న్యూయార్క్‌ వరద విలయం

New York Flood Videos Vehicles Submerged Streets Subways Drowned - Sakshi

అమెరికా ఆర్థిక రాజధాని అతాలకుతలం

నీట మునిగిన ప్రధాన కూడళ్లు, ఎయిర్‌పోర్టులు, సబ్‌వేలతో పాటు వీధులు

మురికివాడన తలపిస్తున్న మహానగరం

న్యూయార్క్: నిన్న రాత్రి కురిసిన భారీ వర్షాలకు అమెరికా ఆర్థిక రాజధాని న్యూయార్క్‌ అతలాకుతలమైంది. నగరంలోని ప్రధాన కూడళ్లు, ఎయిర్‌పోర్టులు, సబ్‌వేలతో పాటు వీధులన్నీ నీటమునిగాయి. అక్కడి డ్రైనేజి వ్యవస్థ అధ్వానం ఉండటంతో నీరు మొత్తం రోడ్లపైకి చేరడంతో వాహనాలు, పాదచారుల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది.

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నగరాల్లో ఒకటి పైగా ఆర్ధిక రాజధాని.. కానీ అక్కడ ఓ మోస్తరు వర్షం కురిసినా మహానగరం కాస్తా మురికివాడను తలపిస్తుంది. శుక్రవారం రాత్రి కురిసిన వానకు న్యూయార్క్ పరిస్థితి దాదాపుగా ఇలాగే మారింది. ఒకపక్క ఎడతెరపి లేకుండా కురుస్తున్న వానలు మరోపక్క ముంచుకొస్తున్న వరదలు మరోపక్క అక్కడి ప్రజాజీవనాన్ని అతలాకుతలం చేశాయి.

ఇక అక్కడి రహదారుల్లో దృశ్యాలను చూస్తే ఇది న్యూయార్క్ నగరమేనా అనిపించక మానదు. వరదనీటి మధ్యలోనే నిలిచిపోయిన వాహదారుల పరిస్థితి అయితే మరింత దారుణంగా ఉంది. ఇక్కడ చూడండి ఓ పోలీసాయన నిలిచిపోయిన కారు నుంచి ప్రయాణికుడిని భుజాన మోసుకుంటూ బయటకు తీసుకొచ్చారు. వరద ప్రభావానికి నగర వీధులు నీటికొలనులను తలపిస్తున్నాయి. వరదనీటిలో ముందుకెళ్తున్న బస్సులోకి నీళ్లు ప్రవాహంలా వస్తున్నాయి.  

విరామం లేకుండా కురుస్తున్న వానలకు నగరవాసులంతా ఇంటికే పరిమితమయ్యారు. ఎవరైనా బయటకు వెళ్లాలంటే నడుము లోతు వరకు చేరిన నీటిలో ఎదురీదుకుంటూ వెళ్లాల్సిన పారిస్తాయి ఏర్పడింది. పైన వాన.. కింద వరద.. మధ్యలో న్యూయార్క్ నగర పరిస్థితిని అద్దంపడుతూ సోషల్ మీడియాలో వీడియోలు తెగ హల్‌చల్ చేస్తున్నాయి. స్థానిక వాతావరణ శాఖ కూడా అత్యవసరమైతమే తప్ప ఎవ్వరినీ బయటకు రావొద్దని హెచ్చరించింది.

ఎయిర్‌పోర్టులు, సబ్‌వేలు, రైల్వే స్టేషన్ల పరిస్థితి అయితే మరింత దారుణంగా ఉంది. అడుగు వేయడనికి కూడా లేకుండా ఎక్కడికక్కడ నీరు చేరింది. అక్కడి మెట్లపై నీరు ప్రవాహం చూస్తే అవేవో జలపాతాలను చూసిన భావన కలుగుతోందని.. ఇంతగా అభివృద్ధి చెందిన దేశంలోనే పరిస్థితి ఇలా ఉంటే ఎలా అని ఈ వీడియోలను చూసిన నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: భారత హైకమిషనర్‌ను అడ్డుకున్న ఖలిస్థాన్ మద్దతుదారులు

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top