గాజాలో 24 గంటల్లో 81 మంది మృతి  | At least 81 people killed in Israeli strikes in Gaza | Sakshi
Sakshi News home page

గాజాలో 24 గంటల్లో 81 మంది మృతి 

Jun 29 2025 4:24 AM | Updated on Jun 29 2025 4:24 AM

At least 81 people killed in Israeli strikes in Gaza

డెయిర్‌ అల్‌–బలాహ్‌: గాజా వ్యాప్తంగా ఇజ్రాయెల్‌ ఆర్మీ యథేచ్ఛగా సాగించిన దాడుల్లో గత 24 గంటల వ్యవధిలో కనీసం 81 మంది పాలస్తీనియన్లు చనిపోయారని, 422 మంది గాయాల పాలయ్యారని గాజా ఆరోగ్య విభాగం తెలిపింది. గాజా నగరంలోని పాలస్తీనా స్టేడియంలో ఆశ్రయం పొందుతున్న 12 మంది శరణార్థులు సైతం ప్రాణాలు కోల్పోయారు. 

అపార్టుమెంట్లపై జరిగిన దాడిలో మరో 8 మంది మృతి చెందారని షిఫా ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. మరో 23 మృతదేహాలను తమ ఆస్పత్రి మార్చురీకి తీసుకువచ్చారని నాస్సెర్‌ ఆస్పత్రి అధికారులు చెప్పారు. టుఫ్పాలో నలుగురు చిన్నారులు సహా 11 మంది మృతి చెందారని అహ్లి ఆస్పత్రి తెలిపింది. రఫాలోని ఆహార పంపిణీ కేంద్రం వద్ద జనంపై ఇజ్రాయెల్‌ ఆర్మీ జరిపిన కాల్పుల్లో ఆరుగురు, ఖాన్‌యూనిస్‌ నగరంలోని అల్‌ ఖరారాలో నలుగురు చనిపోయారు.  

ఆ వార్తలు అబద్ధం: నెతన్యాహూ 
గాజాలో అమెరికా, ఇజ్రాయెల్‌ ప్రభుత్వాల సాయంతో ఏర్పాటు చేసిన ఆహార పంపిణీ కేంద్రాల వద్ద జనంపై కాల్పులు జరపాలని ఆరీ్మకి ఆదేశాలు జారీ చేసినట్లుగా 
వచి్చన వార్తలను ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహూ తీవ్రంగా ఖండించారు. అవన్నీ సైన్యాన్ని అప్రతిష్ట పాలు చేసే వార్తలంటూ కొట్టిపారేశారు. జనంపై ఆర్మీ ఉద్దేశపూర్వకంగా కాల్పులు జరుపుతోందంటూ వచి్చన వార్తలపై దర్యాప్తునకు ఆదేశిస్తామన్నారు. దాదాపు రెండున్నర నెలలుగా గాజాను పూర్తిగా దిగ్బంధించిన ఇజ్రాయెల్‌ సైన్యం నెల క్రితం ఆహార పంపిణీ కేంద్రాలను ప్రారంభించింది. ఈ కేంద్రాల వద్ద సైన్యం యథేచ్ఛగా సాగిస్తున్న కాల్పుల్లో ఇప్పటి వరకు కనీసం 500 మంది పాలస్తీనియన్లు చనిపోగా వందలాదిగా గాయపడ్డారు.

త్వరలోనే కాల్పుల విరమణ
వచ్చే వారం గాజాలో కాల్పుల విరమణ ఒప్పందం కుదిరే అవకాశముందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించారు. శుక్రవారం వైట్‌హౌస్‌లోని ఓవల్‌ ఆఫీస్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. గాజాలో కాల్పుల విరమణ ఒప్పందం ఖరారయ్యే దిశగా చర్చలు సాగుతున్నాయన్నారు. ఈ ఒప్పందంతోపాటు ఇరాన్, తదితర అంశాలపై చర్చించేందుకు ఇజ్రాయెల్‌ వ్యూహాత్మక వ్యవహారాల శాఖ మంత్రి రాన్‌ డెర్మర్‌ వచ్చే వారం వాషింగ్టన్‌ వెళ్తారని సమాచారం.   

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement