడు కాంగ్రెస్ అలా చేసినందుకే...’ అంటారు. పీరియాడిక్ టేబుల్‌ను పాఠ్య పుస్తకాల్లోంచి ఎందుకు తీసేశారంటే 60 ఏళ్ల క్రితం కాంగ్రెస్ ఇలా చేసిందని చెబుతారు’’ అని చెణుకులు విసిరారు. ‘‘రియర్ మిర్రర్లో చూస్తూ కారు నడిపితే వరుస ప్రమాదాలు ఖాయం. మోదీ అలవాటు అదే. భారతీయ కారును సైడ్ మిర్రర్లో మాత్రమే చూసుకుంటూ నడుపుతున్నారు. అది ముందుకు పోకుండా ప్రమాదాలెందుకు జరుగుతున్నాయో అర్థం చేసుకోవడం లేదు’’ అన్నారు. -
రెనో ‘క్విడ్’ వచ్చేసింది..
- అందుబాటులో ఆరు వేరియంట్లు - ధరలు రూ.2.57-రూ.3.53 లక్షల రేంజ్లో - మైలేజీ 25.17 కి.మీ. (పెట్రోలు) న్యూఢిల్లీ: డస్టర్‌తో భారత కార్ల స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్(ఎస్యూవీ)మార్కెట్లో సంచలనం సృష్టించిన రెనో కంపెనీ చిన్న కార్ల మార్కెట్లో మరో సంచలనానికి తెర తీసింది. ఎంట్రీ లెవల్ సెగ్మెంట్లో సరికొత్తగా క్విడ్ కారును గురువారం ఆవిష్కరించింది. ఆరు వేరియంట్లు, ఐదు రంగుల్లో లభించే క్విడ్ కారు పరిచయ ధరలు రూ.2.57 లక్షల నుంచి రూ.3.53 లక్షల రేంజ్లో (ఎక్స్ షోరూమ్, ఢిల్లీ) నిర్ణయించామని రెనో ఇండియా తెలిపింది. తాము క్విడ్ కారుతో ఒక కొత్త శకానికి నాంది పలికామని రెనో ఇండియా సీఈఓ ఎండీ, సుమిత్ సాహ్ని చెప్పారు. చూడటానికి స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్(ఎస్యూవీ)లా కనిపించే ఈ కారులో ఐదుగురు ప్రయాణించవచ్చని, 800 సీసీ పెట్రోల్ ఇంజిన్‌ను అమర్చామని, చెన్నై ప్లాంట్‌లో ఈ కార్లను తయారు చేస్తున్నామని తెలిపారు. మైలేజీ 25.17 కిమీ. వస్తుందని, భారత్‌లో అత్యధిక మైలేజీ ఇచ్చే కారు ఇదేనని చెప్పారు. ఈ కారు అభివృద్ధి కోసం రూ.3,000 కోట్లు పెట్టుబడులు పెట్టామని, అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ కారును రూపొందించామని, త్వరలో ఆటోమేటెడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్(ఏఎంటీ)ను అందిస్తామని తెలిపారు. ఈ ఏడాది చివరినాటికి తమ డీలర్ల నెట్‌వర్క్‌ను 205కు, వచ్చే ఏడాది చివరికల్లా 280కు పెంచుతామని చెప్పారు. ఈ కారును భారత్ నుంచి ఇతర దేశాలకు ఎగుమతి చేస్తామని వివరించారు. ధరల పోరు షురూ! చిన్న కార్ల మార్కెట్లో హల్చల్ చేస్తున్న మారుతీ సుజుకీ, హ్యుందాయ్‌ల విక్రయాలపై క్విడ్ ప్రభావం తీవ్రంగానే ఉండగలదని మార్కెట్ నిపుణులంటున్నారు. మారుతీ ఆల్టో, హ్యుందాయ్ ఈఆన్, టాటా నానో, డాట్సన్ గో, షెవర్లే స్పార్క్ కార్లకు ఈ క్విడ్ కారు గట్టిపోటీనిస్తుందని అంచనా. క్విడ్ ధర ఆకర్షణీయంగా ఉండటంతో చిన్న కార్ల మార్కెట్లో ధరల పోరు షురూ అయినట్లేనని వారంటున్నారు. మైక్రో ఎస్యూవీ... ప్రస్తుతం 2 శాతంగా ఉన్న మార్కెట్ వాటాను రెండేళ్లలో 5 శాతానికి పెంచుకోవాలని రెనో ఇండియా లక్ష్యంగా పెట్టుకుంది. ఈ లక్ష్య సాధన కోసం మొత్తం కార్ల మార్కెట్లో నాలుగో వంతుగా ఉన్న చిన్న కార్ల సెగ్మెంట్‌పై దృష్టిసారించింది. క్విడ్ కారును రంగంలోకి తెచ్చింది. 5 శాతం మార్కెట్ వాటా సాధించే లక్ష్య సాధనకు క్విడ్ కారు ఇతోధికంగా తోడ్పడుతుందన్న ఆశాభావాన్ని రెనో ఇండియా సీఈఓ ఎండీ, సుమిత్ సాహ్ని వ్యక్తం చేశారు. ఇది చిన్న కారు అయినా చూడ్డానికి మైక్రో ఎస్‌యూవీలా ఉంటుందని చెప్పారు. కారు ప్రత్యేకతలు.. - సీఎంఎఫ్-ఏ ప్లాట్‌ఫామ్‌పై దీనిని రూపొందించారు. గ్రౌండ్ క్లియరెన్స్ 180 ఎంఎం, బూట్ స్పేస్ 300 లీటర్లు(చిన్న కార్ల సెగ్మెంట్లో అత్యధిక లగేజ్ స్పేస్ ఉన్న కారు ఇదే. - 7 అంగుళాల టచ్‌స్క్రీన్ మీడియా నావ్ సిస్టమ్(ఎంట్రీలెవెల్ కార్లలో తొలిసారి ఈ సదుపాయం), డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, 5 గేర్లు, 2 స్పీకర్లతో కూడిన స్టీరియో. - ఏసీ విత్ హీటర్, వైజర్ ఆన్ ప్యాసింజర్ సైడ్, ఇంజిన్ ఇమ్మొబిలైజర్, గ్లోవ్‌బాక్స్, కీ లెస్ ఎంట్రీ విత్ సెంట్రల్ లాకింగ్. - డ్రెవర్ ఎయిర్‌బ్యాగ్(ఆప్షనల్), వన్ టచ్ లేన్ చేంజ్ ఇండికేటర్, ముందు వైపు ఫాగ్ ల్యాంప్స్ వంటి ప్రత్యేకతలున్నాయి. రెండేళ్లు లేదా 50 వేల కి.మీ. వారంటీని కంపెనీ ఇస్తోంది. రెనో క్విడ్ కారు... కొన్ని సంగతులు... - భారత మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన క్విడ్ కారులో 98 శాతం స్థానిక విడిభాగాలనే వినియోగించారు. ఫలితంగా క్విడ్ నిర్వహణ వ్యయాలు ఈ సెగ్మెంట్లో అగ్రస్థానంలో ఉన్న ఆల్టో కారు కంటే 19 శాతం తక్కువగా ఉంటాయని సుమిత్ చెప్పారు. భారత్‌కు సంబంధించి ఒక్క కొత్త మోడల్లో ఇంత అధిక స్థాయిలో స్థానిక విడిభాగాలను వినియోగించిన తొలి కంపెనీ తమదేనని చెప్పారు. - ఈ కేటగిరీ కార్లలో అత్యంత తేలికైన(బరువు తక్కువగా ఉన్న) కారు ఇదే. - డస్టర్ కారులో ఉండే కొన్ని ఫీచర్లు ఈ కారులో కూడా ఉన్నాయి.