ఎయిర్‌క్రాఫ్ట్‌ నడుపుతూ 11 ఏళ్ల చిన్నారి.. పక్కనే మద్యం తాగుతూ తండ్రి.. మరుక్షణంలో..

man drinking beer 11 year old son flies plane crash - Sakshi

కొంతమంది వినోదం పేరుతో చేసే పనులు వారి ప్రాణాలకు ముప్పును తెచ్చిపెడతాయి. తాజాగా ఇటువంటి సంఘటనే చోటుచేసుకుంది. 42 ఏళ్ల పరిశోధకుడు గారాన్ మైయా, అతని కుమారుడు ఫ్రాన్సిస్కో మైయా నిర్లక్ష్యపు వినోదానికి పోయి మృత్యువు పాలయ్యారు. వీరు ‍ప్రయాణిస్తున్న ట్విన్ ఇంజిన్ బీచ్‌క్రాఫ్ట్ బారన్- 58 ఒక అడవిలో ప్రమాదానికి గురయ్యింది. 

ఈ దుర్ఘటనకు జరగడానికి కొన్ని నిముషాల ముందు రికార్డయిన వీడియో అందరినీ ఆలోచింపజేస్తోంది. దీనిని చూస్తే ఈ ప్రమాదం ఎందుకు జరిగిందో ఇట్టే తెలిసిపోతుంది. వీడియోలో మద్యం తాగుతున్న తండ్రి గారోన్ మైయా, ఎయిర్‌క్రాఫ్ట్‌ను కంట్రోల్‌ చేసే ప్రయత్నంలో ఉన్న 11 ఏళ్ల కుమారుడు ఫ్రాన్సిస్కో మైయా కనిపిస్తారు.  Express.co.uk తెలిపిన వివరాల ప్రకారం ఈ వీడియో దుర్ఘటన జరగడానికి ముందు షూట్‌ చేసినది. ఈ కేసు విచారణ చేపట్టిన అధికారులు ఈ వీడియో ఈ ఘటనకు ముందు సమయానిదా? కాదా అనే దానిపై దర్యాప్తు చేస్తున్నారు. ఈ వీడియో చూస్తే ఎయిర్‌క్రాఫ్ట్‌లోని తండ్రీకొడుకులు తమ రక్షణ విషయంలో నిర్లక్ష్యంగా ఉన్నట్లు కనిపిస్తున్నారని దర్యాప్తు అధికారులు చెబుతున్నారు.  

బ్రెజిల్‌కు చెందిన మీడియా రిపోర్టు ప్రకారం గారాన్ నోవా కాంక్విస్టాలోని రోండోనియా పట్టణంలోని తమ పొలం నుండి ఎయిర్‌ క్రాఫ్ట్‌లో బయలుదేరాడు. ఇంధనం నింపడానికి విల్హేనాలోని విమానాశ్రయంలో ల్యాండ్‌ చేశాడు. తన కుమారుడిని కాంపో గ్రాండే నుంచి వేరే ప్రాంతానికి తీసుకు వెళ్లాలని అతను అనుకున్నాడు. వారి కుమారుడు అక్కడ తల్లితో పాటు ఉంటూ స్కూలులో చదువుకుంటున్నాడు. కాగా ఎయిర్‌క్రాఫ్ట్‌ ప్రమాదంలో భర్త, కుమారుడు మృతిచెందారని తెలియగానే అతని భార్య ఎనాఫ్రిడోనిక్‌ ఆత్మహత్య చేసుకుంది. భర్త, కుమారుని అంత్యక్రియలకు ముందే ఆమె ఆత్మహత్య చేసుకుంది. కాగా ‍బ్రెజిల్‌ చట్టాల ‍ప్రకారం 18  ఏళ్ల వయసుదాటిన వారే అధికారికంగా ఎయిర్ క్రాఫ్ట్‌ నడిపేందుకు అర్హులు.
ఇది కూడా చదవండి: అలస్కాలో పగిలిన హిమానీనదం.. కేదార్‌నాథ్‌ విపత్తును తలపించేలా..
 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top