పోలింగ్‌ కేంద్రం వద్ద కాల్పులు.. ఒక పోలీసు మృతి! | Sakshi
Sakshi News home page

Pakistan General Election 2024: పోలింగ్‌ కేంద్రం వద్ద కాల్పులు.. ఒక పోలీసు మృతి!

Published Thu, Feb 8 2024 10:54 AM

Pakistan Pakistan General Election 2024 Live Updates - Sakshi

పాకిస్తాన్‌ నేషనల్‌ అసెంబ్లీకి నేడు పోలింగ్‌ జరుగుతోంది. నాలుగు ప్రావిన్షియల్ అసెంబ్లీలలోని 336 స్థానాలకు ఓటింగ్ కొనసాగుతోంది. పాకిస్తాన్‌ రాజకీయ, ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటున్న సమయంలో ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. అందుకే  ఇవి ఎంతో కీలకం కానున్నాయి.

కాగా మూడు ప్రావిన్సుల అసెంబ్లీ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఈ మూడు ప్రాంతాల్లో పోటీకి దిగిన అభ్యర్థులు మృతి చెందిన నేపధ్యంలో ఇక్కడ ఎన్నికలు వాయిదా పడ్డాయి. వీటిలో ఎన్‌ఏ-8 (బజౌర్), పీకే-22 (బజౌర్), పీకే-91 (కోహట్), పీపీ-266 (రహీమ్ యార్ ఖాన్) ఉన్నాయి. ఇదిలా ఉండగా పాక్‌లోని ట్యాంక్ ఏరియాలోని ఒక పోలింగ్ బూత్‌పై దుండగులు జరిపిన కాల్పుల్లో ఒక పోలీసు మృతి చెందాడు. ఈ సమాచారాన్ని ఏఆర్‌వై న్యూస్ వెల్లడించింది. 

Advertisement
 
Advertisement