అంతరిక్షంలోకి మహిళల టీమ్‌.. సింగర్‌ కేటీ పెర్రీ ఏం చేసిందంటే.. | Katy Perry And Women Launched Into Space With Blue Origin NS-31, Watch Video Inside | Sakshi
Sakshi News home page

అంతరిక్షంలోకి మహిళల టీమ్‌.. సింగర్‌ కేటీ పెర్రీ ఏం చేసిందంటే..

Published Tue, Apr 15 2025 8:58 AM | Last Updated on Tue, Apr 15 2025 12:03 PM

Katy Perry And women launched Into space with Blue Origin

అంతరిక్ష పర్యాటకానికి ఊపు తెచ్చే దిశగా ప్రపంచ కుబేరుడు జెఫ్‌ బెజోస్‌కు చెందిన బ్లూ ఆరిజిన్‌ సంస్థ మరో ముందడుగు వేసింది. మహిళా సెలబ్రిటీలతో 11 నిమిషాల బుల్లి రోదసి యాత్రను సోమవారం విజయవంతంగా నిర్వహించింది. బెజోస్‌ కాబోయే భార్య లారెన్‌ శాంచెజ్‌తో పాటు ప్రఖ్యాత అమెరికా గాయని కేటీ పెర్రీ, జర్నలిస్టు గేల్‌ కింగ్, సినీ నిర్మాత కెరియన్‌ ఫ్లిన్, సైంటిస్టు అమందా గుయెన్, నాసా మాజీ ఇంజనీర్‌ ఆయేషా బోవ్‌ ఇందులో భాగస్వాములయ్యారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

బ్లూ ఆరిజన్ సంస్థకు చెందిన న్యూ ఫెపర్డ్ వ్యోమనౌక NS-31 ద్వారా ఈ యాత్ర సాగింది. ఏప్రిల్ 14న సోమవారం పశ్చిమ టెక్సాస్‌ నుంచి ఇది ఆరంభమైంది. ఈ వ్యోమనౌక నింగిలో 107 కిలోమీటర్ల ఎత్తుకు చేరుకుంది. అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన అంతరిక్ష సరిహద్దు అయిన కర్మాన్ రేఖను కూడా దాటగా, మహిళా ప్రముఖులు అంతా అక్కడ భార రహితస్థితిని ఆస్వాదించారు. మొత్తంగా 11 నిమిషాలు పాటు సాగిన ఈ యాత్ర సాగింది. అనంతరం ఈ వ్యోమనౌక భూమికి తిరిగొచ్చింది. బ్లూ ఆరిజిన్‌కు ఇది 11వ మానవసహిత అంతరిక్ష యాత్ర.  

అ‍యితే, ఈ అంతరిక్ష యాత్ర సందర్బంగా వ్యోమనౌకలో ఉన్న మహిళలు ఎంజాయ్‌ చేశారు. వారంతా భార రహిత స్థితిలోకి వెళ్లిన తర్వాత ఆనందం వ్యక్తం చేశారు. ఇక, రోదసి నుంచి కిందకు దిగిన తర్వాత అమెరికా గాయని కేటీ పెర్రీ ఆనందంతో భూమిని ముద్దాడారు. వీరికి సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

రోదసిలోకి మహిళా సెలబ్రిటీలు

 

ఇదిలా ఉండగా.. బ్లూ ఆరిజిన్‌ సంస్థ 2000 సంవత్సరంలో  ఏర్పాటైంది. ఈ సంస్థకు ఇది 11వ అంతరిక్ష యాత్ర. అమెరికాకు సంబంధించి పూర్తిగా మహిళలతో రోదసి యాత్రను నిర్వహించడం ఇదే తొలిసారి. 2021వ సంవత్సరం నుంచి బ్లూ ఆరిజిన్ సంస్థ రోదసి యాత్ర నిర్వహిస్తోంది. ఇప్పటి వరకు మొత్తంగా 10 మిషన్లు చేపట్టగా, 52 మందిని అంతరిక్షంలోకి తీసుకెళ్లింది. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement