
లండన్: పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. నీరవ్ మోదీని భారత్‌కు అప్పగించేందుకు యూకే సిద్ధమైంది. ప్రస్తుతం బ్రిటన్ జైల్లో ఉన్న నీరవ్ మోదీని.. వచ్చే నెల 23వ తేదీన భారత్‌కు అప్పగించే అవకాశం ఉంది. ముంబై ఆర్డర్ రోడ్ జైల్లో నీరవ్ మోదీని ఉంచే అవకాశం ఉంది.
గుజరాత్‌కు చెందిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ(54) పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) కుంభకోణంలో ప్రధాన నిందితుడిగా అభియోగాలు ఎదుర్కొంటున్నారు. దాదాపు ₹14,000 కోట్ల మోసానికి పాల్పడి 2018లో దేశం విడిచి వెళ్లిపోయారు. ప్రస్తుతం ఆయన లండన్(యూకే)లో ఉన్నట్లు సమాచారం. దీంతో ఆయన అప్పగింత కోసం భారత్ అభ్యర్థించగా.. ఆ కేసు అక్కడి కోర్టులో విచారణ జరుగుతోంది.
అయితే తాజాగా నీరవ్ మోదీని భారత్‌కు అప్పగించేందుకు గ్రీన్ సిగ్నల్ లభించినట్లు సమాచారం. నీరవ్ మోదీకి భారత్‌లో అన్ని వసతులు కల్పిస్తామని, అత్యంత కట్టుదిట్టమైన ముంబై ఆర్డర్ రోడ్ జైల్లో ఉంచుతామని భారత్ హామీ ఇవ్వడంతో బ్రిటన్ కోర్టు అందుకు అంగీకరించింది. దాంతో నీరవ్ మోదీని భారత్‌కు రప్పించాలని ప్రయత్నానికి మార్గం సుగుమం అయ్యింది.
కాగా, ఈ ఏడాది జూలై నెలలో నీరవ్ మోదీ సోదరుడు నేహల్ మోదీని అమెరికాలో అరెస్టు చేశారు. అతడిని అప్పగించాలన్న భారత దర్యాప్తు సంస్థలు సీబీఐ, ఈడీలు అభ్యర్థించాయి. భారత ప్రభుత్వ అభ్యర్థన మేరకు ఇంటర్‌పోల్ రెడ్ కార్నర్ నోటీసు ఆధారంగా అమెరికా అధికారులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణం కేసులో కీలక పాత్ర పోషించినట్లు నేహల్‌పై ఆరోపణలు ఉన్నాయి మనీ లాండరింగ్ మరియు నేరపూరిత కుట్ర కేసుల్లో విచారణ ఎదుర్కొంటున్నారు.

ఇదీ చదవండి:
ట్రంప్ ప్రణాళికపై హమాస్ కీలక నిర్ణయం.. బందీల అప్పగింతకు మొగ్గు