గాజా ఘర్షణల అంతానికి పిలుపు.. ట్రంప్‌కు ప్రధాని మోదీ మద్దతు | PM Modi Welcomes Trump’s Gaza Peace Plan for Israel-Palestine Conflict | Sakshi
Sakshi News home page

గాజా ఘర్షణల అంతానికి పిలుపు.. ట్రంప్‌కు ప్రధాని మోదీ మద్దతు

Sep 30 2025 11:41 AM | Updated on Sep 30 2025 12:02 PM

PM Modi Welcomes Trumps Plan to End Gaza Conflict

న్యూఢిల్లీ: గాజా ఘర్షణలను అంతం చేసే దిశగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సమగ్ర ప్రణాళిక ప్రకటించడాన్ని ప్రధాని నరేంద్ర మోదీ స్వాగతించారు. అధ్యక్షుడు ట్రంప్ చూపిన చొరవకు అందరూ మందుకువస్తారని, గాజాలో ఘర్షణలను అంతం చేసేందుకు, శాంతిని  నెలకొల్పేందుకు మద్దతు పలుకుతారని తాను ఆశిస్తున్నానని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
 

ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంతో పాటు గాజా ఘర్షణలను అంతం చేసేందుకు ట్రంప్ రూపొందించిన ప్రణాళికను వైట్ హౌస్ విడుదల చేసిన కొన్ని గంటలకు ప్రధాని మోదీ నుండి ఈ ప్రకటన విడుదలయ్యింది. అయితే అమెరికా ప్రభుత్వం రూపొందించిన ఈ ఒప్పందాన్ని ఇజ్రాయెల్ లేదా హమాస్ అంగీకరించాయా లేదా అనే దానిపై  ఇప్పటివరూ సమచారమేదీ లేదు. అయితే ఇంతలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు గాజాలో యుద్ధాన్ని ముగించే ప్రణాళికకు అంగీకారం తెలిపారని అధ్యక్షుడు ట్రంప్‌ వెల్లడించారు. కానీ హమాస్ ఈ నిబంధనలను అంగీకరిస్తుందా లేదా అనేది తెలియరాలేదు.

ఇజ్రాయెల్-హమాస్ ఘర్షణల ముగింపునకు ట్రంప్ 20 సూత్రాల ప్రణాళికను రూపొందించారు. బ్రిటిష్ మాజీ  ప్రధాన మంత్రి టోనీ బ్లెయిర్‌తో  సారధ్యంలో యుద్ధ-బాధిత పాలస్తీనా భూభాగంలో తాత్కాలిక పాలక మండలిని ఏర్పాటు చేయడానికి అధ్యక్షుడు ట్రంప్ ప్రతిపాదించారు. ఈ ‍ప్రణాళిక ప్రకారం ప్రజలు గాజాను విడిచి వెళ్లాల్సిన అవసరం లేదు. ఇరు వైపులా పరస్పర అంగీకారంతో యుద్ధాన్ని వెంటనే ముగించాలని ట్రంప్‌ ఆ ప్రణాళికలో పిలుపునిచ్చారు. ఈ ప్రణాళికను అంగీకరించిన 72 గంటల్లోపు హమాస్‌ తమ దగ్గరున్న ఇజ్రాయెల్‌ బందీలందరినీ విడుదల చేయాలని కూడా ప్రణాళికలో పేర్కొన్నారు. ఈ ప్రతిపాదిత శాంతి ఒప్పందాన్ని హమాస్ అంగీకరించకపోతే ఇజ్రాయెల్‌కు యునైటెడ్ స్టేట్స్ పూర్తి మద్దతు ఉంటుందని ట్రంప్ హామీనిచ్చారు. పాలస్తీనా ప్రజలు వారి విధికి బాధ్యత వహించాలని, తమ శాంతి ప్రతిపాదనను స్వీకరించాలని కోరారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement